జనసేనాని రీఎంట్రీ ఉన్నట్టా .. లేనట్టా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి దూరమై రెండేళ్లు అవుతోంది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. తిరిగి సినిమాలు చేసే ఆసక్తి లేదని చాలా సార్లు స్పష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్ కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయి.. జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో హిట్ కొట్టిన పింక్ సినిమా రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్‌ పింక్‌ రీమేక్‌లో నటిస్తున్నట్టుగా మూవీ ఎనలిస్ట్ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్ కూడా చేశాడు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. ఇండస్ట్రీలో ఇంత చర్చనీయాంశంగా మారినప్పటికీ పవన్‌ కళ్యాణ్ మాత్రం రీ ఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. సినిమా మ్యూజిక్ సిట్టింగ్‌లు స్టార్ట్ అయినట్లు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ అద్భుతమైన ట్యూన్ అందించాడంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. థమన్ తో ఒక ఫోటో కూడా పెట్టింది. అయితే పింక్ తెలుగు రీమేక్ లో హీరో పవన్ కళ్యాణేనా? కాదా? అన్న విషయాన్ని చెప్పకుండా వదిలేసింది. దీంతో ఫ్యాన్స్ మళ్లీ డైలమాలో పడ్డారు. ఈ సినిమాలో నివేతా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు కూడా రూమర్లు వస్తున్నాయి.

సినిమా విషయాలు పక్కన పెడితే జనసేనాని పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో మళ్లీ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో తనదైన శైలి పోరాటం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా వైజాగ్ లో పవన్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం అంశం, రైతులకు కనీస ధర అందే విషయంపై వరుస పోరాటాలు చేస్తూ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాకినాడలో వరి మద్ధతు ధర కోసం రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. ఈ గ్యాప్ లో బీజేపీ కి కూడా క్లోజ్ అయ్యారు. ఇది గమనించిన వైఎస్సార్‌సీపీ పార్టీ.. జనసేన పార్టీని టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. ముందే సినిమాలపై పెద్దగా ఆసక్తి లేని పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో క్రియాశీలక శక్తిగా మారుతున్న ఈ తరుణంలో సినిమా చేయక పోవడమే మంచిదని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. అయినా తమ అభిమాన కథానాయకుడి నుంచి ఓ మంచి సినిమా వస్తే బాగుంటుందని కూడా మరికొందరు ఆశిస్తున్నారు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.