నోటి దుర్వాసన పోగొట్టే వంటింటి చిట్కాలు..

నోటి దుర్వాసనతో(Halitosis) బాధపడేవారు ఇతరులతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడతారు. తమ చెడు శ్వాస కారణంగా ఎదుటివారు తమను అసహ్యించుకుంటారేమో అనే ఆలోచన వారిని మాట్లాడనివ్వదు. ఒక వేళ ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నోటికి కర్చీఫ్ అడ్డు పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఎన్ని రోజులని ఇలా మేనేజ్ చేయడం? దానికీ ఓ పరిష్కారం ఉంటుంది కదా. చెడు శ్వాస కూడా ఓ అనారోగ్య సమస్యే. దీనికి కారణం నోటిలో పెరిగే బ్యాక్టీరియా. కొన్ని నేచురల్ టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్యను తాత్కాలికంగా దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

నీరు

నోరు పొడిబారిపోవడం కూడా నోటి దుర్వాసనకు కారణమే. సరిపడినంత మొత్తంలో లాలాజలం స్రవించకపోవడం వల్ల నోరు పొడిబారినట్లవుతుంది. ఫలితంగా నోటి దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి రోజుకి కనీసం 2.5 – 3 లీటర్ల నీరు తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది. డీహైడ్రేషన్, మనం వేసుకునే మందులు కూడా నోరు పొడిబారిపోతుంది. కాబట్టి తగినంత నీరు తాగాల్సి ఉంటుంది.

సోంపు

ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు భోజనం పూర్తయ్యాక కొన్ని సోంపు గింజలు నోట్లో వేసుకోవడం చాలామందికి ఉన్న అలవాటే. ఈ సోంపు ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేయడంతో పాటు నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. కాబట్టి ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు రోజులో అప్పుడప్పడూ ఓ చెంచాడు సోంపు గింజలను నమిలి మింగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

గ్రీన్ టీ

రోజూ ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీ తాగే అలవాటు మీకు ఉందా? అయితే మీరు ఆ అలవాటుకి ఇక పుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఈ రెండింటికీ బదులుగా ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుముఖం పడుతుంది.

అల్లం

అల్లం నోటి దుర్వాసనకు కారణమైన బ్యాక్టీరియాను సమర్థంగా నిర్మూలిస్తుంది. చెంచాడు అల్లం రసాన్ని గ్లాసు వేణ్నీళ్లలో కలిపి ఆహారం తిన్నతర్వాత పుక్కిలించి ఊయాలి. మొదట్లో ఆహారం తీసుకున్నప్రతిసారి ఈ చిట్కాను పాటించాలి. కొంత కాలం తర్వాత మూడు నాలుగురోజులకోసారి పాటిస్తే సరిపోతుంది. ఈ చిట్కా నోటి దుర్వాసన మాత్రమే కాకుండా గొంతు, ఇతర నోటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

కొత్తిమీర

కొత్తమీర ఆకులను నమలడం ద్వారా నోటి దుర్వాసన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కొత్తిమీరలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేసి నోటిలో పెరిగే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

సాల్ట్ వాటర్

గ్లాసు గోరు వెచ్చని నీటిలో చెంచా ఉప్పు కలిపి పుక్కిలించి ఊయాలి. ఉప్పు నీరు నోటి పీహెచ్ విలువను న్యూట్రలైజ్ చేస్తుంది. రోజుకి రెండు సార్లు సాల్ట్ వాటర్ తో పుక్కిలించి ఊయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

Image by Mudassar Iqbal from Pixabay

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.