లంగా, ఓణీలో( Half saree / Lehenga ) కార్తీక పౌర్ణమి వెన్నెల్లా మెరిసిపోండి..

నాలుగైదేళ్ల క్రితం వరకు లంగా, ఓణీ అంటే పల్లెటూరి అమ్మాయిల స్టైల్ గా చూసేవారు. సిటీ గర్ల్స్ వాటికి దూరంగానే ఉండేవారు. కానీ మారుతున్న ఫ్యాషన్ సరళి.. సంప్రదాయాన్ని ట్రెండీగా మార్చి అందరికీ చేరువ చేసింది. లంగాఓణీని లెహంగా ( Lehenga ) గా మార్చి ఆడవారికి చేరువ చేసింది. ఫలితంగా చిన్న పిల్లల నుంచి 40 ఏళ్ల వరకున్న మహిళలు వీటిని చాలా ఇష్టంగా ధరిస్తున్నారు. ఇప్పుడు కార్తీక మాసం. అందరూ భక్తిభావంతో గడిపే నెల ఇది. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం లెహంగా ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి.. ఈ కార్తీక పౌర్ణమికి తగ్గట్టుగా సంప్రదాయబద్ధంగా రెడీ అయ్యేందుకు కొన్ని టిప్స్..

పట్టు పరికిణీ, ఓణీ (Half Saree)

పట్టు పరికిణీ, ఓణీ ధరిస్తే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. మీరు ఎంచుకునే పరికిణికీ అంచుతో పాటు బుటా పనితనం కూడా ుండేలా చూసుకోవాలి. లంగా అంచు రంగుకి మ్యాచింగ్ ఓణీ వేసుకోవాలి. బ్లౌజ్ కూడా జరీ అంచుతో ఉంటే బాగుంటుంది. పట్టు సోయగానికి తోడుగా.. కుందన్ మెరుపులు కూడా తోడయితే మరింత అందంగా ఉంటుంది.

కాంట్రాస్ట్ రంగుల మ్యాచింగ్( Contrast color matching)

లంగాఓణీ ధరించినా.. ఇతరుల కంటే భిన్నంగా కనిపించాలనుకునేవారు.. కాంట్రాస్ట్ రంగుల్లో ఉన్నవాటిని ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే రంగుల కాంబినేషన్ ఒకదానికి ఒకటి నప్పే విధంగా ఉండాలి.

సంప్రదాయంలో ఆధునికం

సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే ఆధునికంగా కనిపించాలని భావించేవారు.. డిజైనర్ లెహంగాలను ధరించవచ్చు. ఇవి మిమ్మల్ని ఫ్యాషనబుల్ గా అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. డిజైనర్ లెహంగాలు మీరు ధరించాలనుకుంటే.. నెటెడ్, సీత్రూ తరహావి బాగుంటాయి. ఎంబ్రాయిడరీ చేసినవైతే మిమ్మల్ని మరింత అందంగా మార్చేస్తాయి.

Also Read: మిమ్మల్ని హీరోయిన్ అంత అందంగా మార్చేసే బ్యూటీ టిప్స్

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.