నెలసరి సమయంలో నొప్పిని దూరం చేసే చిట్కాలు..

నెలసరి సమయంలో అమ్మాయిలకు ఎదురయ్యే ఇబ్బందులు ( Period cramps ) అన్నీ ఇన్నీ కావు. పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి, కాళ్లుచేతులు లాగడం, చిరాకుగా అనిపిండం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆ ఐదు రోజులూ అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొందరు వాటిని పంటి బిగువున భరిస్తే.. మరికొందరు మాత్రం వాటి నుంచి బయటపడటానికి ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు. అది కూడా ఏ మెడికల్ షాపుకో వెళ్లి.. వాళ్లు ఇచ్చే మాత్రలు వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగినా.. దీర్ఘకాలంలో వాటి వల్ల కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మందులు వాడి సమస్య నుంచి బయటపడాలంటే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. వీటితో పాటు కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం ద్వారా పీరియడ్ క్రాంప్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

1. హీటింగ్ ప్యాడ్

నెలసరి సమయంలో ఎక్కువ మంది ఎదుర్కునే సమస్య పొత్తి కడుపులో నొప్పి. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి హీటింగ్ ప్యాడ్ లో వేడి నీళ్లు పోసి దాన్ని పొట్ట దగ్గర పెట్టుకోండి. కచ్చితంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. హీటింగ్ ప్యాడ్ లేకపోతే.. వాటర్ బాటిల్లో వేడినీళ్లు పోసుకుని దాన్నైనా ఉపయోగించవచ్చు.

Advertisements

2. నువ్వుల నూనెతో మసాజ్

కడుపు నొప్పి ఎక్కువగా ఉంటే.. నువ్వుల నూనెతో పొత్తి కడుపుపై మర్దన చేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. ఒకప్పుడు రోజూ నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేసుకుని స్నానం చేసేవారట. అందుకే అప్పటి తరం వారు ఎంత నొప్పినైనా తట్టుకునేలా ఉండేవారు.

3. అల్లం టీ

వేడి వేడి టీ తాగితే.. ఎంతటి నొప్పి నుంచి అయినా ఉపశమనం లభిస్తుంది. కొందరికి నెలసరి సమయంలో కడుపు నొప్పితో పాటు.. తలనొప్పి కూడా వస్తుంది. మరి దీన్నుంచి బయటపడటం ఎలా? తేనె, అల్లంతో తయారు చేసిన టీ తాగితే సరిపోతుంది. ఇది కడుపు నొప్పి, తల నొప్పిల నుంచి ఉపశమనం అందిస్తుంది.

Advertisements

4. మెంతులు

మెంతులు వల్ల మనకు చాలా ప్రయోజనాలున్నాయి. మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహకరిస్తాయి. ఈ మెంతులే.. పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులనూ తగ్గిస్తాయి. దీనికోసం కొద్దిగా మెంతులను గ్లాసు నీటిలో వేసి 12 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని తాగాల్సి ఉంటుంది.

5. శొంఠి, మిరియాలు

శొంఠి, మిరియాలు నీటిలో వేసి బాగా కాచి తయారుచేసిన కషాయం తాగితే.. నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు దూరమవుతాయి. కాస్త ఘాటుగా ఉండే ఈ కషాయం తాగలేమనుకుంటే.. దానిలో కొంచెం పంచదార కలుపుకుని తాగొచ్చు.

Advertisements

6. సోంపు

ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసినప్పుడు సరదాగా వాటిని నోట్లో వేసుకోవడం తప్ప దానివల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతేకాదు.. మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అంటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

ఈ చిట్కాలన్నీ పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ఎప్పుడైనా ఆ సమయంలో నొప్పిగా అనిపిస్తే.. వీటిని పాటించండి. నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే.. డాక్టర్ ను సంప్రదించడం మరచిపోవద్దు.

Photo: Pixabay

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.