నేచురల్ స్టార్ నాని నెక్ట్స్‌ సినిమా ఏంటి?

చిన్న చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టి.. నేచురల్ స్టార్ గా ఎదిగిన హీరో నాని. దర్శకుడు కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి హీరో అయిపోయాడు. ఆ తర్వాత వరుస హిట్లు కొట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ద్వితీయ శ్రేణి హీరోల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. అయితే గత రెండేళ్లుగా నాని టైం కలిసి రాలేదు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక జెర్సీ విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ సరైన కలెక్షన్స్ దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్ విషయంలోనూ అదే జరిగింది. దీంతో నాని డైలమాలో పడ్డాడు. నెక్ట్స్‌ సినిమా విషయంలో పెద్దగా తొందర పడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కొత్త దర్శకుడు మహేష్ చెప్పిన కథ నానికి నచ్చిందని సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాని అంగీకరించాడు. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్ను కోరి’ మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ రెండిటిలో ఏది ముందు పట్టాలెక్కుతుందో చూడాలి.

ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ‘వి’ సినిమా చేస్తున్నాడు. నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి యాక్షన్‌ సినిమాలు చేయరు. ఇందుకు భిన్నంగా ఈసారి యాక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నారు. ఈ సినిమాలో సుధీర్‌బాబు పోలీస్‌ ఆఫీసర్‌గా, నాని విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. నివేదా థామస్, అదితీ రావ్‌ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ఇది నాని 25వ చిత్రం. వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక ఇదే సమయం లో విశ్వక్ సేన్, రుహాని శర్మ హీరోహీరోయిన్లుగా నాని “హిట్” అనే సినిమాను నిర్మిస్తున్నాడు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.