కలయిక తర్వాత మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..?

కలయికలో పాల్గొన్న తర్వాత మీ శరీరంలో ఏమైనా మార్పులు గమనించారా? బహుశా ఆ సమయంలో అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉండదు. అలసి సొలసి సేదతీరే సమయంలో బహుశా మీ శరీరంలో వచ్చిన మార్పుల గురించి పట్టించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే సెక్స్ తర్వాత శరీరం పూర్తిగా అలసిపోతుంది. నొప్పి, దురద లాంటివి ఉన్నా.. సెక్స్ తర్వాత అది సాధారణమేలే అని ఆలోచిస్తారు తప్ప.. దాన్ని ఓ సమస్యగా గుర్తించరు. అసలు సెక్స్ తర్వాత శారీరకంగా, మానసికంగా ఎలాంటి మార్పులు రావడానికి అవకాశం ఉంటుందో చూద్దాం.

నొప్పి

సెక్స్ అంటే ఫన్, ప్లెజర్.. కానీ కొన్ని సందర్భాల్లో అది పెయిన్ఫుల్ కూడా. కలయిక సమయంలో అమ్మాయిలకు కలయిక సమయంలో, ఆ తర్వాత గర్భాశయంలో నొప్పిగా అనిపించవచ్చు. ఇలా నొప్పి రావడం అందరిలోనూ సాధారణమే. ఆ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ ఈ నొప్పికి కారణం. కానీ కొంతమందిలో ఈ నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ లేదా ఇతర సమస్యలేమైనా అయి ఉండొచ్చు.

మంట

సెక్స్ లో పాల్గొన్న తర్వాత మూత్రానికి వెళ్లినప్పుడు కొన్నిసార్లు మంటగా అనిపిస్తుంది. దీనికి కారణం కలయిక సమయంలో లూబ్రికేషన్ సరిగ్గా లేకపోవడమే. సాధారణంగా అయితే ఈ మంట కొంత సమయం తర్వాత తగ్గిపోతుంది. అలా కాకుండా.. దీర్ఘకాలం పాటు మంట కొనసాగితే.. ఏదో సమస్య ఉన్నట్టే లెక్క. డీహైడ్రేషన్, యూరిన్ ఇన్ఫెక్షన్ దీనికి కారణమై ఉండొచ్చు. గైనకాలజిస్ట్ ను సంప్రదించి చికిత్స తీసుకోవడంతో పాటు.. తగినంత నీరు తాగడం కూడా అవసరం.

Advertisements

దురద

సాధారణంగా మీరు ఉపయోగించే కండోమ్ లేదా లూబ్రికెంట్ వల్ల కలయిక తర్వాత దురద పెట్టవచ్చు. వాటి తయారీలో ఉపయోగించిన పదార్థాలు మీకు ఎలర్జీ కలిగించేవైతే ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి లూబ్రికెంట్ లేదా కండోమ్ కొనుగోలు చేసేటప్పుడు ఇంగ్రీడియెంట్స్ లో మీకు అలర్జీలు కలిగించేవి ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలి. అలర్జీ కలిగించేవి ఉంటే వాటిని ఉపయోగించకపోవడమే మంచిది.

శరీరంపై ఎర్రటి మచ్చలు

కలయిక తర్వాత మీ ముఖంపై లేదా శరీరం అంతా ఎర్రటి రంగులో లేదా పింక్ కలర్లో మచ్చలు కనిపిస్తున్నాయా? దీనికి కారణం మీ చర్మానికి రక్తప్రసరణ అధికంగా జరగడమే. సాధారణంగా ఈ మచ్చలు కొన్ని నిమిషాల తర్వాత మాయమైపోతాయి. కానీ కొందరిలో మాత్రం చాలా ఎక్కువ సమయమే ఉంటాయి.

Advertisements

ఉన్నట్టుండి నిద్ర పోవడం

శృంగారం తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారే నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంటుంది. దీనికి కారణం అలసట. ముఖ్యంగా అబ్బాయిలు కలయిక తర్వాత చాలా త్వరగా నిద్రపోతారు. ఆ సమయంలో విడుదలయ్యే న్యూరోకెమికల్స్ తో పాటు.. కాస్త శారీరకంగా అలసిపోవడం కూడా వెంటనే నిద్రపట్టడానికి కారణమవుతుంది.

భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది

శృంగారం తర్వాత భాగస్వాములిద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ మరింతగా పెరుగుతుంది. దీనికి లవ్ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్. ఇది ప్రేమతో పాటు నమ్మకాన్ని కూడా కలిగిస్తుందట.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.