మీ సెక్స్ లైఫ్ గురించి ఇతరులతో షేర్ చేసుకుంటున్నారా?

అప్పుడప్పుడూ మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా మీ తోబుట్టువుతోనో లేదా మీకు బాగా దగ్గరైన వ్యక్తులతో మీ బెడ్రూం విషయాలు షేర్ చేసుకోవడంలో తప్పేమీ లేదని మీకు అనిపించవచ్చు. ముఖ్యంగా సెక్స్ లైఫ్ కి సంబంధించిన సందేహాలున్నప్పుడు కచ్చితంగా ఎవరో ఒకరిని అడిగి వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు.. అయితే ఆ సమయంలో కొన్నిసార్లు.. నవ్వుకుంటూ నవ్వుకుంటూ.. చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పేస్తుంటారు. అలా చెప్పడం మంచిదేనా? ఒకవేళ షేర్ చేసుకోవాల్సి వస్తే.. ఎంత వరకు చెప్పాలి? తదితర విషయాల్లో అవగాహన ఉండటం ముఖ్యం.

రిలేషన్షిప్ – భార్యాభర్తలైనా, ప్రేయసీప్రియులైనా అది వారిద్దరికీ మధ్య మాత్రమే ఉన్న అనుబంధం. ఈ బంధంలో మీ ఇద్దరికీ మాత్రమే పరిమితమైన అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది మీ లైంగిక జీవితం. ఇది పూర్తిగా మీ బెడ్రూంలో జరిగే విషయం. దీన్ని ఆ గదికే పరిమితం చేయడం మంచిది. సాధారణంగా ఇలాంటి విషయాలు ఇతరులతో పంచుకోవడం వల్ల మీకు, మీ భాగస్వామికి మధ్య కాన్ఫిడెన్సియాలిటీ(గోప్యత) దెబ్బతింటుంది. ఒకవేళ మీకు ఇలా మీ లైంగిక జీవితం గురించి అతిగా చర్చించే అలవాటు ఉంటే దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisements

మీ భాగస్వామికి చెప్పండి

అసలు మీరు మీ బెడ్రూం విషయాలను ఇతరులతో చర్చిస్తున్నారని తెలిస్తే మీ భాగస్వామి ఎలా స్పందిస్తారో మీకు తెలుసా? తెలీదు కదా. కాబట్టి మీరే ఈ విషయాన్ని వారికి చెప్పండి. ఈ విషయంలో నిజాయతీగా వ్యవహరించండి. మీ ఇద్దరికే పరిమితమైన ఈ విషయాన్ని మీరు ఎవరితో ఏ రకంగా చెబుతున్నారో వివరించండి. వారు ఈ విషయంలో మీపై కోపం ప్రదర్శించినా.. అలా చెబుతున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేసినా.. వారికి మీ రహస్యాలు రహస్యంగా ఉంచడమే ఇష్టమని అర్థం. కాబట్టి అంతటితో మీ అలవాటుకు పుల్ స్టాప్ పెట్టేయండి.

Advertisements

వారే మీ గురించి చెబితే..

మీరు మీ భాగస్వామి గురించి చెబుతున్నట్టుగానే.. మీ గురించి మీ భాగస్వామి తన స్నేహితులతో చర్చిస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి. మీ ప్రైవసీని దెబ్బ తీసినట్టుగా మీకు అనిపిస్తుంది కదా. అంటే మీరు స్నేహితులతో సెక్స్ లైఫ్ గురించి చర్చిస్తున్నారని తెలిసినప్పుడు మీ భాగస్వామి కూడా అలాగే ఫీలవుతారు కదా. అంతేనా.. మీ ఫ్రెండ్స్ ఎదురైనప్పుడల్లా.. చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. తనని వారు తక్కువ చేసి మాట్లాడతారామో అని న్యూనతాభావంలో మునిగిపోతారు.

నిజంగానే మీ సీక్రెట్ ను సీక్రెట్ గా ఉంచుతారా?

మీరు ప్రతి విషయాన్ని ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటారనుకుందాం. మరి వారు మీ సీక్రెట్ ను సీక్రెట్ గా ఉంచుతారా? ఏమో వారు మరొకరి దగ్గర మీరు చెప్పిన విషయాలన్నీ చెబుతున్నారేమో? ఒకవేళ చెప్పినా ఆ విషయం మీకు తెలియదు కదా. అఫ్ కోర్స్.. వారు ఎవరికీ చెప్పరనే నమ్మకం మీకు ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా నోరు జారితే మీ పరిస్థితి ఏంటి? కాబట్టి మీరు మీ బెడ్రూం విషయాలు ఎవరితోనూ చెప్పకపోవడమే మంచిది. సెక్స్ కి సంబంధించి ఏవైనా సందేహాలుంటే.. మీ పరిధులు అధిగమించకుండా.. మీకు సంబంధించిన సీక్రెట్స్ రివీల్ చేయకుండా.. వాటిని తీర్చుకోవడం మంచిది.

Advertisements

సైలెంట్ గా ఉండండి.. తప్పేమీ లేదు..

మీ లైంగిక జీవితం ఎంత గొప్పగా అయినా ఉండనివ్వండి. దాని గురించి మీరు ఇతరులతో చర్చించాల్సిన అవసరం లేదు. అలాగే మీ స్నేహితులు కలిసినప్పుడు.. ఇలాంటి విషయాలు చర్చకు వస్తే.. మీ విషయాలు చెప్పకుండా ఉంటే వచ్చిన నష్టం ఏమీ లేదు. ముఖ్యంగా సెక్స్ విషయంలో మీ భాగస్వామి బలహీనతల గురించి, కలయిక సమయంలో మీరు చేసే చిలిపి పనులు గురించి అస్సలు చర్చించకండి. ఈ విషయాన్ని మీరు ఓ రూల్ గా పాటించండి. కచ్చితంగా మీ బెడ్రూం విషయాలు షేర్ చేసే అలవాటు తగ్గిపోతుంది.

Image: Pexels

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.