తిప్పరా మీసం సినిమా రివ్యూ

చిన్నచిన్న రోల్స్ తో కెరీర్ మొదలుపెట్టి.. వైవిధ్యభరితమైన సినిమాల హీరోగా మారాడు శ్రీ విష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజాగా ‘తిప్పరా మీసం’ సిన్మాతో థియేటర్లలోకి వచ్చారు. ఎల్. కృష్ణ విజయ్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే అంచనాలు పెంచుకున్నారు. మరి వారి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీసు వద్ద మీసం మెలేశాడా? లేదా చతికిలపడ్డాడా?

స్థూలంగా కథ విషయానికి వస్తే.. మణి శంకర్ అలియాస్ మణి(శ్రీ విష్ణు) డీజేగా పనిచేస్తుంటాడు. కానీ చిన్న వయసులోనే డ్రగ్స్ కు అలవాటు పడతాడు. అతన్ని బాగు చేసే ఉద్ధేశంతో మణి తల్లి అతన్ని డీఅడిక్షన్ సెంటర్లో చేర్పిస్తుంది. దీంతో ఆమెపై కోపాన్ని, కసిని పెంచుకుంటాడు. డీఅడిక్షన్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మత్తులోనే మునిగి తేలుతుంటాడు. బెట్టింగ్ లు కూడా కడుతుంటాడు. ఈ క్రమంలోనే ఓ బుకీకీ పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటాడు. వాటిని తీర్చేందుకు ఆస్తిని పంచివ్వమని తల్లిపై ఒత్తిడి తీసుకువస్తాడు. దబాయించిందే కాకుండా.. తల్లిపైనే తిరిగి చెక్ బౌన్స్ కేస్ పెడతాడు. ఇలా అనాలోచితంగా చేసే పనులన్నీ మణిని మనిషిగా మరింత దిగజారుస్తాయి. ఇలాంటి నీచమైన వ్యక్తిత్వం కలిగిన హీరో.. తల్లి విలువను ఎలా తెలుసుకుంటాడు? వ్యసనాలకు ఎలా దూరమవుతాడనేదే ఈ సినిమా కథ.

కథపరంగా చూస్తే మంచి ఆర్థ్రత నిండినదే అయినప్పటికీ దాన్ని తెరమీద చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథనం కూడా అంతంతమాత్రమే. ట్రైలర్ చూసినప్పుడే అర్జున్ రెడ్డి తరహాలో సినిమాను తీసినట్టనిపించినా.. ఆ స్థాయిని అందుకోవడంలో మాత్రం సినిమా విఫలమైంది. రొమాన్స్ డోస్ పెంచితే సరిపోతుందనుకున్నారో ఏమో.. కొన్ని సన్నివేశాలు కాస్త పచ్చిగానే చూపించారు. హీరోకి తల్లికి, ప్రేమించిన అమ్మాయిక మధ్య ఎమోషనల్ ఎటాచ్మెంట్ కనిపించదు. ఎంత సేపు మత్తు, ఆ మత్తులో తల్లిని ఎలా ఏడిపించాలా? అని చూడడమే తప్ప కథేమీ కనిపించదు. తన బాగు కోసం డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించిన తల్లిపై కోపం రావడానికి కారణమేంటో అర్థం కాదు.

హీరో క్యారెక్టరే ఇంత దారుణంగా ఉంటే హీరోయిన్ మరీ దారుణం. ఆ పాత్రకు ఓ వ్యక్తిత్వం అంటూ ఉండదు. హీరో ఐలవ్యూ చెప్పగానే టక్కున ప్రేమించేస్తుంది. అంతేగాని ఇలాంటి అవలక్షణాలున్నవాడిని ఎందుకు ప్రేమించాలని ఆలోచించదు. సినిమా మొదటి నుంచి చివరి వరకు మన సహనానికి ఓ పెద్ద పరీక్షలాగా అనిపిస్తుంది. ప్రథమార్థం అంతా హీరో క్యారెక్టర్ పరిచయం చేయడానికి సరిపోతే.. ద్వితీయార్థం అంతా ఓ మర్డర్ చుట్టూ తిరుగుతుంది. హాల్లోని ప్రేక్షకులకు మాత్రం బోర్ కొడుతుంది. కానీ చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా ఆసక్తికరంగా నడుస్తుంది.

కథానాయకుడిగా నిలదొక్కుకోవాలంటే.. కేవలం నటనకు ఆస్కారమున్న పాత్రను ఎంచుకుంటే సరిపోదు. ఆ సినిమా ఎంత వరకు ప్రేక్షకులకు చేరువ అవుతుందో కూడా చూసుకోవాలి. ఈ సినిమా చూస్తే శ్రీ విష్ణు మొదటిదానికే ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తోంది. దర్శకుడు సైతం కథానాయకుడి పాత్రకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంది. దీంతో మంచి ఆర్థ్రత ఉన్న కథ, ఆసక్తికరంగా సాగాల్సిన కథనం రెండూ నీరుగారిపోయాయి. నిర్మాణ విలువలు తెరపై అంత గొప్పగా ఏమీ కనిపించలేదు.

కథలో ఇంటెన్సిటీ.. కథనంలో సీరియస్ నెస్ ఉన్నప్పుడు హీరో పాత్ర సీరియస్ గా చూపిస్తే బాగానే ఉంటుంది. కానీ ఆ రెండూ లేనప్పుడు హీరోని సీరియస్ గా చూపించడం వల్ల అది అంతగా ప్రేక్షకులకు రీచ్ అవదు. ‘తిప్పరా మీసం’ సినిమా విషయంలో జరిగిందిదే. పైగా ఆడియన్స్ కి కనెక్టయ్యే ఎమోషన్ కూడా మిస్సయ్యింది. వెరసి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.