కలయిక సమయంలో నొప్పా?బహుశా దానికి కారణం ఇదే అయి ఉండొచ్చు..

సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటికీ మనదేశంలో సెక్స్ గురించి చర్చించుకోవడం చాలా పెద్ద తప్పుగా పరిగణిస్తుంటాం. కనీసం భాగస్వామితో కూడా చర్చించడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు. అందుకే కలయిక సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమలో దాచేసుకునేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మహిళలకు ఈ విషయంలో మరీ బిడియం ఎక్కువ. అందుకే కలయిక సమయంలో నొప్పిగా ఉన్నా.. లేదా ఇతర సమస్యలతో బాధపడుతున్నా.. గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లరు. చికిత్స తీసుకోరు. ఈ కథనం మీరు పడుతున్న ఇబ్బంది పరిష్కారం కాకపోవచ్చు. కానీ మీకు కలుగుతున్న నొప్పికి గల కారణమేంటో మీకు తెలియజేస్తుంది. సాధారణంగా ఆరు కారణాల వల్ల ఆ సమయంలో నొప్పి కలగడానికి అవకాశం ఉంది.

లూబ్రికేషన్ సరిగ్గా లేకపోవడం

కలయిక సమయంలో నొప్పి కలగడానికి లూబ్రికేషన్ సరిగ్గా లేకపోవడమూ కారణమే. చాలా ఎక్కువ మందికి ఈ సమస్యతో బాధపడుతున్నారు. కలయిక సమయంలో ఉండే ఇబ్బందులను చర్చించుకుంటున్నాం కాబట్టి వాస్తవాన్ని వాస్తవంగా చర్చించుకోవడం అవసరం. నిజ జీవితంలో సెక్స్ అంటే పోర్న్ మూవీ చూసినట్టు ఉండదు. కాబట్టి సెక్స్ కి సంబంధించిన ఆలోచనలు రావడం లేదా కలయికకు సిద్ధమవ్వగానే.. లూబ్రికేషన్ జరగదు. మీకూ ఈ సమస్య ఉన్నట్లయితే మంచి ల్యూబ్రికెంట్ ఉపయోగించండి.

Advertisements

ఇన్ఫెక్షన్లు

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా సెక్సువల్ ట్రాన్స్ మిషన్ డిసీజెస్(ఎస్టీడీస్) ఉన్నవారికి కూడా ఆ సమయంలో నొప్పిగా అనిపించవచ్చు. అలాగే యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు(మూత్రనాళ ఇన్ఫెక్షన్లు)(యూటీఐ) ఉన్నవారిలోనూ ఇదే సమస్య తలెత్తొచ్చు. యూటీఐ, ఎస్టీడీస్ కి ఇంటి చిట్కాలు పనిచేయవు కాబట్టి కచ్చితంగా గైనకాలజిస్ట్ ను సంప్రదించాల్సిందే. ఈ తరహా ఇన్ఫెక్షన్లు వచ్చాయని ఎలా గుర్తించడం? కలయిక సమయంలో నొప్పి మీకు అనిపించినట్లయితే.. మీరే చెక్ చేసుకోండి. దద్దుర్లు లేదా చిన్న చిన్న పొక్కుల లాంటివి కనిపిస్తే.. గైనకాలజిస్ట్ ను వెంటనే సంప్రదించండి. తగిన చికిత్స తీసుకోండి. మీతో పాటు మీ భాగస్వామికి కూడా ఇవి సోకే అవకాశం ఉంటుంది కాబట్టి తను కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే మీకే ప్రమాదం కాబట్టి ముందే జాగ్రత్తపడటం అవసరం.

కాన్స్టిపేషన్

మలబద్ధకం సమస్యతో బాధపడే మహిళలకు సైతం కలయిక సమయంలో నొప్పిగా, అసౌకర్యంగా అనిపించవచ్చు. ఈ సమస్యను చాలా వరకు ఇంటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. పీచుపదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. రోజుల తరబడి ఈ సమస్యతో బాధపడుతుంటే మాత్రం వైద్యున్ని సంప్రదించాల్సిందే.

బిడ్డకు జన్మనివ్వడం

బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు తనకి తాను పునర్జన్మనిచ్చుకున్నట్టే. ఈ సమయంలో ఆమె శరీరంలో చాలా మార్పులు వస్తాయి(ముఖ్యంగా వెజీనాలో). సహజ కాన్పు అయినా, సిజేరియన్ ద్వారా బిడ్డను తీసినా దేనికుండే సమస్యలు దానికుంటాయి కాబట్టి.. కనీసం నెల రోజుల పాటు కలయికకు దూరంగా ఉండటం మంచిది.

Advertisements

బ్రెస్ట్ ఫీడింగ్

బ్రెస్ట్ ఫీడింగ్ మహిళ శరీరంలోని హార్మోన్ల విడుదలను అసమతౌల్యం చేస్తుంది. కాబట్టి అక్కడ పొడిగానే ఉంటుంది. కొంతమందిలో ఈ సమస్య స్వల్ప కాలం పాటు ఉంటే.. మరికొందరికి దీర్ఘకాలం పాటు ఉంటుంది. ఇలాంటి వారు గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తే.. మీకు సరైన చికిత్స చేసి హార్మోన్ల విడుదలను క్రమబద్ధం చేయగలుగుతారు.

మానసికపరమైన సమస్యలు

మీ మానసిక పరిస్థితి మీ లైంగిక జీవితంపై ప్రభావం చూపిస్తుంది. మీ మానసిక పరిస్థితి ఆనందాన్నిచ్చే విషయాన్ని కూడా బాధగా మార్చేయగలదు. ఇది మీ లైంగిక జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు ఉత్సాహంగా ఉంటే.. అది కూడా ఉత్సాహంగానే ఉంటుంది. లేదంటే దానికి మించిన ఇబ్బంది మరొకటి ఉండదు. మీ మూడ్ సరిగ్గా లేకపోతే సరిగ్గా లూబ్రికేట్ అవ్వదు. మెదడు పరిపరి విధాల ఆలోచిస్తుంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ మూడ్ సెట్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ క్షణంలో అది మీకు అవసరం లేని విషయంగా మారిపోతుంది. కాబట్టి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోండి.

చివరి మాట.. కలయిక సమయంలో తరచూ నొప్పిగా ఉండటానికి కొన్నిసార్లు ఇవే కాకుండా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కాబట్టి.. ఆ సమయంలో నొప్పిగా అనిపిస్తుంటే.. దాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. వీలైనంత త్వరగా గైనకాలజిస్ట్ ను సంప్రదించి చికిత్స తీసుకోండి. అప్పుడే మీరు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఆరోగ్యంగా ఉంటారు.

Image: Pexels

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.