అర్జున్ సురవరం సినిమా రివ్యూ

నిఖిల్ సిద్ధార్థ, లావణ్య త్రిపాఠి నాయికానాయకులుగా నటించిన సినిమా అర్జున్ సురవరం. షూటింగ్ పూర్తయి చాలా రోజులే అయినా.. విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. అసలు రిలీజ్ అవుతుందా? లేదా? అనే సందేహాన్ని కలిగించింది. పైగా కిర్రాక్ పార్టీ తర్వాత నిఖిల్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత నిఖిల్ కు సరైన హిట్ పడలేదు. ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నిఖిల్. ఇది తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘కనితన్’ కు రీమేక్. ఎట్టకేలకు అర్జున్ సురవరం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి స్టూడెంట్ కచ్చితంగా చూడాల్సిన సినిమా అని, అందరికీ నచ్చుతుందని ప్రమోషన్లలో పదే పదే చెబుతూ వచ్చాడు నిఖిల్. మరి నిఖిల్ చెప్పినట్టుగానే అర్జున్ సురవరం జనానికి నచ్చిందా? ప్రచారచిత్రాల్లో కనిపించిన ఇంటెన్సిటీ సినిమాలో ఉందా? చూద్దాం.

టీవీ99 లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంటాడు అర్జున్ లెనిన్ సురవరం. హైదరాబాద్ లోని పబ్బుల్లో సాగే డ్రగ్స్ దందా గురించి స్టింగ్ ఆపరేషన్ చేస్తాడు. జర్నలిస్ట్ గా జనానికి మేలు చేయాలనే ఆలోచన అర్జున్ ది. అయితే అనుకోకుండా ఫేక్ సర్టిఫికెట్ల కేసులో ఇరుక్కుంటాడు. అతనిపై మోపిన నేరం కూడా రుజువు అవుతుంది. బెయిల్ పై విడుదలైన తర్వాత ఈ ఫేక్ సర్టిపికెట్ల గురించి తనదైన రీతిలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో తనకు తెలిసిన నిజాలేంటి? తనకెదురైన సమస్యలు అన్నింటినీ ఎదుర్కొని అసలు నిజాన్ని ఎలా బయటపెట్టాడనేదే సినిమా కథ.

Advertisements

ఫేక్ సర్టిఫికెట్ల దందా ఈనాటి కాదు. చాలా ఏళ్లుగా సాగుతోన్న చీకటి వ్యాపారం. అంటే చాలా సీరియస్ సబ్జెక్ట్. ఈ విషయాన్ని అంతే సీరియస్ గా తెరపై చూపించారు. అసలు విషయాన్ని చూపెట్టడంలో ఎక్కడా పక్కదారి పట్టలేదు దర్శకుడు. తెరపై కథ మొదలైనప్పటి నుంచి కథ ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. తొలి సగం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి కథలో వేగం మందగించినట్టుగా అనిపిస్తుంది. చూసిన సన్నివేశాలే మళ్లీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. కీలకమైన విషయాలకొచ్చేసరికి లాజిక్ మిస్సయినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ లోన్, నకిలీ సర్టిఫికెట్లు మధ్య లింక్ అర్థం కాదు. అందుకే కొన్ని సన్నివేశాలు కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. మధ్యమధ్యలో వచ్చే కామెడీ నవ్వించేలానే ఉంది. కానీ కథ నుంచి ప్రేక్షకుడిని ఏ మాత్రం దారి తప్పనివ్వలేదు. ఇది సినిమాకు ఓ ప్లస్ పాయింటనే చెప్పాలి. పాటలకు ప్రాధాన్యమివ్వకపోవడం కూడా సినిమాకు కలిసి వచ్చింది.

నటీనటుల అభినయానికి వస్తే.. నిఖిల్ రిపోర్టర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సినిమా గురించి తను పడ్డ కష్టం తెరపై కనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా చక్కగా రాణించాడు. లావణ్య త్రిపాఠి కావ్య పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. పోసాని కృష్ణమురళికి ఓ మంచి పాత్ర దొరికింది. సాంకేతికపరమైన విషయాలకొస్తే.. నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. దర్శకుడిగా టీ సంతోష్ మంచి సినిమానే చేశాడు. కథనం తొలి భాగంలో ఉన్న గ్రిప్పింగ్ ద్వితీయార్థంలోనూ ఉంటే బాగుండేది. అయినప్పటికీ అర్జున్ సురవరం థియేటర్లలోని ప్రేక్షకుల మనసుల్లో తన అద్భుతమైన పరిశోధనా పాత్రికేయంతో చెరగని ముద్ర వేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Feature Image: Nikhil Siddhartha Twitter

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.