జపనీస్ వాటర్ హెల్త్ థెరపీ: ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చే వాటర్ థెరపీ ( Japanese water therapy benifits )

శరీరం సక్రమంగా పనిచేయాలంటే రోజూ తగినంత నీరు తాగడం అవసరం. కానీ ఎంత మంది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని రోజూ నీరు తాగుతున్నారు? దాని ప్రభావం మీకు ఈ రోజు తెలియకపోవచ్చు కానీ.. భవిష్యత్తులో నీరు తాగకపోవడం వల్ల కలిగే అనర్థాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. సాధారణంగా నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్కి మాత్రమే గురవుతామని అనుకుంటారు. కానీ అంతకు మించిన దుష్ప్రభావాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది. తలనొప్పి, నిద్ర పట్టకపోవడం, నీరసం, ఆహారం జీర్ణమవకపోవడం లాంటివి సాధారణంగా ఎదురవుతాయి. చర్మం కూడా డల్ గా మారిపోతుంది. ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే నీరు తాగడం మంచిది. అందుకే ఈ విషయంలో మనం జపాన్ దేశస్థులను ఆదర్శంగా తీసుకుందాం. వాళ్లు పాటించే ఈ పద్ధతిని జపనీస్ వాటర్ థెరపీగా పిలుస్తున్నారు.

జపనీస్ వాటర్ థెరపీని ఎలా పాటించాలి?

స్టెప్ 1: నిద్ర లేచిన తర్వాత నాలుగు గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగాలి. ఖాళీ కడుపుతో అంటే పరగడుపునే ఈ నీటిని తాగాల్సి ఉంటుంది. ఫ్లేవర్ కోసం నిమ్మరసం కలుపుకోవచ్చు.

స్టెప్ 2: నీరు తాగిన తర్వాత బ్రష్ చేసుకోవచ్చు. కానీ 45 నిమిషాల వరకు ఏమీ తినకూడదు తాగకూడదు.

స్టెప్ 3: 45 నిమిషాల సమయం పూర్తయిన తర్వాత తినడం తాగడం లాంటివి చేయచ్చు.

స్టెప్ 4: ఏదైనా తినడానికి అరగంట ముందు నీరు తాగాలి. అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసిన రెండు గంటల వరకు నీటిని తాగకూడదు.

జపనీస్ వాటర్ థెరపీ వల్ల కలిగే ప్రయోజనాలు

  1. ఉదయాన్నే దాదాపుగా అరలీటరు నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి.
  2. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
  3. మెటబాలిజం ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా బరువు పెరగదు.
  4. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
  5. కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
  6. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
  7. జుట్టు రాలిపోవడానికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణం. తక్కువ నీరు తాగడం వల్ల జుట్టు బిరుసుగా, డల్ గా తయారవుతుంది. రోజూ ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల జుట్టు కుదుళ్లకు తగిన పోషణ అందుతుంది. దీనివల్ల జుట్టు షైనీగా, స్మూత్ గా తయారవుతుంది.
  8. పరగడుపునే అరలీటరు నీరు తాగడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల చర్మం యంగ్ గా తయారవుతుంది.
  9. నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య, అధిక రక్తపోటు, ఆర్థరైటిస్, యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, టీబీ, జాయింట్ పెయిన్స్ వంటివి తగ్గుముఖం పడతాయి.

Feature Image: Unsplash.com

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.