నిఖిల్ సినిమా రిలీజ్ పక్కా !

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ మొత్తం పడుతూ లేస్తూనే సాగింది. ఒక హిట్ కొట్టాడు అనుకునే లోపే ప్లాప్ లు చూడటం ఈ హీరోకి పరిపాటిగా మారింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ తో గాడిలో పడ్డట్టే కనిపించినా.. ఆ తర్వాత వచ్చిన కేశవ, కిరాక్ పార్టీ నిరాశపరిచాయి. దీంతో తమిళంలో మంచి విజయం సాధించిన కనితన్‌ రీమేక్‌ చేశారు. అదే “అర్జున్ సురవరం”. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. రిలీజ్ కి మాత్రం నోచుకోలేదు. షూటింగ్ నుంచి మొదలైన జాప్యం రిలీజ్ వరకు కొనసాగింది. ఒక దశలో నిఖిల్ సైతం ఈ సినిమాపై ఆశ వదిలేసుకున్నాడు. అయితే అన్ని అడ్డంకులు దాటుకుని ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం రిలీజ్ అయిన అర్జున్ సురవరం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ తో కట్ చేసిన ట్రైలర్.. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టుగా కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌.

నిఖిల్ “అర్జున్‌ సురవరం” సినిమాని తన జీవితంలో మరచిపోలేడేమో. అంతగా సినిమా కష్టాలను చూపించింది. ఈ సినిమాకు మొదట ‘ముద్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఇదే టైటిల్ తో జగపతిబాబు హీరోగా మరో సినిమా రావడం వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆర్ధిక సమస్యలు, సరైన రిలీజ్ డేట్‌ దొరక్కపోవటం నిఖిల్ కి చుక్కలు చూపాయి.

రిలీజ్ లేట్ అయినా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ని నిఖిల్ నమ్ముకున్నాడు. ఇది హిట్ కొడితే ఈ హీరో కెరీర్ కి ప్లస్ కానుంది. అర్జున్‌ సురవరం తరువాత నిఖిల్‌ కార్తికేయ సీక్వెల్‌లో నటించనున్నాడు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.