ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సాయిధరమ్ తేజ్ కి ఒక్క సుప్రీమ్ తప్ప చెప్పుకోదగ్గ విజయాలేమీ లేవు. వరుసగా ఆరు చిత్రాలు ప్లాప్ అయిన ఈ మెగా ఫ్యామిలీ హీరో ‘చిత్రలహరి’తో కాస్త కుదురుకున్నాడు. ‘శైలజారెడ్డి అల్లుడు’ ప్లాప్ తర్వాత మళ్లీ హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. వీరిద్దరూ కలిసి.. చేసిన సినిమా ‘ప్రతి రోజూ పండగే’. ట్రైలర్, టీజర్లతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఫీల్ తీసుకొచ్చింది. మరి తెరపై మంచి ఎమోషన్ నిండిన కుటుంబ కథా చిత్రంగా నిలిచిందా? లేదా యధావిధిగా సాయి ధరమ్ తేజ్ కు బ్యాడ్ లక్ మళ్లీ హలో చెప్పిందా? చూద్దాం.

Advertisements

ఇదీ కథ..

రెక్కలొచ్చిన పిల్లలు ఎక్కడెక్కడో సెటిలయితే.. ఒంటరిగా ఇంట్లోనే మిగిలిపోయిన పెద్దాయన రఘురామయ్య (సత్యరాజ్). ఏదో అలా కాలం వెళ్లదీస్తున్న ఆయనకు లంగ్ క్యాన్సర్ అని.. ఐదు వారాల కంటే ఎక్కువ బతకడని చెబుతారు వైద్యులు. విషయం ఆయన పిల్లల వరకు చేరుతుంది కానీ.. ఏవో కారణాలు చెప్పి చివరి రెండు వారాలు మాత్రం ఆయనతో గడపాలని డిసైడ్ అవుతారు. కానీ తాతయ్య అంటే బాగా ఇష్టపడే సాయి(సాయి ధరమ్ తేజ్) మాత్రం ఆయన చివరి రోజుల్లో చాలా సంతోషంగా గడిపేలా చూసుకోవాలని భావిస్తాడు. అనుకున్నదే తడవుగా తాత దగ్గర వాలిపోతాడు. మిగిలిన కుటుంబ సభ్యులను కూడా ఇంటికి వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? రఘురామయ్య తన చివరి అంకాన్ని ఎలా ముగించాడు? అనేదే ఈ సినిమా కథ

Advertisements

విశ్లేషణ

చనిపోతాడని తెలిసిన వ్యక్తిని చివరి రోజుల్లో వీలైనంత సంతోషంగా ఉంచాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. అంటే ఎమోషన్స్, సెంటిమెంట్ నిండి ఉన్న సినిమా అని అందరూ ఎక్సెప్ట్ చేస్తారు. కానీ దానికి భిన్నంగా పూర్తిగా కామెడీ సినిమాగా దీన్ని తెరకెక్కించాడు మారుతి. ప్రతి సిచ్యుయేషన్లోనూ కామెడీని బాగా పండించాడు దర్శకుడు. కానీ కొన్ని సన్నివేశాల్లో మాత్రం చాలా చావు బతుకుల మధ్య ఉన్న తండ్రి విషయంలో పిల్లలు ఇలా ప్రవర్తిస్తారా? అనిపిస్తుంది. తండ్రి దగ్గరకు కొడుకులు ఒకరొకరిగా వచ్చి సమాధి డిజైన్లు, అంతిమయాత్ర వాహనాన్ని చూపించడం చాలా దారుణంగా అనిపిస్తుంది. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే.. ఏ భార్య అయినా తన భర్త కొన్ని రోజుల్లో చచ్చిపోతాడని తెలిస్తే.. చాలా బాధపడుతుంది. అందుకు భిన్నంగా రఘురామయ్య భార్య చచ్చిపోయాక నోట్లో పోసే తులసి నీళ్లు తయారు చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పమని అంటుంది. ఇవి సామాన్యుడికి మింగుడు పడని అంశాలు. సినిమా ఆద్యంతం సరదాగా ఉండాలనుకున్నారు. ఓకే.. కానీ ఆ సరదాకి ఓ హద్దంటూ లేకుండా పోయింది. కామెడీ వర్కవుట్ అయిందా? లేదా? అని మాత్రమే చూసుకున్నారు తప్ప.. ఈ కామెడీ హడావుడిలో పడి చనిపోయే వ్యక్తి ఎమోషన్ ఎలా ఉంటుందో.. కన్నతండ్రి చనిపోతాడంటే పిల్లలు ఎంత గాభరా పడతారో చూపించడం మాత్రం మరచిపోయారు. అందుకే సినిమా సగటు ప్రేక్షకుడికి ఎమోషనల్ గా కనెక్టవలేకపోయింది. ఆ ఎమోషనే కనుక ఈ సినిమాలో ఉండి ఉంటే.. శతమానంభవతి మాదిరిగా ఎప్పటికీ ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయే సినిమాగా నిలిచి ఉండేది.

