మీ భర్తలో ఈ లక్షణాలున్నాయా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే..

కొంతమంది నలుగురిలో ఒకలా.. నాలుగ్గోడల మధ్య మరోలా ఉంటారు. ఇలాంటి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. పైకి చాలా ప్రేమను కనబరుస్తూ లోపల మాత్రం విషజ్వాలలు వెదజల్లుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి భర్తగా వస్తే అమ్మాయి పడే బాధ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా నా అంత గొప్పవాడు లేడు అని భావించే వాడితో జీవితాన్ని గడపడం చాలా కష్టం. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అలాంటి వ్యక్తులను ఎలా గుర్తించాలి? దానికి ఆ వ్యక్తిలో ఉండే కొన్ని లక్షణాలు ప్రవర్తన ఆధారంగా వారిని గుర్తించి జాగ్రత్తగా ఉండొచ్చు.

మహిళలను తక్కువగా చూడటం

ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనం ఉన్నప్పటికీ కొంతమందికి మహిళలను గౌరవించడం రాదు. అమ్మాయిలను చాలా తక్కువ భావనతో చూస్తారు. మగవారి అవసరాలను తీర్చడానికే వారు పుట్టినట్టు ఫీలవుతుంటారు. మహిళల ఆలోచనలకు, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం వీరికి చేతకాదు. ఆడవారు చేసే చిన్న చిన్న పొరపాట్లను ఎత్తి చూపే విషయంలో మాత్రం వీరు ముందుంటారు. ఇతర మహిళల గురించి కూడా చాలా చెడుగా మాట్లాడుతుంటారు.

Advertisements

ఆధిపత్య ధోరణి

అమ్మాయిలు తక్కువ మేం ఎక్కువ అనే భావన చాలా మంది అబ్బాయిల్లో ఉంటుంది. ఇలాంటి వ్యక్తికి భార్యగా వెళ్లిన అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది? ఆలోచిస్తేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అసలు ఆమె ఆలోచనలకు, అభిప్రాయాలకు కనీస విలువ కూడా ఇవ్వడం వీరికి చేతకాదు. ఎంతసేపు తన భాగస్వామిని అభద్రతాభావానికి గురి చేయడం.. నేను లేకపోతే నీకు బతుకు లేదన్నట్టుగా వ్యవహరించడం లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ అతనిలో దాగున్న ఆధిపత్య ధోరణికి పరాకాష్టగా భావించవచ్చు.

Advertisements

మాట్లాడనివ్వకపోవడం

వివాహ బంధంలో భార్యాభర్తలిద్దరికీ సమప్రాధాన్యం ఉన్నప్పుడే ఆ బంధం నలుగురికీ ఆదర్శనీయంగా ఉంటుంది. లేదంటే ఆ బంధానికి తగ్గ విలువ ఇవ్వడం లేదనే అర్థం. కొందరు మగవారికి తమ భార్య మాట్లాడితే అదేదో పరువు తక్కువ పనిగా వారు భావిస్తుంటారు. ఎప్పుడైనా ఏదైనా విషయంలో తన అభిప్రాయం చెప్పాలని భార్య ప్రయత్నిస్తే.. ఆమెను అక్కడే కించపరిచేలా మాట్లాడుతుంటారు. కనీసం ఆమె మనసులో మాటను చెప్పే అవకాశాన్ని కూడా ఇవ్వరు. ఆమె ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టి ఆమెకు స్వతంత్రం లేకుండా చేయడానికే చూస్తుంటారు. మీకు కాబోయే భాగస్వామి కూడా తరచూ మీ మాటకు అడ్డు తగులుతున్నా.. లేదా అసలు మీ మాటకు విలువ ఇవ్వకపోయినా.. అతనికి అమ్మాయిలంటే చిన్నచూపు ఉందనే అర్థం.

Advertisements

తమదే పై చేయిగా వ్యవహరించడం

మనిషన్నాక తప్పు చేయడం సహజం. కానీ వీరికి మాత్రం తప్పు చేసినా సరే దాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండదు. పైగా తాము చేసిన తప్పులకు కట్టుకున్న భార్యను కారణంగా చూపిస్తుంటారు. ‘నిన్ను చేసుకున్నాకే నా బతుకు ఇలా తగలడింది’ లాంటి డైలాగులు వదులుతూ.. ఆమెను మనోవ్యథకు గురిచేస్తుంటారు. అసలు తన భార్యకు తెలివే లేదని వీరికున్న మరో దురభిప్రాయం. ఆమె జీవితం ఎలా సాగాలో వీరే డిసైడ్ చేసేస్తుంటారు. ఆమె ధరించే దుస్తుల నుంచి తినే తిండి వరకు మొత్తం అంతా నేను చెప్పినట్టు సాగాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు.

Advertisements

మరి ఏం చేయాలి?

ఇలాంటి మనస్తత్వం ఉన్నవారిని నాలుగు రోజులు భరించడమే కష్టం. అలాంటిది జీవితాంతం భరించాలంటే..? అమ్మో.. ఆ ఆలోచనే భయంకరంగా ఉంది కదా..! కాబట్టి.. అమ్మాయిలూ.. పెళ్లికి ముందు అబ్బాయి జీతభత్యాలు, ఉద్యోగం, కుటుంబం గురించి ఎలా ఆరా తీసి ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటారో.. అలాగే.. గుణగణాల గురించి కూడా తెలుసుకోవాలి.

అయితే ఈ విషయంలో ఎవరో ఒకరిని అడిగి అతడి మనస్తత్వాన్ని అంచనా వేయాలనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే. ఎందుకంటే అబ్బాయి మనస్తత్వం ఎలా ఉన్నా పెళ్లి చెడగొట్టడం ఎందుకన్న ఉద్దేశంతోనో లేదా పెళ్లయ్యాకా తనే మారతాడనే అభిప్రాయంతోనో మంచివాడనే చెప్పేవారికి కొదవ లేదు. కాబట్టి మీరే స్వయంగా పరిశీలించి తెలుసుకోవడం మంచిది.

Advertisements

ఈ మధ్య కాలంలో అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ.. పెళ్లికి ముందే అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు మానసికంగా దగ్గరయ్యేందుకు తరచూ మాట్లాడుకోవడం, మెసేజ్ లు చేసుకోవడం లాంటివి ఎలాగూ చేస్తున్నారు. ఆ సమయంలోనే అతని మాటలను బట్టి మనస్తత్వాన్ని అంచనా వేయచ్చు. మీకు కాబోయే భాగస్వామిలో పైన మనం చెప్పుకున్న లక్షణాలు ఏమైనా మీకు కనిపిస్తే.. ఏం చేయాలో మీరే ఓ సారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.