గడ్డం మ్యాన్లీ లుక్ ఇవ్వడం లేదా? దానికోసం ఏం చేయాలి..?

ఇప్పుడంతా గడ్డం ఫ్యాషనే నడుస్తోంది. టాప్ సెలబ్రిటీల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు ఈ ఫ్యాషన్ ఫాలో అయిపోతున్నారు. గడ్డంతో ఉన్నవారిని కొంతమందిని చూస్తే.. భలే మెయింటైన్ చేస్తున్నాడే అనిపిస్తుంది. మరికొందరిని చూస్తే.. వీడి గడ్డమేంట్రా బాబు ఇలా ఉందనిపిస్తుంది. దీనికి కారణం దాని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే. అసలు తలపై ఉన్న జుట్టుపై పెట్టిన శ్రద్ధ గడ్డంపై ఎక్కడుంటుంది. దాని పాటికి అది పెరుగుతుంది.. దాన్ని మనం ట్రిమ్ చేస్తూ ఉంటాం. మీ గడ్డం మీకు మ్యాన్లీ లుక్ ఇవ్వడానికి అదొక్కటే సరిపోతుందా? కచ్చితంగా చాలదు. కాబట్టి.. మేం చెప్పే ఈ చిట్కాలు పాటిస్తే.. మీ గడ్డం మీకు మ్యాన్లీ లుక్ ఇస్తుంది.

1. తలే కాదు.. గడ్డమూ దువ్వాలి..

గడ్డం పెంచితే సరిపోదు.. దాన్ని సరిగ్గా మెయింటైన్ కూడా చేయాలి. అప్పుడే అది మీకు మ్యాన్లీ లుక్ ఇస్తుంది. లేదంటే ఏదో గుబురు పెరిగినట్టు ఉంటుంది. రోజూ గడ్డం దువ్వితేనే అది నీట్ గా ఉంటుంది. దీనికోసం మీరు గడ్డం దువ్వుకోవడానికే తయారుచేసిన beard comb కొని దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టండి. ఇలా రోజూ గడ్డం దువ్వుకోవడం వల్ల అక్కడి వెంట్రుకలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంటే మీ బియర్డ్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది.

2. తరచూ ట్రిమ్ చేయొద్దు

మీకు తరచూ గడ్డం ట్రిమ్ చేసే అలవాటు ఉందా? అయితే ఇక నుంచి దానికి స్వస్తి చెప్పండి. ఎందుకంటే దానివల్ల మీ గడ్డానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ట్రిమ్ చేసుకుంటే గడ్డం పెరుగుతుందని చాలా మంది భావిస్తారు. కానీ అది ఓ అపోహ మాత్రమే. కాబట్టి నిజంగా అవసరమైతేనే తప్ప లేదంటే ట్రిమ్ చేసుకోకుండా ఉండటమే మంచిది.

3. శుభ్రం చేసుకోవడానికి ఓ షాంపూ..

రోజుకి ఒకసారో.. రెండు సార్లో ముఖం శుభ్రం చేసుకుంటాం కదా. అలాగే గడ్డాన్నికూడా శుభ్రం చేసుకోవాలి. ‘అరె.. మేమూ శుభ్రం చేసుకుంటున్నాం..’ అంటారా? మంచిది. కానీ దేనితో శుభ్రం చేస్తున్నారు? సబ్బుతోనా? ఫేస్ వాష్ తోనా? ఈ రెండూ.. మీ గుబురు గడ్డాన్ని పొడిగా మారిపోయేలా చేస్తాయి. పైగా తలలో డాండ్రఫ్ ఉన్నట్టే.. గడ్డంలోనూ డాండ్రఫ్ పెరగడానికి అవకాశం ఉంది. ఈ చుండ్రును సబ్బు లేదా ఫేస్ వాష్ వదలగొట్టలేదు కాబట్టి.. గడ్డం కోసమే ప్రత్యేకించి తయారుచేసిన బియర్డ్ వాష్ ఉపయోగించాల్సి ఉంటుంది.

4. మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి

శ్రద్ధ చూపకపోతే.. గడ్డం పొడిగా మారుతుంది. ఆపై డాండ్రఫ్ పెరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. అప్పుడప్పుడూ కాస్త నూనె రాస్తూ ఉండటం మంచిది. ఇప్పుడు మార్కెట్లో గడ్డం కోసమే కొన్ని గ్రూమింగ్ ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి. నూనె వాడటం ఇష్టం లేని వారు వాటిని కూడా ఉపయోగించవచ్చు. ఇవి గడ్డం మీద పెరుగుతున్న వెంట్రుకలకు అవసరమైన పోషణ అంందిస్తుంది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.