గ్రహణం సమయంలో తెరచి ఉంచే ఏకైక దేవాలయం ఎక్కడ ఉందంటే..

హిందూ మత ఆచారవ్యవహారాల ప్రకారం రాహుకేతువులు చెడు గ్రహాలు. వీటి కారణంగానే భూమికి వెలుగు ప్రసాదించే సూర్యచంద్రులకు గ్రహణం పడుతుంది. ఆ సమయంలో రాహుకేతువుల నుంచి వచ్చే విషప్రభావం వల్ల ఈ భూమండలంపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం పడుతుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల ఆహారం విషతుల్యమవుతుందని హిందువులు నమ్ముతారు. అందుకే ఆ సమయంలో ఆహారం తీసుకోరు. పైగా విష ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో ఆహారపదార్థాలపై, ఇంటిపై దర్భగడ్డి ఉంచుతారు. ఈ ప్రతికూల శక్తి ప్రభావం దేవాలయాలపైన కూడా పడుతుందని హిందువులు విశ్వసిస్తారు.

సాధారణంగా గ్రహణం సమయంలో అన్ని దేవాలయాలను మూసి ఉంచుతారు. గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాతే భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరచి ఉంచుతారు. సూర్య గ్రహణమైనా.. చంద్ర గ్రహణమైనా.. ప్రతి ఆలయంలోనూ ఇదే పద్ధతి అనుసరిస్తుంటారు. కానీ ఒకే ఒక్క ఆలయాన్ని మాత్రం గ్రహణం సమయంలో భక్తుల కోసం తెరచి ఉంచుతారు. ఆ ఆలయమే శ్రీకాళహస్తీశ్వరాలయం. గ్రహణం సమయంలో అన్ని ఆలయాలను మూసి వేస్తున్నప్పుడు ఈ ఆలయాన్ని మాత్రం తెరచి ఉంచడానికి ప్రత్యేకమైన కారణం ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా.

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉంది శ్రీకాళహస్తీశ్వర ఆలయం. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా, పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా పరిగణిస్తారు. దేవాలయంలోని అన్ని దీపాలు నిశ్చలంగా వెలుగుతూ ఉంటే.. లింగానికి ఎదురుగా ఉన్న దీపాలు మాత్రం గాలికి రెపరెపలాడుతున్నట్టుగా ఉంటాయి. దీన్ని శివుడి ఉచ్ఛ్వాసనిశ్వాసలకు సంకేతమని భావిస్తారు భక్తులు. వాయులింగ క్షేత్రమనడానికి ఇది ఓ నిదర్శనం. ఈ గుడిపై గ్రహణం ప్రభావం ఉండదు. భూమండలంపై రాహుకేతువుల ప్రభావం పడని ఏకైక ఆలయం శ్రీకాళహస్తీశ్వరాలయమే. దీనికి కారణం శ్రీకాళహస్తీశ్వరుడు అనునిత్యం నవగ్రహాలు, 27 నక్షత్రాలున్న స్వర్ణ కవచాన్ని ధరిస్తాడు. సమస్త సౌర కుటుంబాన్ని ఈ కవచం నియంత్రిస్తుందట. పైగా శివుడు లయకారుడు. సమస్త సృష్టిపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. అందుకే దేవాలయంపై గ్రహణం ప్రభావం పడదు. పుత్రశోకంతో ఉన్న వశిష్ట మహర్షికి శ్రీకాళహస్తీశ్వరుడు నాగలింగేశ్వరుడిగా ప్రత్యక్షమయ్యాడట. అందుకే ఈ క్షేత్రంపై రాహుకేతువుల ప్రభావం ఉండదని భక్తుల విశ్వాసం.

గ్రహణం సమయంలో శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా జాతకంలో రాహు, కేతు దోషాలున్నవారు ఈ సమయంలో జరిగే ప్రత్యేక పూజలు, గ్రహణ కాల అభిషేకాల్లో పాల్గొంటారు అలా చేస్తే వారి దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.