తక్కువ సమయంలో అధిక బరువు తగ్గేలా చేసే 6 చిట్కాలు ( 6 simple tips to lose over weight )

బరువు తగ్గడానికి ఎన్నో మార్గాలున్నాయి.  వాకింగ్, వర్కవుట్లు, జుంబా డ్యాన్స్.. తదితర మార్గాల్లో అధిక బరువు తగ్గించుకుని ఫిట్ గా మారడానికి ప్రయత్నించేవారుంటారు. అయితే కొంతమంది ఎంత బాగా వర్కవుట్లు చేసినప్పటికీ వారి శరీర బరువులో ఏమాత్రం మార్పు కనిపించదు. దీనికి కారణం ఆహారం విషయంలో సరైన శ్రద్ధ వహించకపోవడమే. వ్యాయామం చేయడంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా బరువు వేగంగా తగ్గొచ్చు. దానికోసం మనం ఏం చేయాలో తెలుసుకుందాం.

1. ప్రొటీన్లతో నిండిన బ్రేక్ఫాస్ట్ ( Protein-full breakfast )

సాధారణంగా ఉదయం మనం ఏ ఇడ్లీనో.. దోసెనో తింటూ ఉంటాం. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇవి చాలా త్వరగా జీర్ణమయిపోతాయి కాబట్టి మళ్లీ ఆకలి వేస్తుంది. మళ్లీ ఏదో ఒకటి తింటూ ఉంటా. ఇలా చేస్తూ ఉంటే బరువు తగ్గడం కష్టమవుతుంది. అందుకే అల్పాహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్లు నిండిన ఓట్స్, గ్రీక్ యోగర్ట్, పాలు, గుడ్లు, క్వినోవా, బ్రౌన్ బ్రెడ్ వంటివి అల్పాహారంగా తీసుకోవడం మంచిది.

2. చక్కెర ( Sugar ) కలిపిన పానీయాలకు దూరంగా..

ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి మంచి చేస్తాయని రోజూ తాగడం చాలామందికి ఉన్న అలవాటు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. జ్యూస్ రుచిగా ఉండాలని అందులో నచ్చినంత చక్కెర కలుపుకుని తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీరు బరువు తగ్గడం మాట అటుంచి మరింత ఎక్కువ పెరుగుతుంటారు. కాబట్టి మీరు వెయిట్ తగ్గాలనుకుంటే.. జ్యూస్ లో పంచదార కలపకుండా తాగడం మంచిది.

3. భోజనానికి అరగంట ముందు నీరు ( water )

బరువు తగ్గాలని ప్రయత్నించేవారు తగినంత నీరు తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజుకి రెండున్నర లీటర్లు నీరు తాగడం మంచిది. ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి అరగంట ముందు అరలీటరు నీరు తాగడం వల్ల మూడు నెలల్లో 44 శాతం మేర బరువు తగ్గినట్టు గుర్తించారు. కాబట్టి భోజనానికి అరగటం ముందు నీరు తాగడం అలవాటు చేసుకోండి.

4. బరువు తగ్గించే ఆహారం ( Food )

బరువు తగ్గడానికి తిండి కూడా తగ్గించేసేవారుంటారు. దానివల్ల బరువు తగ్గడం మాట అటుంచితే.. పోషకాహార లోపం తలెత్తుతుంది. కాబట్టి మీరు తినే ఆహారం విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆకుకూరలు, చేపలు, అవకాడో, ఉడకబెట్టిన బంగాళాదుంప, ముడి ధాన్యాలు, పండ్లు, సబ్జ గింజలు, పెరుగు వంటివి ప్రతి రోజూ ఆహారంలో భాగంగా చేసుకోండి. ఇవి మీకు కావాల్సిన పోషకాలను అందించడంతో పాటు అదనపు బరువు పెరగకుండా చేస్తాయి.

5. నెమ్మదిగా ఆహారం నమిలి తినాలి( Chew your food slowly )

కొంతమందికి ఆహారం చాలా వేగంగా తినడం అలవాటు. ఇలా తినేవారిలో బరువు ఎక్కువగా పెరుగుతుంటారు. ఎందుకంటే.. కడుపు నిండిన భావన లేకపోవడం వల్ల మళ్లీ మళ్లీ తినాల్సి వస్తుంది. కాబట్టి ఆహారాన్ని నెమ్మదిగా పూర్తిగా నమిలి తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో బరువు తగ్గించే హార్మోన్లు రిలీజవుతాయి.

6. సరిపడినంత నిద్ర ( Betters sleep )

రోజూ తగినంత నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. కాబట్టి ప్రతి రోజూ కనీసం ఎనిమిది గంటల సమయం కచ్చితంగా నిద్రకు కేటాయించండి.

Featured Image: Pixabay

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.