సెక్స్ విషయంలో ఎక్కువ మందికి ఉండే సందేహాలు

సెక్స్.. నిజానికి దీని అవసరం చాలానే ఉన్నప్పటికీ దీని గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన దేశంలో సెక్స్ గురించి ఇతరులతో చర్చించడం చాలా పెద్ద తప్పుగా భావిస్తారు. అయినప్పటికీ ఈ విషయం గురించి తెలుసుకోవాలనే ఆత్రుత మాత్రం వారూ వీరూ అనే తేడా లేకుండా అందరికీ ఉంటుంది. మీకు తెలుసా? రోజులో ఒక్కసారైనా సెక్స్ గురించి ఆలోచించనివారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఇది ఎంత ఆనందాన్నిస్తుందో.. కొన్నిసార్లు అదే పెద్ద సమస్యగా మారిపోతుంది. దీనికి కారణం సెక్స్ విషయంలో ఉండే అపోహలే. ఈ అపోహలను వెంటనే తొలగించుకోకపోతే.. అపోహ కాస్త పెద్ద సమస్యగా మారిపోతుంది. కొన్నిసార్లు ఇది ఆలూమగల మధ్య కీచులాటలకు సైతం దారి తీయవచ్చు. అందుకే సాధారణంగా సెక్స్ విషయంలో ఉండే అపోహలు, అతిశయోక్తులు తొలగించుకుంటే.. ఎలాంటి అపార్థాలకు తావు ఇవ్వకుండా చూసుకోవచ్చు.

అతిగా ఊహించుకోవద్దు

సెక్స్ విషయంలో అబ్బాయిలకుండే అపోహలు, భయాలు అన్నీ అంగం పరిమాణం గురించే అయి ఉంటాయి. పోర్న్ వీడియోస్ చూసి అదే నిజమనుకుని అలాగే శృంగారం చేయాలేమోనని అనుకుంటారు. వారు అనుకోవడం మాత్రమే కాదు.. భాగస్వామి నుంచి కూడా ఈ విషయంలో ఎక్కువగా ఆశిస్తుంటారు. కొన్నిసార్లు అసహజమైన పోకడలను అనుసరించాలని కోరుకుంటూ ఉంటారు. తమ భాగస్వామి శారీరక సౌష్ఠవం నాజూకుగా ఉంటేనే సెక్స్ ఆస్వాదించగలమని అనుకుంటూ ఉంటారు. ఈ విషయంలో అమ్మాయిలూ ఏమీ తక్కువ కాదు. తన భాగస్వామి శృంగార సామర్థ్యానికి ఎక్కువ సమయం సెక్స్ లో పాల్గొనడమే కొలమానంగా భావిస్తారు.

అవాంఛిత గర్భం(Unwanted Pregnancy)

ఒక్కసారి సెక్స్ లో పాల్గొన్నా గర్భం వస్తుందన్న భయం ఎక్కువ మందిలో ఉంటుంది. ఈ అపోహ మహిళలకే అనుకుంటే పొరపాటే. పురుషులకూ ఉంటుంది. గర్భనిరోధకాలు వాడినప్పటికీ.. అవి పని చేస్తాయో లేదోనన్న కంగారు కనిపిస్తుంటుంది. కండోమ్ ఉపయోగించడం వల్ల గర్భం ధరించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొందరు కండోమ్ ఉపయోగించకుండా.. స్కలనం సమయం లో తమ అంగాన్ని వెనక్కి తీసుకునే టెక్నిక్ వాడుతారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని వల్ల భాగస్వామికి అసంతృప్తి మిగలడం మాత్రమే కాకుండా.. గర్భం రావడానికి అవకాశాలూ ఉంటాయి. కండోమ్ ఉపయోగించడం మీకు ఇష్టం లేకపోతే.. వైద్యులను సంప్రదించి ఇతర గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించడం మంచిది.

ఫోర్ ప్లే

శృంగారం తొందర తొందరగా ముగించే పని కాదు. సెక్స్ మీకు మాత్రమే కాదు.. మీ భాగస్వామికి కూడా ఆనందాన్ని పంచివ్వాలి. అందుకే ఫోర్ ప్లే చేయడం అవసరం. అది మీ భాగస్వామిని సంతృప్తస్థాయికి తీసుకెళుతుంది. లేకపోతే సంభోగం మీకూ, మీ భాగస్వామికి అసౌకర్యంగా ఉంటుంది. సెక్స్ ఎంజాయ్ చేయాలంటే లూబ్రికేషన్ అవసరం. అది ఫోర్ ప్లే తోనే సాధ్యం.

ఆత్రుత

సెక్స్ పట్ల పురుషుల్లో ఆత్రుత అధికంగా ఉంటుంది. బాగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే టెన్షన్ అన్నమాట. స్తంభనలు కొనసాగించగలనా? ఎక్కువ సేపు రతి చేయగలనా? అని లేనిపోని అనుమానాలు పెట్టుకుని భయపడుతుంటారు. ఈ భయమే మిమ్మల్ని సగం సెక్స్ ఎంజాయ్ చెయ్యకుండా చేస్తుంది. అనవసరమైన భయాల వల్ల మీకు కలిగే లాభమేమీ లేదు. దీనికి పరిష్కారం మీ నిగ్రహాన్ని పెంచుకోవడమే. భాగస్వామి తోడ్పాటు, సహకారంతో ఇది సాధ్యమవుతుంది. కూడా ఇందుకు అవసరం. ఫోర్ ప్లే చేస్తే మనకి తెలీకుండానే అంగ స్తంభన జరుగుతుంది.

శీఘ్ర స్కలనం

పురుషులకి ఇది సర్వ సాధారణమైన సమస్య. తొందరగా స్కలనం కావడాన్ని ఎవరు కోరుకోరు. దీనికి సరైన కారణాలు లేవు కానీ త్వరగా స్కలనం జరగకుండా చూసుకోవచ్చు. దీనికి కొన్ని టెక్నిక్స్ అవసరం. స్క్వీజ్ టెక్నీక్, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నీక్ గురుంచి తెలుసుకోవాలి.

వాస్తవానికి ఈ అపోహలన్నీసరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడమే కారణం. కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా సెక్స్ కౌన్సిలర్ ను సంప్రదించండి.

Feature Image: Pexels

Comments

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.