చిటికెలో బ్లాక్ హెడ్స్ తొలగించే చిట్కాలు..

మన చర్మంపై పేరుకున్న మురికి, జిడ్డు, డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నీ కలిసి బ్లాక్ హెడ్స్ రావడానికి కారణమవుతాయి. ముక్కు, చెంపలు, నుదురు, గడ్డంపై ఎక్కువగా ఈ బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి. వీటిని గోటితో పిండేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అలా చేయడం వల్ల అవి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నాయి. కానీ వాటన్నింటి కంటే.. సహజమైన చిట్కాలు పాటించి వాటిని తొలగించుకోవడం మంచిది.

కలబంద

ఆరోగ్యం, అందం సమస్య ఏదైనా సరే.. కలబంద మంచి పరిష్కారం చూపిస్తుంది. కలబందలో ఉన్న జింక్ చర్మాన్ని, చర్మరంధ్రాలను శుభ్రం చేసి టైట్ గా అయ్యేలా చేస్తుంది. ఫలితంగా బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు అర టీస్పూన్ కలబంద గుజ్జును బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. బ్లాక్ హెడ్స్ పూర్తిగా తగ్గేంత వరకు ప్రతి రోజూ రాత్రి ఇదే చిట్కాను పాటించాల్సి ఉంటుంది.

గుడ్డు

గుడ్డులోని తెల్ల సొన బ్లాక్ హెడ్స్ సమర్థంగా తొలగిస్తుంది. ఎగ్ వైట్ లో పేపర్ టవల్ ముంచి దానిని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట ఉంచి బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత దాన్ని తీసేస్తే.. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. వీటితో పాటు డెడ్ సెల్స్ కూడా తొలగిపోతాయి. అప్పుడప్పుడూ చర్మానికి ఎగ్ వైట్ తో ఫేస్ మాస్క్ వేసుకుంటే చర్మానికి అవసరమైన పోషణ అందుతుంది. పైగా చర్మరంధ్రాలు వదులుగా మారకుండా ఉంటాయి. కాబట్టి బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి.

తేనె

చర్మాన్ని సాఫ్ట్ గా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది తేనె. అందుకే సౌందర్య పోషణ విషయంలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మీ స్కిన్ డ్రై స్కిన్ అయితే బ్లాక్ హెడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమస్య నుంచి బయటపడటానికి తేనె ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. తేనెను బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

టమాట

ఆయిలీ స్కిన్ ఉన్నవారు బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి టమాట గుజ్టు ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది చర్మంపై ఉన్న జిడ్డును కూడా తొలగిస్తుంది. దీనికోసం టమాటాను స్లైసులుగా కత్తిరించి వాటితో చర్మాన్ని రబ్ చేసుకోవాలి. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ ఉన్నచోట కాస్త ఎక్కువ సేపు రబ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అలాగే టమాటాను గుజ్జులా చేసి దాన్ని ప్యాక్ లా వేసుకుని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా కూడా బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది.

పసుపు

పసుపు యాంటీబయోటిక్. ఇది చర్మాన్ని క్లెన్స్ చేసి బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. చెంచా పసుపులో నీరు కలిపి చిక్కగా కలుపుకోవాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట రాసి బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. రోజూ ఈ చిట్కాను పాటిస్తే.. బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి.

నిమ్మరసం

చెంచా నిమ్మరసంలో చెంచా తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి 15 – 20 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనిలో ఉన్న విటమిన్ సి బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. అలాగే చర్మరంధ్రాల్లో ఉన్న మురికిని సైతం తొలగిస్తుంది. ఈ చిట్కా పాటించాలనుకుంటే మాత్రం ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. నిమ్మ వల్ల కొందరికి స్కిన్ అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్లాక్ హెడ్స్ పోవడమెలా ఉన్నా.. కొత్త సమస్యలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.

Image: Pexels

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.