లిప్స్టిక్ వేసుకునేటప్పుడు చేసే పొరపాట్లు

ఒక్క స్వైప్ తో అమ్మాయిలను అందంగా మార్చేస్తుంది లిప్స్టిక్. అసలు నేటితరం అమ్మాయిల్లో లిప్స్టిక్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ లిప్స్టిక్స్ లో ఎన్నో రకాలున్నాయి. మాట్టె, క్రీమ్, గ్లోసీ, శాటిన్, మాయిశ్చరైజింగ్, షీర్.. ఇలా లిప్ మేకప్ విషయంలో మనకున్న అవసరాలను తీర్చే విధంగా మార్కెట్లో విభిన్నమైన రకాల లిప్స్టిక్స్ ఉన్నాయి. కానీ వీటిని అప్లై చేసుకునేటప్పుడు చేసే చిన్నచిన్న పొరపాట్ల కారణంగా కొంచెం వయసు ఎక్కువైనట్లుగా, కాస్త అందం తగ్గినట్లుగా కనిపించవచ్చు. లిప్స్టిక్ వేసుకునేటప్పుడు చేసే పొరపాట్లు తెలుసుకుంటే.. వాటిని చేయకుండా జాగ్రత్తపడొచ్చు.

1. లిప్స్టిక్ వేసుకునే ముందు ఎక్స్ఫోలియేట్ చేసుకోకపోవడం

మన పెదవులపై ఉండే చర్మం చాలా పలుచగా ఉంటుంది. నిజానికి మన శరీరంపై ఉన్న స్కిన్ కంటే.. పెదవులపై ఉన్నదే చాలా పలుచగా ఉంటుంది. అందుకే అవి త్వరగా తేమను కోల్పోతుంటాయి. పెదవులు తరచూ పగిలిపోవడానికి ముఖ్యమైన కారణం ఇదే. ఇలా ఉన్నప్పుడు లిప్స్టిక్ వేసుకుంటే… అది సరిగ్గా అలుముకోదు. కాబట్టి పెదవులను అప్పుడప్పుడూ స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం మార్కెట్లో లిప్ స్క్రబ్ లు దొరకుతాయి. వాటిని ఉపయోగించవచ్చు. లేదా పెదవులకు వ్యాజలీన్ రాసి బేబీ టూత్ బ్రష్ తో కాసేపు రుద్దుకుంటే ఎక్స్ఫోలియేషన్ పూర్తవుతుంది. ఇలా చేయడం వల్ల పెదవులపై చర్మం మాయిశ్చరైజ్ అవడంతో పాటు డెడ్ సెల్స్ కూడా తొలగిపోతాయి.

Advertisements

2. పెదవులను రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ చేసుకోకపోవడం

చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజ్ ఎలా చేసుకుంటామో… పెదవులనూ అలాగే మాయిశ్చరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం లిప్ బామ్ ఉపయోగించాల్సిందే. లేదా కొబ్బరి నూనె, షియా బటర్ వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు. మీరు ఉపయోగించేది మాయిశ్చరైజింగ్ లిప్స్టిక్ అయినప్పటికీ రోజూ లిప్ బామ్ రాసుకోవాల్సిందే. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. అప్పుడు మీ పెదవులు సున్నితంగా ఉంటాయి.

3. లిప్ లైనర్ వాడకపోవడం

చాలామంది లిప్ లైనర్ ఉపయోగించకుండానే లిప్స్టిక్ అప్లై చేసుకుంటారు. లిప్ లైనర్ లేకుండా లిప్స్టిక్ వేసుకుంటే అది అంత పర్ఫెక్ట్ గా కనిపించదు. సాధారణంగా మేకప్ ఆర్టిస్ట్ లిప్ లైనర్ వేసిన తర్వాతే లిప్స్టిక్ వేస్తారు. లిప్ లైనర్ ఎప్పుడూ మీ లిప్స్టిక్ రంగుకి దగ్గరగా ఉండాలి.

Advertisements

4. అవసరానికంటే ఎక్కువ అప్లై చేసుకోవడం

మీ పెదవులకు వేసిన లిప్స్టిక్ మీ పళ్లకు కూడా అంటుకుంటుందా? అయితే మీరు చాలా ఎక్కువగా లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నారన్నమాట. కాబట్టి లిప్స్టిక్ వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తో అద్దుకోవాలి. అలాగే లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు నోట్లో వేలు పెట్టుకుని నెమ్మదిగా డ్రా చెయ్యాలి. అప్పుడు ఎక్కువైన లిప్స్టిక్ ఏదైనా ఉంటే అది వేలికి అంటుకుంటుంది. కాబట్టి పళ్లకు లిప్స్టిక్ మరకలు అయ్యే అవకాశం ఉండదు.

5. లిప్స్టిక్ అప్లై చేశాక పెదవులను రబ్ చేయడం

లిప్స్టిక్ విషయంలో ప్రతి ఒక్కరూ చేసే పొరపాటు.. అప్లై చేసుకోగానే పెదవులను ఒకదానితో ఒకటి రబ్ చేయడం.. లిప్స్టిక్ ఇంకా బాగా కనిపిస్తుందని అలా చేస్తుంటారు. ముఖ్యంగా మీరు లిక్విడ్ లిప్స్టిక్ ఉపయోగిస్తున్నట్లయితే ఇలా మాత్రం చేయకండి. ఎందుకంటే.. ఇలా అప్లై చేసుకోగానే లిప్స్టిక్ అలా ఆరిపోతుంది. లిక్విడ్ టైప్ మాత్రమ కాదు.. మిగిలిన రకాలకు చెందిన లిప్స్టిక్ అయినా పెదవులను రబ్ చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు.

Image: Pexels

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.