ఇది కితకితలు పెట్టే గోదారోళ్ల కుటుంబం

గోదారోళ్ల కితకితలు.. ఈ గ్రూపులోకి వెళితే నిజంగానే కితకితలు పెట్టినట్టు నవ్వొస్తుంది. కడుపుబ్బ నవ్వించే పోస్టులతో, ఆత్మీయ పలకరింపులతో కుటుంబం అనే పదానికి అచ్చమైన పర్యాయపదంగా నిలుస్తుంది గోదారోళ్ల కితకితలు. ఈ గ్రూపు గురించి చెప్పుకోవడాని కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. అదే గోదారి యాస. ఆయ్, యాండే అని కుల,మత బేధాలు లేకుండా ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి గోదావరి జిల్లాల వారిది. అదే గోదారోళ్ల గొప్పతనం. ఎంతో ఆప్యాయత కనిపించే ఈ యాసకు మరింత వన్నెలద్దే ప్రయత్నం చేస్తుంది గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ గ్రూప్. ఆ కమ్మటి యాస పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన ఈ గ్రూపు గొప్పదనమేంటంటే నేటి తరానికి యాసను ప్రేమించడం నేర్పిస్తోంది.

Advertisements

గోదారోళ్ల ఆత్మీయత ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే.. మీరు ఈ గ్రూపులో సభ్యుడు కావాల్సిందే. ఈ గ్రూపులో ఒకరినొకరు చక్కగా వరసలతో పిలుచుకుంటారు. అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, బావ అని ఆత్మీయంగా పలకరించుకుంటారు. నిజానికి ఆ మమకారం గోదావరి జిల్లావాసుల రక్తంలోనే ఉంది.

ఈవీవీ సత్యనారాయణ ఈ గ్రూపు సృష్టికర్త. ఓ కంపెనీలో చిరుద్యోగి. కానీ మనసున్న మారాజు. ఇలా అనడం తప్పేమీ కాదు. గోదారోళ్ల గ్రూపు సభ్యులకు అవసరమైన సందర్భాల్లో ఆయన అండగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ గ్రూపు క్రియేట్ చేయడం మాత్రమే కాదు.. గ్రూపులోని సభ్యుల పట్ల పాటించే మర్యాదల విషయంలోనూ ఏమాత్రం తేడా రాకుండా చూసుకుంటారు ఈవీవీ బృందం. ముఖ్యంగా మహిళల విషయంలో ఎవరైనా కాస్త తేడాగా వ్యవహరించినా.. వారిని నిర్థాక్షిణ్యంగా గ్రూపు నుంచి తొలగిస్తారు. అందుకే ఈ గ్రూపులో మహిళలు చాలా సెక్యూర్డ్ గా ఫీలవుతుంటారు. గ్రూపులోని సభ్యులు సైతం కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవన్నీ గ్రూపు సభ్యులు పాటిస్తున్నారో లేదో చూడటానికి ఆరుగురు అడ్మిన్లు, తొమ్మిది మంది మోడరేటర్లు ఉన్నారు. మరి 1,25,000లకు పైగా సభ్యులున్న గ్రూపును క్రమశిక్షణ మీరకుండా చూసుకోవాలంటే అంతమంది ఉండాలి కదా.

Advertisements

ఏడాదికోసారి జరిగే ఆత్మీయ సమ్మేళనంలో గ్రూపు సభ్యులు ఒక్కచేట చేరతారు. ముఖపుస్తకంలో పరిచయం తప్ప ముఖ పరిచయం లేని వారంతా ఇక్కడికొచ్చి ఒకరితో ఒకరు కుటుంబ సభ్యుల్లా కలసిపోతారు. గోదారోళ్ల ఆత్మీయత, వారి అతిథి సత్కారాలను రుచి చూడాలనుకుంటే.. మీరు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందే. దానికి మీకుండాల్సిన అర్హత గోదారోళ్ల కితకితలు గ్రూపులో సభ్యులై ఉండటమే. ఈ భారాన్ని కూడా ఈవీవీ తన భుజాలపైనే మోస్తున్నారు.

గోదారోళ్ల కితకితల కుటుంబం అంటే ఇదేనా? అని మీరనుకోవచ్చు. కాదు అంతకు మించే ఉంది. ఎప్పుడైనా మీకు కాసేపు హాయిగా నవ్వుకుంటే బాగుండు అనిపిస్తే.. ఓ సారి ఈ పేజీ ఓపెన్ చేసి ఇక్కడి పోస్టులు చదవండి.. మనసు హాయిగా మారిపోతుంది. ఎప్పుడైనా చిన్న నాటి జ్ఞాపకాలు అందంగా గుర్తు చేసుకోవాలనిపిస్తే.. ఈ పేజీ చూడండి. లెక్కకు మిక్కిలి కనిపిస్తాయి. అవన్నీ చూసి మనసారా నవ్వుకోవచ్చు. ఆ పోస్టులు చూసినప్పుడు అనిపిస్తుంది. ఇది కదా గోదారోళ్ల ఎటకారం అంటే అని.

Advertisements

ఇంత గొప్పగా చెప్పుకుంటున్న ఈ గ్రూపుకి ఎలాంటి మైనస్ పాయింట్లు లేవా? అంటే.. నాకు తెలిసినంత వరకు ఈ గోదారోళ్ల కితకితలకు పేరెట్టడానికి ఏమీ లేదు. కానీ కొన్ని పోస్టులు భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అపహాస్యం చేసేలా ఉంటాయి. అవి తప్ప గోదారోళ్ల కితకితల పేజీ హాస్యానికి హాయైన చిరునామా.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.