ప్రతి అమ్మాయి మేకప్ కిట్ లో కచ్చితంగా ఉండాల్సిన ప్రొడక్ట్స్..

అమ్మాయిల లైఫ్ స్టైల్లో మేకప్ కిట్ ఓ అంతర్భాగం. మేకప్ వారిని అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంతో పాటు.. వారిని ఆత్మవిశ్వాసంగా కనిపించేలా చేస్తుంది. వృత్తిరీత్యా కొందరు మహిళలు కచ్చితంగా మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. మేకప్ కిట్ గురించి, మేకప్ వేసుకోవడం గురించి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఈ విషయంలో experts అనే చెప్పుకోవాలి. కొత్తగా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టిన వారికే ఈ విషయంలో సమస్య ఎదురవుతుంది. మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉండే మేకప్ ఉత్పత్తులు, బ్రాండ్ల నుంచి ఏది ఎంచుకోవాలో తెలియదు. మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారా? అసలు మేకప్ కిట్లో కచ్చితంగా ఉండాల్సినవి ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1. మాయిశ్చరైజర్

మేకప్ వేసుకోవడానికి ముందు కచ్చితంగా చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాల్సి ఉంటుంది. మేకప్ తక్కువగానే వేసుకుంటాం కదా.. ఫర్లేదులే అనుకోవద్దు.. మినిమల్ మేకప్ వేసుకున్నా సరే ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం త్వరగా చర్మంలోకి ఇంకిపోయే తేలికపాటి మాయిశ్చరైజర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మేకప్ అందంగా వస్తుంది. లోటస్ హెర్బల్స్ న్యూట్రామాయిస్ట్ మాయిశ్చరైజింగ్ క్రీం దీనికి సరైన ఎంపిక. పైగా ఇది ఎస్పీఎఫ్ 25 విలువ కలిగి ఉంది. అంటే.. ఇది సూర్యరశ్మి ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

Advertisements

2. ప్రైమర్

రోజంతా మేకప్ నిలిచి ఉండాలంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ప్రైమర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చర్మంపై మచ్చలు, మొటిమలు ఉంటే వాటిని ప్రైమర్ కవర్ చేస్తుంది. పైగా చర్మాన్ని స్మూత్ గా కనిపించేలా చేస్తుంది. దీనికోసం ఆయిల్ ఫ్రీ, లైట్ వెయిట్ ప్రైమర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisements

3. ఫౌండేషన్

మీ మేకప్ ఫ్లాలెస్ గా కనిపించేలా చేస్తుంది ఫౌండేషన్. ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ప్రైమర్ అప్లై చేయకుండానే ఫౌండేషన్ రాసుకుంటారు. అలా చేయడం వల్ల మీ మేకప్ సహజంగా అనిపించదు. కాబట్టి మేకప్ నేచురల్ గా ఉండాలంటే.. ముందు ప్రైమర్ ఆ తర్వాత ఫౌండేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఫౌండేషన్ కొనే ముందు మీరు దాన్ని ప్రయత్నించాల్సి ఉంటుంది. మీ ముఖానికి దాన్ని ఒకసారి అప్లై చేసుకుని చూడాలి. కొన్ని బ్రాండెడ్ స్టోర్లలో శాంపిల్స్ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రయత్నించి మీకు నప్పేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి బ్రాండ్ విభిన్న రకాల షేడ్స్ ఉన్న ఫౌండేషన్లను అందిస్తుంది. మేబిల్లీన్ న్యూయార్క్ ఫిట్ మి ఫౌండేషన్ మేం మీకు సజెస్ట్ చేస్తున్నాం.

Advertisements

కన్సీలర్

మేకప్ కిట్లో కచ్చితంగా ఉండాల్సిన బేసిక్ థింగ్ కన్సీలర్. ముఖం మీద ఉన్న నల్లని, ఎర్రని మచ్చలు, కళ్ల కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడానికి కన్సీలర్ తప్పనిసరి. ఫౌండేషన్ తర్వాత కన్సీలర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మరో విషయం తెలుసా? మేకప్ హెవీగా అవుతుందని మీరు అనుకుంటే.. ఫౌండేషన్ స్కిప్ చేసి దానికి బదులుగా కన్సీలర్ అప్లై చేసుకుంటే బాగుంటుంది.

