దేవిశ్రీ ప్రసాద్‌కు కష్టకాలం!

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌కు కష్టకాలం నడుస్తోంది. ఈ ఏడాదిలో దేవీకి మ్యూజికల్ హిట్ ఒక్కటి కూడా లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. వినయ విధేయ రామ, ఎఫ్ 2 సినిమాలతో 2019 జర్నీ ప్రారంభించిన దేవిశ్రీ ప్రసాద్‌.. ఆ తర్వాత చిత్రలహరి, మహర్షి చేశాడు. చిత్రలహరిలో ప్రేమ వెన్నెల సాంగ్ బాగా క్లిక్ అయింది. మిగతా సినిమాల్లో కొన్ని పాటలు ఫర్వాలేదనిపించాయి. కానీ గత ఏడాది వచ్చిన ‘రంగస్థలం’ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యలేకపోయాయి. తాజాగా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు దేవి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటి వరకు నాలుగు సాంగ్స్ రిలీజ్ కాగా.. ఈ పాటలు మహేష్ ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించగలిగాయని అంటున్నాయి సినీ వర్గాలు.

ఇక ఇదే సమయంలో ఎస్‌ఎస్‌ థమన్‌ వరుస హిట్లు ఇవ్వడం కూడా దేవిశ్రీ ప్రసాద్ పై ఒత్తిడి పెంచుతోంది. అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటలు ఒక రేంజ్ లో దుమ్ము దులుపుతున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన సామజవరగమన, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడిన రాములో రాములా పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించాయి. ఇప్పటివరకు సామజవరగమనకు 119 మిలియన్ వ్యూస్, రాములో రాములా కు 108 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తాజాగా విడుదల చేసిన ‘బుట్టబొమ్మ’ సాంగ్ కూడా అదిరింది. థమన్ మ్యూజిక్ ‘అల వైకుంఠపురములో’ సినిమా పై అంచనాలు పెంచేలా చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ పోటీలో మ్యూజిక్ పరంగా థమన్ విన్నర్ అని చెప్పాలి. ఏదీ ఏమైనప్పటికీ.. ఈ మధ్య కాలంలో దేవి పాత మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఈ బ్యాడ్ టైమ్ నుంచి బయటకి వచ్చి దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ గాడిలో పడాలని ఆశించడం తప్ప ఏమీ చెయ్యలేం కదా.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.