సేఫ్ సెక్స్ కోసం మీరు చేయాల్సిన నాలుగు పనులు

బాగా ఉద్రేకంలో ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఉపయోగించకపోయినా ఫర్వాలేదని మీకనిపించవచ్చు. కారణం.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఆలోచించకపోవడమే. మీ పార్టనర్ మీద మీకు ఎంతైనా నమ్మకం ఉండొచ్చు. లేదా మీ పార్టనర్ ఎంత హాట్ గా ఐనా ఉండొచ్చు. ఆ విషయంలో మీకెన్ని ఫాంటసీలైనా ఉండొచ్చు. కానీ ముందు సేఫ్టీ చూసుకున్న తర్వాతే ఏదైనా. ఇలా రక్షణ పద్ధతులు పాటించడం వల్ల లైంగిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఇది మీకూ, మీ పార్టనర్ కి మేలు చేసేదే.

పార్టనర్ తో మాట్లాడండి..

సేఫ్టీ మెథడ్స్ పాటించే విషయంలో చాలామందికి అపోహలుంటాయి. వాటివల్ల సెక్స్ ఎంజాయ్ చేయలేమేమో అనే అభిప్రాయం ఉంటుంది. ఈ రెండింటికీ సంబంధం లేనే లేదు. వీటిని పాటించడం వల్ల మీతో పాటూ మీ భాగస్వామికి కూడా మేలు జరుగుతుంది. సెక్సువల్ ట్రాన్స్ మిషన్ డిసీజెస్ సోకకుండా ఉంటాయి. అలాగే అవాంఛిత గర్భమూ రాకుండా ఉంటుంది. ఈ విషయాన్ని మీ పార్టనర్ తో మాట్లాడి సేఫ్టీ మెజర్స్ పాటించడానికి ఒప్పించండి.

కండోమ్..

మీ భాగస్వామికి కండోమ్స్ తీసుకురావడం మరచిపోయే అలవాటు ఉంటే.. మీరే వాటిని కొనుగోలు చేయండి. వీటి కోసం దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మీకు నచ్చిన బ్రాండ్ లేదా మీకు నచ్చిన టైప్ కండోమ్స్ ఆర్డరిచ్చుకోవచ్చు. ఇంటర్ కోర్స్ సమయంలో కండోమ్ బ్రేక్ అయితే.. మరొకటి సిద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. ఓరల్ సెక్స్ చేసేటప్పుడు సైతం కండోమ్ ఉపయోగించడం తప్పనిసరి. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ తరహా సెక్స్ చేసేవారు సైతం కండోమ్ ఉపయోగించాల్సిందే. దీనికోసం ఫ్లేవర్డ్ కండోమ్స్ ఉపయోగించవచ్చు.

పరిమితుల్లో ఆల్కహాల్ సేవించాలి

మీ భాగస్వామికి ఆల్కహాల్ సేవించే అలవాటు ఉంటే.. అది పరిమితుల్లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ముఖ్యంగా కలయికకు ముందు ఆల్కహాల్ సేవిస్తున్నట్లయితే.. అది లిమిట్లో ఉండేలా చూసుకోవాలి. మీకు అలవాటున్నా.. మీరు కూడా కాస్త తక్కువగా తాగితేనే మంచిది. ఎందుకంటే.. ఆల్కహాల్ తాగడం వల్ల ఎక్కే మత్తు.. ప్రొటెక్షన్ స్కిప్ చేసేలా చేయచ్చు. లేదా ప్రొటెక్షన్ అవసరమా అనిపించేలా చేయచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.

కాంప్రమైజ్ కావద్దు..

కొన్నిసార్లు సెక్స్ విషయంలో అనాలోచితంగా మీరు చూపించే అజాగ్రత్త మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేయచ్చు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రావడం, ఎస్టీడీలు, హెచ్ఐవీ వంటివి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి సేఫ్ సెక్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వొద్దు. ప్రస్తుతం మేల్, ఫిమేల్ కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి.. మీకు ఏది బెటరనిపిస్తే అది ఉపయోగించండి.

Feature Image: pexels

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.