ప్రయాణంలో వాంతులవుతున్నాయా? ఈ చిట్కాలతో వాటికి చెక్ చెప్పండి

బస్సెక్కగానే తల తిరుగుతున్నట్టు, వాంతి వచ్చేట్టుగా అనిపిస్తుందా..? ప్రయాణమంతా ఇలాగే ఉంటే.. ఎంత చిరాకుగా ఉంటుందో పనిగట్టుకుని మనం చెప్పుకోనక్కర్లేదు. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ బాధ. వికారం పెట్టే ఇబ్బంది ఒకవైపు.. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నామనే ఫ్రస్టేషన్ మరోవైపు.. బస్సులో ఉన్నంత వరకు మన పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ మోషన్ సిక్నెస్ (Motion Sickness) తక్కువ సమయమే ఉన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం మనపై బలంగానే పడుతుంది. అసలు జర్నీ చేయాలంటేనే భయపడిపోతుంటారు. మీరు కూడా ఇలా బస్ జర్నీ అంటే భయపడుతున్నారా? కొన్ని సహజమైన చిట్కాలు (natural remedies) పాటించడం ద్వారా ప్రయాణంలో వికారం, వాంతులు రాకుండా చూసుకోవచ్చు.

మోషన్ సిక్నెస్ లక్షణాలు

మోషన్ సిక్నెస్ (ప్రయాణంలో వికారం, వాంతులు)తో బాధపడేవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒళ్లంతా చిరు చెమటలు పట్టడం, తల తిరగడం, వికారం, నోట్లో లాలాజలం ఎక్కువ స్రవించడం, చర్మం పాలిపోయినట్టుగా మారడం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మోషన్ సిక్నెస్ రావడానికి ప్రధాన కారణాలు

నిద్ర సరిగ్గా లేకపోవడం, గర్భం దాల్చడం, పొగ త్రాగే అలవాటు ఉండటం, మైగ్రైన్ సమస్య ఉన్నవారికి ప్రయాణ సమయంలో వికారంగా అనిపిస్తుంది. మీరు ప్రయాణించే బస్సులోకి గాలి సరిగ్గా రాకపోవడం వల్ల కూడా ప్రయాణంలో వాంతులు రావడానికి కారణమవుతుంది. 2 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఈ సమస్య అధికంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే.. మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. సాధారణంగా మీ శరీరం ప్రయాణానికి అలవాటు పడిన తర్వాత వికారం తగ్గిపోతుంది. ఒకవేళ అలా తగ్గకపోతే.. ఈ నేచురల్ రెమెడీస్ సత్వర ఉపశమనాన్నిస్తాయి.

అల్లం

ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మీ వెంట అల్లం ముక్కను తీసుకెళ్లండి. మీరు బస్సు ఎక్కగానే.. చిన్న అల్లం ముక్కను మీ బుగ్గన పెట్టుకుని దాన్నిరసాన్ని కొంచెం కొంచెంగా పీల్చండి. అల్లంలో ఉన్న జింజరోల్ వికారం తగ్గిస్తుంది.

నిమ్మ

మీకు మోషన్ సిక్నెస్ ఉంటే నిమ్మకాయను మీ దగ్గర ఉంచుకోండి. అప్పుడప్పుడూ నిమ్మకాయ వాసన చూడటం లేదా నిమ్మ చెక్కను చప్పరించడం ద్వారా వికారం తగ్గించుకోవచ్చు. నిమ్మకున్న ఆమ్లత్వం స్టమక్ యాసిడ్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే నిమ్మకాయ నుంచి వచ్చే వాసన కూడా వికారాన్ని తగ్గిస్తుంది.

సోడా

చల్లటి సోడా(కార్బొనేటెడ్ డ్రింక్) తాగడం ద్వారా మోషన్ సిక్నెస్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. జింజర్ సోడా, లెమన్ సోడా తాగితే వికారం తగ్గుతుంది. అలాగే కాఫీ, టీ వంటివి తాగకుండా ఉండటమే మంచిది. ఇవి మోషన్ సిక్నెస్ తీవ్రతను మరింతగా పెంచుతాయి.

చామంతి టీ

చామంతి టీ (Chamomile tea) కూడా ప్రయాణంలో వచ్చే వికారాన్ని తగ్గిస్తుంది. ఇది జీర్ణాశయంలో ఆమ్లాల విడుదలను తగ్గిస్తుంది. అలాగే పొట్ట కండరాలను రిలాక్సయ్యేలా చేస్తుంది. చామంతి టీ కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సూపర్ మార్కెట్లలో, ఆన్లైన్లో Chamomile tea బ్యాగ్స్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. మీరు చేయాల్సిందల్లా టీ బ్యాగులతో పాటు టీ కప్పు, వేణ్నీళ్లు నింపిన ప్లాస్క్ కూడా తీసుకెళ్లడమే. ఈ టీ తాగడం కోసం వేణ్నీళ్లే అవసరం లేదు. చన్నీళ్లలోనూ బ్యాగ్ డిప్ చేసి తాగొచ్చు.

ఖాళీ కడుపుతో ప్రయాణం వద్దు

ఎలాగూ వాంతులవుతాయి కదా అని చాలామంది ఏమీ తినకుండానే ప్రయాణం చేస్తుంటారు. ఏమీ తినకపోవడం వల్ల నీరసంగా అనిపిస్తుంది. దీనికి తోడు మోషన్ సిక్నెస్ కూడా తోడైతే.. ఆ నీరసం మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏమీ తినకుండా ప్రయాణం మాత్రం చేయద్దు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే మంచిది. పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే కడుపు ప్రశాంతంగా ఉంటుంది. నూనె ఎక్కువగా పీల్చుకునే ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

బస్సు లేదా రైల్లో ఇలా కూర్చోవాలి

మోషన్ సిక్నెస్ తో బాధపడేవారు తాము ప్రయాణిస్తున్నవాహనం ఏ దిశలో ప్రయాణిస్తుందో.. అదే దిశలో ఉన్న సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. రైలు, బస్సుల్లో కొన్ని సీట్లు వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇలాంటి సీట్లలో కూర్చుంటే తలనొప్పి, వికారం మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ సీట్లలో కూర్చుంటే గాలి సరిగ్గా ఆడదు. అందుకే బస్సు లేదా రైల్లో వెళుతున్నప్పుడు అవి ఏ దిశలో వెళుతుందో అదే దిశలో ఉన్న సీట్లలో కూర్చుంటే మంచిది. అలాగే కిటికీ పక్కన ఉన్న సీట్లలో కూర్చుని తాజా గాలి పీల్చుకుంటూ ఉన్నా వికారం సమస్య రాకుండా ఉంటుంది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.