రక్తహీనతను తగ్గించే బీట్రూట్ ( Health benefits of beetroot )

ప్రతి వంద మందిలో 25 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడమే ఎనీమియా. దీనికి కారణం ఐరన్ లోపమే. మనం తినే ఆహారంలో ఐరన్ లేకపోవడం లేదా ఆహారంలోని ఐరన్ ను శరీరం శోషించుకోలేకపోవడం వల్ల రక్త హీనత సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎనీమియా వల్ల నీరసం, శక్తి హరించుకుపోయినట్లు అనిపించడం, తలనొప్పి, అరచేతుల్లో చెమటలు పట్టడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారికి వైద్యులు ఔషధాలతో పాటు కొన్ని రకాల ఆహారపదార్థాలను తినమని సూచిస్తుంటారు. అందులో ముఖ్యమైనది బీట్రూట్. ఈ దుంపలో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని ఏ రూపంలో తిన్నా సరే శరీరానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని మీ డైట్లో భాగం చేసుకోవడం మంచిది.

బీట్రూట్లో ఉండే పోషకాలు ( Nutrients in Beetroot )

బీట్రూట్ లో పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ సైతం సమృద్ధిగా లభిస్తుంది. పైగా క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి డైటింగ్ చేసేవారు దీన్ని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల వారికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. విటమిన్ కె, క్యాల్షియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఫోలేట్ ఉంటాయి. బీట్రూట్ పచ్చిది తిన్నా, జ్యూస్ తాగినా లేదా దానితో ఏదైనా రెసిపీ తయారు చేసుకుని తిన్నా.. మనకు అందే పోషకాల విలువ ఏ మాత్రం తగ్గదు.

ఇన్ని పోషకపదార్థాలున్నాయి కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు బీట్రూట్ కచ్చితంగా తినాల్సిందే. రోజుకో గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరానికి శక్తి అందుతుంది. రక్తహీనత ఒక్కటే కాదు.. బీపీ, గుండె సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. దీనిలో ఉన్న పీచుపదార్థం(ఫైబర్) రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. దీనిలో ప్రొటీన్ కూడా అధికంగా ఉంటుంది. పైగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి డైటింగ్ చేసేవారు దీన్ని కచ్చితంగా తమ డైట్ చార్ట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

బీట్రూట్ జ్యూస్ రెసిపీ ( Beetroot juice recipe )

బీట్రూట్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ బీట్రూట్ జ్యూస్ తాగడానికి చాలా మంది ఇష్టపడరు. దానికి కారణం దానికున్న తీపి రుచే. రెగ్యులర్ రెసిపీ కాకుండా.. కాస్త కొత్తగా ఈ బీట్రూట్ జ్యూస్ ట్రై చేయండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

బీట్రూట్ జ్యూస్ కోసం కావాల్సినవి

మీడియం సైజ్ బీట్రూట్లు రెండు, మీడియం సైజులో ఉన్న సీడ్లెస్ కీరదోస(ఇంగ్లీష్ కుకుంబర్) ఒకటి, అంగుళం పొడవున్న అల్లం ముక్క, నిమ్మకాయ ఒకటి.

బీట్రూట్ జ్యూస్ తయారీ

బీట్రూట్, కీరదోస, అల్లం శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. జ్యూస్ చేయడం పూర్తయిన తర్వాత సరిపడినంత నిమ్మరసం కూడా వేసి కలిపితే జ్యూస్ తయారైనట్లే.

Feature Image: Pixabay

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.