వెంకీ మామ సినిమా రివ్యూ..

మామాఅల్లుళ్లుగా ఇద్దరు హీరోలు కలిసి నటించడం తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఆ ఫార్ములాతో తెరకెక్కి విజయం సాధించిన సినిమాలు సైతం ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా అదే ఫార్ములాతో వెంకీ మామ తెరకెక్కింది. ఇక్కడ ఓ ప్రత్యేకత ఏంటంటే.. నిజజీవితంలో మామాఅల్లుళ్లైన విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య తెర మీద కూడా అదే పాత్రలు పోషించారు. అందుకే ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు వెంకటేశ్, చైతూ అభిమానులు. ట్రైలర్, టీజర్లు కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అవి మరింతగా పెరిగాయి. మరి వారి అంచనాలను వెంకీమామ చేరుకోగలిగిందా? లేదా? చూద్దాం.

Advertisements

కథ విషయానికి వస్తే..

వెంకటరత్నం నాయుడు అలియాస్ మిలట్రీ నాయుడు(వెంకటేశ్)కి మేనల్లుడు కార్తీక్(నాగచైతన్య) అంటే వల్లమాలిన ప్రేమ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మేనల్లుడు కార్తీక్ ను చేరదీస్తాడు. అయితే మేనల్లుడి వల్ల మేనమామకు ప్రాణగండం ఉందని గుర్తిస్తాడు మిలట్రీ నాయుడు తండ్రి రామనారాయణ(నాజర్). కార్తీక్ తల్లిదండ్రులు చనిపోవడం కూడా అతడి జాతక ప్రభావమే అని నమ్ముతాడాయన. అందుకే కార్తీక్ నీడ కూడా ఇంటిపై పడకూడదని హుకుం జారీ చేస్తాడు. అంతేకాదు కార్తీక్ ను ఎలా అయినా ఇంటి నుంచి బయటకు పంపేయాలని చూస్తుంటాడు. అయితే అవేమీ పట్టించుకోకుండా.. మేనల్లుడిని కంటికి రెప్పలా పెంచుతాడు మిలట్రీ నాయుడు. ఓసారి కార్తీక్ కు తన వల్ల మేనమామకు గండం ఉందని తెలుస్తుంది. తన వల్ల తన మావయ్యకు ఏమీ కాకూడదని ఊరు విడిచి వెళ్లిపోయి సైన్యంలో చేరతాడు. తన మేనల్లుడు సైన్యంలో చేరాడని తెలుసుకుని అక్కడకు బయలుదేరతాడు. తన మేనల్లుడిని మిలట్రీ నాయుడు కలుసుకున్నాడా? మేనల్లుడి వల్ల మేనమామకు ఎదురైన గండం తప్పిందా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisements

విశ్లేషణ

మామాఅల్లుళ్ల బంధం నేపథ్యంగా తెరకెక్కిన సినిమా ఇది. దానికి జాతకాలను ముడిపెట్టడం కాస్త ఆసక్తికరమైన విషయమే. ఎందుకంటే.. నిజజీవితంలో చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు. అందుకే పిల్లలు పుట్టగానే ఎవరికి ఎలాంటి గండాలున్నాయో చూసుకుని మరీ శాంతులు జరిపించుకుంటారు. ఒకప్పుడు కంసుడు కూడా ఇదే కారణంతో శ్రీ‌కృష్ణున్ని చంపాలనుకుంటాడు. నేను చనిపోయినా ఫర్వాలేదు నా మేనల్లుడు సంతోషంగా ఉంటే చాలనుకుని అపురూపంగా పెంచే కంసుడి కథ వెంకీమామ. ఇలాంటి కాన్సెప్ట్ కి ఆర్మీ బ్యాక్ డ్రాప్ ను కూడా జోడించారు. కాబట్టి ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని క్రియేట్ చేసింది ఈ సినిమా. కానీ ఆ ఆసక్తిని ఎంత వరకు నిలబెట్టుకుందనేదే ఇక్కడ ప్రశ్న. అల్లుడి కోసం దేనికైనా సిద్ధపడే మామ, మామ ప్రాణానికే గండంగా మారిన మేనల్లుడు.. చాలా మంచి పాయింట్ ఉన్న సినిమా. కానీ కథలో నాలుగు చేతులు పడేసరికి వెంకీమామ జాతకం తారుమారైంది. ఎప్పుడో పాత సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు అక్కడొకటి.. ఇక్కడొకటి ఏరుకొచ్చి సినిమా తీసినట్టు అనిపిస్తుంది.

ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ సీన్ల మధ్య సినిమా అటూ ఇటూ నడుస్తూ ఉంటుంది. జాతకాలు, ఆర్మీ బ్యాక్ డ్రాప్ సీన్లతో సినిమా కాస్త సీరియస్ గానే మొదలవుతుంది. దీంతో ఓ మంచి ఎమోషన్ నిండిన సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత మామాఅల్లుళ్ల సందడి తెరపై మొదలవుతుంది. మామకు పెళ్లి చేయాలని అల్లుడు, అల్లుడి ప్రేమ సెట్ చేయాలని మామ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత సినిమా కన్ఫ్యూజన్ కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ఈ కామెడీ కొంత సేపు బాగానే అనిపిస్తుంది. కానీ మళ్లీ మళ్లీ అదే తరహా కామెడీని చూడాల్సి రావడం వల్ల బోర్ కొడుతుంది. దీనికి తోడు డబుల్ మీనింగ్ డైలాగులు, అనవసరమైన సన్నివేశాలతో మరింత బోర్ కొట్టిస్తుంది. వీటన్నింటి మధ్య వెంకీ స్టైల్ కామెడీ జనానికి కాస్త ఊరట అనే చెప్పుకోవాలి. అలా ఫస్టాప్ ఫర్వాలేదన్నట్టుగా సాగిపోతుంది.

ద్వితాయార్థానికి వచ్చేసరికి సినిమా ఎక్కడికెళుతుందో అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు సహజత్వానికి దూరంగా మరీ నాటకీయంగా అనిపిస్తాయి. సినిమా కొంతసేపు టెర్రరిస్టులు, ఆర్మీ చుట్టూ.. మరికొంత సేపు జాతకాల చుట్టూ తిరుగుతుంటుంది. ఈ రెండింటికీ మధ్య పొంతన కుదరలేదు. అసలు మిలటరీ ఎపిసోడ్లు సినిమాకు అవసరమే లేదు. వాటిని కథలో బలవంతంగా ఇరికించినట్టు ప్రేక్షకుడికి అనిపిస్తే అందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఆ సీన్లు లేకపోయినా సినిమాకి వచ్చిన నష్టం ఏమీ లేదు. అసలు ఆర్మీ, దాని తాలూకు ఆపరేషన్ల జోలికి పోకుండా.. మామాఅల్లుళ్ల మధ్య సెంటిమెంట్ తో సినిమాను నడిపించి ఉంటే.. బాగుండేది. అతకని సన్నివేశాలతో ద్వితీయార్థం నిండిపోవడంతో.. ఇంటర్వెల్ టైం కి సినిమాపై వచ్చిన మంచి సినిమా అనే ఇంప్రెషన్ పోతుంది.

క్లైమాక్స్ విషయానికి వస్తే.. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఆర్మీ ఆపరేషన్లు ఎలా చేస్తారో కనీస అవగాహన లేని ఓ నడి వయసు వ్యక్తి టెర్రరిస్ట్ క్యాంపుల్లోకి వెళ్లడం… అక్కడ వారి నాయకుడిని చంపేయడం.. ఆ చంపే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం.. చావు అంచుల దాకా చేరుకుని లేచి కూర్చోవడం చాలా సిల్లీగా అనిపిస్తాయి.

Advertisements

ఇక నటీనటుల విషయానికి వస్తే..

సినిమాలో బలమైన, ముఖ్యమైన పాత్ర వెంకటరత్నం నాయుడిదే. ఈ పాత్రలో వెంకటేశ్ తనదైన శైలిలో నటించారు. మేనమామగా చాలా అలవోకగా నటించారు. వాస్తవానికి ఈ సినిమా కొద్దో గొప్పో బాగుందంటే.. అది పూర్తిగా వెంకీ నటన, మ్యానరిజమ్స్, ఆయన మార్కు కామెడీ వల్లే అని చెప్పుకోవచ్చు. వెంకటేశ్ తో పోలిస్తే.. చైతన్యకు సినిమాలో కాస్త తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ తన పాత్రకు నాగచైతన్య పూర్తి న్యాయం చేయగలిగాడు. కార్తీక్ పాత్రను మరింత తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నాలకు సినిమాలో పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదు. ఇద్దరూ పాటలకే పరిమితమయ్యారనుకోవడంలో తప్పేమీ లేదు. ఎమ్మెల్యే కమ్ విలన్ గా రావు రమేశ్, మరో విలన్ గా దాసరి అరుణ్ కుమార్, మరో ముఖ్యమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ రొటీన్ గానే తెరపై కనిపించారు.

Advertisements

చివరిగా సాంకేతిక వర్గం విషయానికి వస్తే..

థమన్ వెంకీమామకు మంచి పాటలను అందించాడు. కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఓకే అనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల సినిమా విజువల్స్ ను అందంగా చిత్రీకరించాడు. దర్శకుడు బాబీ ఈ సినిమాలో కొత్తదనాన్నిచూపించడంలో విఫలమయ్యాడు. కొన్ని సీన్లు, ఫస్టాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగానే తీశాడు కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నిర్మాణ విలువలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సినిమా రిచ్ గా కనిపిస్తుంది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం వెంకీమామ సినిమా ఫెయిలయింది.

రేటింగ్: 2.5/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.