మొటిమలు వేధిస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి..

ముఖం మీద మొటిమ వస్తే చాలు.. అస్తమానూ దాన్ని చేత్తో తాకుతూనే ఉంటాం. అద్దంలో చూసుకుంటూ.. తగ్గిందా? లేదా? అని చెక్ చేసుకుంటూ ఉంటాం. కొంత సమయం తర్వాత దాన్ని పాప్ చేయడానికి అంటే పిండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది ఏ ఒక్కరికో ఉన్న అలవాటు కాదు.. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరికీ ఉండేదే. ఇలా మొటిమలు వచ్చిన తర్వాత బాధపడటం కంటే.. వాటిని రాకుండా చూసుకోవడం మంచిది కదా. వచ్చిన మొటిమలను తగ్గించడంతో పాటు.. పింపుల్స్ రాకుండా చేసే కొన్ని పదార్థాలు, వాటిని ఉపయోగించి పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం.

Advertisements

కలబంద

మొటిమ వచ్చిందంటే మనకు మొదట గుర్తు రావాల్సింది కలబంద. మొటిమలనే కాదు.. ఎలాంటి చర్మ సంబంధమైన సమస్యలు అయినా సరే కలబంద చక్కని పరిష్కారం చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో దాదాపుగా అందరి పెరట్లోనూ కలబంద మొక్క ఉంటుంది కాబట్టి… ఎప్పుడైనా మొటిమ వస్తే ఈ చిట్కాను పాటించండి. కలబంద గుజ్జును కాసేపు ఫ్రిజ్ లో పెట్టి.. దాన్ని మొటిమ ఉన్న చోట అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమ వల్ల వచ్చిన వాపు, నొప్పి త్వరగా తగ్గుముఖం పడతాయి.

అసలు మొటిమలు రాకుండా ఉండాలంటే.. వారానికోసారి చొప్పున కలబంద గుజ్జును ఫేస్ ప్యాక్ మాదిరిగా ముఖమంతా అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Advertisements

ఓట్స్, నిమ్మరసం, తేనె

మొటిమలు తగ్గించడంతో పాటు మొటిమలు రావడానికి కారణమైన జిడ్డును కూడా ఓట్ మీల్ తొలగిస్తుంది. ఈ ఫలితాన్ని పొందడానికి మీరు ఓట్స్ తో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సి ఉంటుంది. గిన్నెలో కప్పు ఓట్ మీల్ వేయాలి. దీనికి ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయ రసం కూడా వేసి బ్లెండర్ తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి మాస్క్ లా అప్లై చేసుకుని సున్నితంగా రబ్ చేసుకోవాలి. ఇరవై నిమిషాల వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వారానికోసారి ఈ ప్యాక్ మొటిమలు తగ్గించడంతో పాటు మేని ఛాయ కూడా పెరుగుతుంది.

Advertisements

కమలాఫలం తొక్కల పొడి

కమలాఫలం తొక్కల్లో ఉండే సి విటమిన్ మొటిమలను సమర్థంగా తగ్గిస్తుంది. కమలాఫలం తొక్కలను రెండు మూడ్రోజులు ఎండబెట్టి మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి పేస్ట్ లా తయారు చేసి మొటిమలు ఉన్న చో్ట అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు వారానికోసారి ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Advertisements

వేప, పసుపు

వేప, పసుపు రెండింటికీ యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియాను సంహరిస్తాయి. మొటిమల వల్ల వచ్చిన వాపు, నొప్పిని కూడా తగ్గిస్తాయి. వేపాకులను ముద్దగా చేసి దానికి పసుపు కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని కాసేపు మర్దన చేసుకోవాలి. మర్దన పూర్తయిన తర్వాత 45 నిమిషాల పాటు అలా వదిలేసి బాగా ఆరనివ్వాలి. నిర్ణీత సమయం పూర్తయిన తర్వాత ఫ్రిజ్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా మొటిమలు రాకుండా చూసుకోవచ్చు.

Image: Alexandru Zdrobău/Unsplash

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.