కమలాఫలం తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Advertisements

ఇది కమలాఫలాల సీజన్. అందుకే బజారులో ఎక్కడ చూసినా ఆ పళ్లే కనిపిస్తున్నాయి. సీజన్ మారినప్పుడల్లా చాలా మందికి ఆరోగ్యసమస్యలు తలెత్తుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ఆయా రుతువుల్లో వచ్చే పండ్లను తినాల్సి ఉంటుంది. శీతాకాలం మొదలయ్యే సరికి కమలాఫలాల సీజన్ మొదలవుతుంది. అయితే చాలామంది జలుబు చేస్తుందేమోనని కమలాఫలానికి దూరంగా ఉంటారు. ఇది నిజమేనా? ఒట్టి అపోహేనా? అసలు కమలాఫలాల వల్ల మనకు ఎలాంటి మేలు జరుగుతుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisements

ఈ కమలాఫలాల్లో నాలుగైదు రకాలున్నాయి. ఏది తిన్నా దాన్నుంచి మనకు అందే పోషకాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కమలాఫలంలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపిస్తుంది. విటమిన్లు, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, పీచుపదార్థం ఆరెంజ్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కమలాఫలం దొరికినంత కాలం వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకునే ముందు మీరు మరో విషయం కూడా తెలుసుకోవాలి. అదేంటంటే కమలాఫలంలో విటమిన్ సి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. రోజుకి ఒకటి రెండు మించి ఎక్కువ తినకూడదు.

Advertisements

1. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది..

ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఈ విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడేలా చేస్తుంది. కమలాఫలంలో ఉన్న ఫోలేట్, రాగి కూడా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

2. రక్తహీనత తగ్గిస్తుంది..

ఆరెంజ్ లో ఫోలేట్ ఉంటుంది. ఇది రక్త వృద్ధికి తోడ్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ ను మన శరీరం పూర్తిగా శోషించుకోవాలంటే.. దానికి విటమిన్ సి అవసరం. కాబట్టి రోజుకి కనీసం ఒక్కటైనా కమలాఫలం తినండి.

3. కొవ్వు తగ్గిస్తుంది..

కమలాఫలంలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ.. శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గిస్తాయి.

Advertisements

4. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది..

వయసు పెరిగే కొద్దీ కంటి సమస్యలు రావడం, కంటి చూపు మందగించడం సహజమే. ఆహారంలో కెరొటనాయిడ్స్, విటమిన్ ఎ ఉంటే.. ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కళ్ల ఆరోగ్యానికి విటమిన్ ఎ, కెరొటినాయిడ్ అవసరం చాలా ఉంది. ఈ రెండూ కమలాఫలంలో పుష్కలంగా ఉంటాయి.

5. రక్తపోటు తగ్గిస్తుంది..

హైబీపీతో బాధపడే వారు రోజూ కమలాఫలం తింటే.. మీ బీపీ స్థాయి తగ్గుతుంది. ఎందుకంటే.. కమలాఫలంలో పొటాషియం ఉంటుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది పొటాషియం.

6. జలుబు రాకుండా చేస్తుంది..

శీతాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు కూడా ఒకటి. మరి ఈ జలుబు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చక్కగా కమలాఫలం తినడమే. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కాబట్టి జలుబు లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

7. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా..

మూత్రంలో సిట్రేట్ శాతం తక్కువగా ఉంటే.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఈ సిట్రేట్.. సిట్రిక్ యాసిడ్ రూపంలో సిట్రస్ పళ్లలో ఉంటుంది. రోజుకి ఒక గ్లాసు కమలాఫలం రసం తాగితే.. మూత్రంలో సిట్రేట్ శాతం పెరుగుతుంది. ఫలితంగా కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్లు కరిగిపోవడంతో పాటు కొత్తవి ఏర్పడకుండా ఉంటాయి.

ఇవీ కమలాఫలం వల్ల మనకు అందే ప్రయోజనాలు.. కాబట్టి ఈ శీతాకాలంలో దొరికే కమలాఫలాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

Image: Pexels

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.