90 ఎంఎల్ సినిమా రివ్యూ

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఎవరూ ఊహించని రీతిలో హిట్ కొట్టి… ఆ తర్వాత వరసగా అవకాశాలు అందుకున్నాడు కార్తికేయ. వరుసగా హిప్పి, గుణ 369 సినిమాలు చేశాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలోనూ.. కీలకపాత్రలో నటించాడు. కానీ అవేమీ ఆర్ఎక్స్ 100 కు దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఆ చేదు అనుభవాల తర్వాత ‘90 ఎంఎల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా అయినా అతను ఆశించిన విజయాన్ని అందించిందా? లేదా? చూద్దాం.

Advertisements

కథ విషయానికి వస్తే.. దేవదాసు (కార్తికేయ)కు ఓ విచిత్రమైన జబ్బు వస్తుంది. రోజూ మందులేసుకున్నట్టుగా ప్రతి పూటా 90 ఎంఎల్ మద్యం తాగకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందన్నమాట. దీంతో డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని మరీ ప్రతి పూటా ఓ 90ఎంఎల్ పట్టిస్తుంటాడు. ఒక్క పూటైనా మద్యం లేకపోతే బతకలేని వాడికి అసలు ఆ వాసనే పడని ఫ్యామిలీ నుంచి వచ్చిన సువాసన(నేహా సోలంకి)తో ప్రేమలో పడతాడు. తన బలహీనత, ఆరోగ్య పరిస్థితి గురించి సువాసనకు చెప్పకుండా అలా అలా బండి నడిపించేస్తుంటాడు. కానీ కొన్నాళ్ల తర్వాత దేవదాసుకున్న అలవాటు గురించి తెలిసి అతనికి దూరమవుతుంది. తనకు దూరమైన ప్రేయసిని దక్కించుకోవడానికి దేవదాసు ఏం చేశాడు? తనకున్న పూటకో 90ఎంఎల్ అలవాటును మానుకున్నాడా? లేదా అనేదే సినిమా కథ.

Advertisements

మూడు పూటలా మూడు సార్లు 90 ఎంఎల్.. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. పైగా అసలు బయటకు రావాలంటేనే ముఖానికి మాస్కులేసుకునే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ కు మధ్య ప్రేమ అంటే.. అది మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలా ఎగ్జైటింగ్ గా ఉంది కదా అని సినిమా తీస్తే ఎలా ఉంటుందో 90 ఎంఎల్ చూస్తే తెలుస్తుంది. ఐతే ఇలాంటి ఐడియాలు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలవేమో కానీ.. 3 గంటలు వచ్చిన వారిని ఎంటర్టైన్ చేసే విధంగా సినిమా కట్ చేయడమంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇది ఓ విభిన్నమైన ఆలోచన. దాన్ని ప్రేక్షకులు ఓన్ చేసుకోగలిగేలా పాత్రలు ఉండాలి. వాటి మధ్య ఎమోషన్ అద్భుతంగా ముడిపెట్టగలిగిన నేర్పుండాలి. కానీ ‘ 90 ఎంఎల్ ’ దర్శకుడు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు.

Advertisements

తనకున్న 90 ఎంఎల్ అలవాటు గురించి తెలిసి తనను అసహ్యించుకుంటున్న హీరోయిన్ ప్రేమను దక్కించుకోవడానికి నానాతిప్పలు పడతాడు హీరో. తనకున్న జబ్బు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం అవేమీ తనకు అవసరం లేదన్నట్టుగా మాట దాటేస్తుంది. ఇలా ఒకట్రెండు సార్లు కాదు.. దాదాపు గంటన్నర ఇదే కథ నడుస్తుంది. అసలు తాను పూటకోసారి మద్యం ఎందుకు తాగుతున్నాడో హీరోయిన్ కి ఎందుకు చెప్పలేకపోతున్నాడని థియేటర్లో చూస్తున్న జనానికి చిర్రెత్తుకు వస్తుంది. అందుకే కథనం సాగదీసినట్టుగా ఉంటుంది.

Advertisements

సినిమా చూస్తున్నప్పుడు ఇది సీరియస్ సినిమానా, కామెడీ సినిమానే అనే సందేహం వస్తుంది. తీసిన డైరెక్టర్ కి కూడా ఆ క్లారిటీ ఉన్నట్టు కనిపించదు. అందుకే సినిమా అంతా కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. 90 ఎంఎల్ ను ఒకసారి బలహీనతగా చూపించి కామెడీ చేస్తే.. మరోసారి దాన్నే సెంటిమెంట్ కోసం వాడుకోవడానికి ట్రై చేస్తారు. అన్నింటికంటే సిల్లీగా అనిపించే విషయం ఏంటంటే.. తన కూతురిని కూడా గారూ అని పిలుస్తాడు హీరోయిన్ తండ్రి. చివరికి పదేళ్ల పిల్లను కూడా అలాగే పిలుస్తాడు. ఇదేం పిచ్చో అర్థం కాదు. గారు అని మర్యాదకు పిలుస్తాం. కానీ ఇంటిల్లిపాదీ ఒకరినొకరు గారూ గారూ అని పిలుచుకుంటుంటే.. అది చాలా చిరాకు రప్పిస్తుంది. కొన్ని కామెడీ సీన్లు మినహా మిగిలిన సినిమా అంతా బాగా బోర్ కొట్టిస్తుంది.

Advertisements

కార్తికేయ ఫిజిక్, స్టైల్ పరంగా బాగానే ఆకట్టుకుంటున్నాడు కానీ.. నటన విషయానికొస్తే మాత్రం బోర్ కొట్టించేస్తున్నాడు. ‘90 ఎంఎల్’లో కొన్ని సన్నివేశాల్లో అతడి నటన, హావభావాలు కాస్త చిరాకే వస్తుంది. హీరోయిన్ నేహా సోలంకి అందంగానే ఉంది కానీ నటన అంతంతమాత్రమే. రవికిషన్ కాస్త భిన్నంగా కామెడీ ట్రై చేశాడు. కానీ అతని పాత్ర మరీ తేలిగ్గా అనిపిస్తుంది. రావు రమేష్ తన స్థాయికి తగ్గ పాత్ర దక్కలేదు.

Advertisements

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో జనం ముందుకు వచ్చాడు. అతను అందించిన పాటలు ఓకే అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో పాటలు సినిమాలో సింక్ అవలేదనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అంతంతమాత్రమే. యువరాజ్ ఛాయాగ్రహణంలో కొత్తదనం ఏమీ లేదు కానీ ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా సోసోగానే ఉన్నాయి. రచయిత, దర్శకుడు శేఖర్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సి వస్తే.. అసలు ఏమీ లేదనే చెప్పాలి. పేలవమైన కథ, గ్రిప్ లేని కథనం, బోరింగ్ స్క్రీన్ ప్లే, లాజిక్ లేని సన్నివేశాలతో సినిమాను పూర్తిగా పడుకోబెట్టేశాడు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.