Advertisements

నటీనటులు

ఈ సినిమాలో నటీనటుల గురించి, వారి నటన గురించి చెప్పుకోవాలంటే.. మనం మొదట చర్చించుకోవాల్సింది రావు రమేష్ పాత్ర గురించే. అప్పటి వరకు నెమ్మదిగా సాగిన సినిమా.. రావు రమేష్ ఎంట్రీతో స్పీడందుకుంటుంది. తన కామెడీ టైమింగ్, హావభావాలతో సినిమాకి ఓ ప్రధానబలంగా మారాడు. కాస్తో కూస్తో ఈ సినిమా బాగుందంటే.. అది రావు రమేష్ పాత్ర వల్లనే. ఈయన పాత్ర ఎంత బలంగా ఉందంటే.. హీరో పాత్రను కూడా ఓవర్టేక్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ పెర్ఫామెన్స్ బాగానే అనిపించినా.. ప్రత్యేకత ఏమీ చాటుకోలేకపోయాడు. క్లైమాక్స్ మినహా ఎక్కడా అతని ప్రభావం కనిపించదు. ఈ సినిమాకు మరో డ్రైవింగ్ ఫోర్స్ సత్యరాజ్. రఘురామయ్య పాత్రకు అవసరమైన హుందాతనాన్ని, పెద్దరికాన్ని తన నటనతో తీసుకొచ్చాడు. టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్ణగా రాశి ఖన్నా ఆకట్టుకుంది. కానీ ఆ పాత్రను మధ్యలోనే వదిలేసినట్టుగా అనిపిస్తుంది. తెరపై కనిపించినంత వరకు రాశి చాలా అందంగా కనిపించింది. చక్కని అభినయాన్ని పలికించింది. ఆమె పాత్రను మరింతగా తీర్చిదిద్ది ఉంటే సినిమాకు ప్లస్ అయ్యి ఉండేది.

Advertisements

సాంకేతికవర్గం

ప్రతిరోజూ పండగే సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదట తమన్ సంగీతం గురించే మాట్లాడుకోవాలి. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్లలో ఇది కూడా ఒకటి. ఓ బావా.. ప్రతి రోజు పండగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. జయకుమార్ సంపత్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. విజువల్స్ చాలా అందంగా చిత్రీకరించారు. సినిమా తెరపై చాలా రిచ్ గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ స్థాయికి తగ్గట్లుగా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమాకు దర్శకుడు, రచయిత అయిన మారుతి మంచి పాయింటే ఎంచుకున్నాడు. కానీ దాన్ని తెరపై సరిగ్గా చిత్రీకరించలేకపోయారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు శతమానంభవతి సినిమా గుర్తొస్తుంది. రావు రమేష్, సత్యరాజ్ పాత్ర మినహా మిగిలిన క్యారెక్టర్లను సరిగా చిత్రీకరించలేకపోయాడు. కామెడీ, ఎమోషన్ల మధ్య సమతూకం తీసుకురావడంలో విఫలమయ్యాడు.

రేటింగ్: 2.75/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.