ఫేస్ ఫ్యాట్ తగ్గించుకోవడమెలా?

ఒంట్లో కొవ్వు ముఖంలోని కొన్ని భాగాల్లో చేరడం వల్ల ముఖం లావుగా తయారవుతుంది. సాధారణంగా ముఖంపై గడ్డం, చెంపలు, కనుబొమ్మలు, దవడలు, మెడ చుట్టూ కొవ్వు నెమ్మదిగా పేరుకోవడం ప్రారంభిస్తుంది. రోజులు గడిచే కొద్దీ మీ ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇలా జరిగితే ముఖంపై కొవ్వు ఉన్నట్టే. ఈ ఫేస్ ఫ్యాట్ ను తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది? మొదటిది.. ముఖంపై కొవ్వు పెరగడమంటే ఒబేసిటీ సమస్య మీకు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా ముందు అది కనిపించేది ముఖంలోనే కాబట్టి. ఇక ఫేస్ ఫ్యాట్ తొలగించుకోవడానికి రెండో కారణం.. మంచి అప్పియరెన్స్ కోసం.

ఫేస్ ఫ్యాట్ రావడానికి చాలా కారణాలుండొచ్చు. ముఖ్యంగా జన్యువులు, హార్మోన్లు, పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవడం, పొగతాగడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్ ఫేస్ ఫ్యాట్ పెరగడానికి కారణం కావచ్చు. కానీ ముఖంపై పేరుకున్న కొవ్వుని ఎలా తగ్గించుకోవాలి? దీనికి ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఎక్సర్సైజులతో పాటు ఈ చిట్కాలను పాటించడం ద్వారా మెరుగైన ఫలితాన్ని త్వరగా పొందవచ్చు.

నిమ్మరసం

ప్రతి రోజూ ఉదయాన్నే.. ఖాళీ కడుపుతో వేడినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు సైతం ఈ చిట్కాను పాటిస్తుంటారు. ఈ చిట్కా ఫేస్ ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నేనిమ్మరసం, తేనె కలిపిన వేడి నీరు తాగడానికి ప్రయత్నించండి.

పసుపు

ఇంటి చిట్కాలు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది పసుపు. సౌందర్యం నుంచి ఆరోగ్యం వరకు మనకెదురైన చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ముఖం మీద పేరుకున్న కొవ్వును తొలగించే విషయంలోనూ పసుపు పనికొస్తుంది. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఫేస్ ప్యాక్ వేసుకోవడమే. గిన్నెలో శెనగపిండి, పెరుగు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై చేరిన కొవ్వు తగ్గడంతో పాటు.. చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. అంటే ఆరోగ్యంతో పాటు అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

పాలు

డబుల్ చిన్ ఉందంటే ఫేస్ ప్యాట్ ఉన్నట్టే. దాన్ని తగ్గించుకోవడానికి పాలను ఉపయోగించవచ్చు. కొద్దిగా పచ్చిపాలను తీసుకుని ముఖం, మెడకు రాసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను పాటించడం ద్వారా డబుల్ చిన్ పోగొట్టుకోవచ్చు.

కర్భూజ

కర్భూజలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫేస్ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. అలాగే శరరీంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది కాబట్టి.. ఆరోగ్యమూ మెరుగు పడుతుంది. రోజూ ఒక గ్లాసు కర్భూజ రసం తాగడం వల్ల ముఖంపై పేరుకున్న కొవ్వు కరిగించుకోవచ్చు.

డార్క్ చాక్లెట్

సాధారణంగా చాక్లెట్ తింటే బరువు పెరిగిపోతామని భావిస్తుంటారు. కానీ డార్క్ చాక్లెట్ మాత్రం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. దీనిలో కొకోవా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ఫేషియల్ ఫ్యాట్ తగ్గించే ఎక్సరసైజెస్

కొన్ని సింపుల్ ఎక్సరసైజెస్ చేయడం ద్వారా ఫేస్ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. నాలుకతో మీ గడ్డాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి. ఇది ముఖం మీద చేరిన కొవ్వును తగ్గించడానికి మంచి వ్యాయామంగా పనిచేస్తుంది. మీకు చేప మూతి పెట్టడం వచ్చా? అయితే అది కూడా ఫేస్ ఫ్యాట్ ను తగ్గిస్తుంది. చేపమూతి పెట్టి ఓ పది సెకన్లు అలాగే ఉండి.. మామూలు స్థితికి వచ్చేయాలి. ఇలా 10 నుంచి 15 సార్లు చేయాల్సి ఉంటుంది. నోటిలో గోరువెచ్చని నీరు పోసుకుని పుక్కిలించాలి. ఇలా ఎంత వరకు అంటే.. బుగ్గలు నొప్పెట్టేదాకా అన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా 1 నుంచి 10 వరకు లెక్కపెట్టుకుని నీటిని బయటకు ఊసేయాలి. ఇలా రోజుకి మూడుసార్లు చేయాల్సి ఉంటుంది. ఫేస్ ఫ్యాట్ తొలగించుకోవడానికి చూయింగ్ గమ్ నమలడం ఓ బెస్ట్ వర్కవుట్. బెలూన్స్ ఊదడం కూడా మంచి ఎక్సరసైజే.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.