కన్సీలర్స్ లో లిక్విడ్, క్రీమ్, స్టిక్ మూడు రకాలున్నాయి. ఈ మూడింటిలో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. అయితే అది మీ చర్మానికి తగినట్లు ఉందో లేదో పరీక్షించి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కళ్ల కింద డార్క్ లైన్స్ కవర్ చేయడానికైతే.. మీ స్కిన్ టోన్ కంటే రెండు షేడ్స్ లైట్ గా ఉన్నదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే.. ఎన్ఏఆర్ఎస్ రేడియంట్ క్రీమీ కన్సీలర్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది అన్ని రకాల స్కిన్ టైప్స్ కి సరిపోతుంది. పైగా దీనిలో 25 రకాల షేడ్స్ అందుబాటులోఉన్నాయి. కాబట్టి మీకు నప్పే దాన్ని ఎంచుకోవచ్చు.

Advertisements

బ్లష్

కన్సీలర్ తర్వాత బ్లష్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఎంచుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎందుకంటే.. మీ చర్మం కంటే.. బ్రైట్ టోన్ ఉన్న బ్లష్ ఉపయోగిస్తే.. మీ మేకప్ నేచురల్ గా కనిపించదు. కాబట్టి మీ చర్మానికి సరిపోయే బ్లష్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు కొత్తగా మేకప్ వేసుకోవడం మొదలుపెట్టినట్లైతే.. పౌడర్ బ్లష్ ఉపయోగిస్తే దాన్ని సులువుగా అప్లై చేసుకోవచ్చు. స్విస్ బ్యూటీ ప్రో బ్లష్ దీనికి సరైన ఎంపిక. చామన ఛాయ, ఫెయిర్ స్కిన్ కలిగిన వారికి కోరల్, లైప్ పింక్, పీచ్ టోన్స్ బాగుంటాయి. డస్కీ స్కిన్ కలిగిన వారికి ఫ్లమ్, రోజ్ షేడ్స్ బాగుంటాయి.

Advertisements

ఐషాడో

ముఖానికి అవసరమైన మేకప్ అంతా వేసుకుని కళ్లను అలా వదిలేస్తే చూడటానికి అంత బాగుండదు. కాబట్టి. ఐ మేకప్ కూడా వేసుకుంటేనే అందంగా కనిపిస్తాం. న్యూడ్ షేడ్స్ లో ఉన్న ఐషాడో ప్యాలెట్ మీ దగ్గర ఉంటే.. మీకు నచ్చేట్టుగా, నప్పేట్టుగా మేకప్ వేసుకోవచ్చు. న్యూడ్ షేడ్స్ ఎంచుకోమనడానికి ప్రత్యేకమైన కారణం.. అవి మిమ్మల్ని నేచురల్ గా కనిపించేలా చేస్తాయి. అలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలంటే.. మేబిల్లీన్ న్యూడ్ ఐ షాడో పాలెట్ మీ దగ్గర ఉండాల్సిందే.

ఐలైనర్

కళ్లు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే.. ఐలైనర్ వేసుకోవాల్సిందే. దీనికోసం లిక్విడ్ లేదా పెన్సిల్ ఐ లైనర్ ఉపయోగించవచ్చు. అయితే లిక్విడ్ ఐ లైనర్ వేసుకునేటప్పుడు కొన్నిసార్లు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అదే పెన్సిల్ ఐ లైనర్ అయితే సులువుగా వేసుకోవచ్చు. స్మడ్జ్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ అయితే బాగుంటుంది.

Advertisements

మస్కారా

కనురెప్పలు పొడవుగా, ఒత్తుగా కనిపించేలా చేస్తుంది మస్కారా. మస్కారా ఎంపిక చేసేటప్పుడు దాని బ్రష్ ఎలా ఉంది? మస్కారాను తయారు చేసిన పదార్థాలను పరిశీలించాల్సి ఉంటుంది. మస్కారా అప్లై చేసుకోవడానికి ముందే ఐలాషెష్ ను కర్ల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అది నీట్ గా ఉంటుంది.

కంపాక్ట్

ఈ కంపాక్ట్ పౌడర్.. మేకప్ కిట్ లో మాత్రమే కాదు మీ హ్యాండ్ బ్యాగులోనూ ఉండాల్సిందే. ఎప్పుడైనా టచప్ చేయాల్సి వచ్చినప్పుడల్లా.. ఈ పౌడర్ ఒక్కసారి అద్దుకుంటే సరిపోతుంది. మేకప్ పూర్తయిన తర్వాత చివరిగా కంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉన్నవారు మేకప్ పూర్తయ్యాక కచ్చితంగా కంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకోవాల్సిందే.

Image: Pexles

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.