చలికాలంలో జుట్టు బిరుసుగా మారకుండా ఉండటానికి ఏం చేయాలంటే..

చలి వాతావరణంలో జుట్టుకొచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. వెంట్రుకలు పొడిబారి బిరుసెక్కి తెగిపోతుంటాయి. చివర్లు చిట్లిపోతుంటాయి. వీటికి తోడు చుండ్రు సమస్య. వెరసి కురులు మెరుపు కోల్పోతాయి. దాదాపు శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కునే సమస్యే. ప్రస్తుతం మనం చలికాలం ఆరంభంలోనే ఉన్నాం కాబట్టి.. ఇప్పటి నుంచీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.

రోజూ తలకు నూనె..

చలికాలంలో బయటి వాతావరణం చలిగానే ఉన్నా పొడిగా ఉంటుంది. దీనివల్ల వెంట్రుకల్లోని తేమ మొత్తం పోతుంది. అంటే జుట్టు పొడిగా మారిపోతుంది. స్కాల్ఫ్ కూడా తేమ కోల్పోవడం వల్ల అక్కడి చర్మం పొరలుగా ఊడిపోతుంటుంది. మరికొందరిలో చుండ్రు సమస్య తలెత్తుంది. అందుకే మీ డైలీ హెయిర్ కేర్ రొటీన్లో కొబ్బరి నూనెకు చోటివ్వండి. రోజూ కొద్దిగా తలకు నూనె రాస్తే.. వెంట్రుకల్లోని తేమ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. మీకు చుండ్రు ఉన్నా లేదా మాడుపై చర్మం పొలుసులుగా ఊడుతున్నా.. నూనె తలకు పట్టించి అరగంట ఆగిన తర్వాత తలస్నానం చేయండి. దీనికోసం కొబ్బరి నూనె లేదా ఆముదం వాడితే బాగుంటుంది.

తరచూ తలస్నానం వద్దు

ఈ తలస్నానం చేసే అలవాటు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. మీకున్న ఈ అలవాటు శీతాకాలంలో మీ జుట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేయెచ్చు. రోజూ తలస్నానం చేయడం వల్ల చర్మం విడుదల చేసే.. వెంట్రుకల్లోని తేమను పట్టి ఉంచే సహజమైన నూనెలు పోతాయి. కాబట్టి రెండ్రోజులకోసారి తలస్నానం చేయడం మంచిది. అయినా.. ఇంకా జుట్టు పొడిగానే ఉన్నట్లయితే.. మూడు, నాలుగు రోజులకొకసారి చేయడం మంచిది. రోజూ తలస్నానం చేయాలని మీరనుకుంటే… ఓ చిట్కాను పాటించండి. మీ జుట్టు జిడ్డుగా లేకపోతే.. షాంపూకి బదులుగా కండిషనర్ తో తలస్నానం చేయండి. జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది.

నో హీట్ స్టైలింగ్

జుట్టు పొడిగా మారడానికి హీట్ స్టైలింగ్ కూడా ఒక కారణం కావచ్చు. హెయిర్ డ్రయర్, స్ట్రెయిటనర్, కర్లర్ లాంటివి ఉపయోగించడం వల్ల మీ జుట్టును మీరే నాశనం చేసుకున్నట్లవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీ జుట్టులోని తేమను క్షణాల్లో పీల్చేస్తాయి. కాబట్టి ఈ శీతాకాలంలో ఇలాంటి స్టైలింగ్ టూల్స్ ఉపయోగించకపోవడమే మంచిది. తప్పని పరిస్థితుల్లో ఉపయోగించాల్సి వస్తే.. హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేసుకుని.. ఆ తర్వాతే స్టైలింగ్ టూల్స్ వాడండి.

జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే బయటకు..

తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరకుండానే ఇంటి నుంచి బయలుదేరడం చాలామందికున్న అలవాటు. అదే ఆరిపోతుందిలే అనే ఉద్దేశమో లేదా ఆలస్యం అవుతుందనే కారణమో.. మరేదైనా కానివ్వండి.. మిగిలిన రోజుల్లో అయితే ఫర్వాలేదు కానీ.. చలికాలంలో మాత్రం జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే బయటకు రావడం మంచిది. ఎందుకంటే.. తడిగా ఉన్న జుట్టు ఎక్కువగా సాగిపోతుంది. ఫలితంగా వెంట్రుకలు తెగిపోతుంటాయి. అందులోనూ చలికాలంలో జుట్టు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ డ్యామేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది.

వారానికోసారి హెయిర్ మాస్క్

ముఖం అందంగా మెరవడానికి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటామో.. కురుల సౌందర్యం, ఆరోగ్యం కాపాడుకోవడానికి మీ జుట్టుతత్వానికి తగిన హెయిర్ ప్యాక్ లేదా మాస్క్ వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రై హెయిర్ ఉన్నవారు కచ్చితంగా వారానికోసారి హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సిందే. దీనివల్ల స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

సిల్క్ క్యాప్

శీతాకాలంలో చలిని కాపాడుకోవడానికి తలకు ఊలు క్యాప్ పెట్టుకోవడమో.. స్కార్ఫ్ కట్టుకోవడమో చేస్తుంటాం. మీకో విషయం తెలుసా? ఊలు జుట్టు పొడిగా మారడానికి, తెగిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి సిల్స్ స్కార్ఫ్ లేదా క్యాప్ పెట్టుకోండి.

నీరు ఎక్కువ తాగాలి..

నిజం చెప్పుకోవాలంటే.. శీతాకాలంలో చాలా తక్కువ నీరు తాగుతాం. కానీ మీ జుట్టు హెల్తీగా, షైనీగా ఉండాలంటే.. తగినంత నీరు తాగడం ముఖ్యం. అప్పుడే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. చుండ్రు, దురద సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

Image: Pexels

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.