దర్బార్ సినిమా రివ్యూ

తన స్టైల్, గ్రేస్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిపోతుంది. అయితే రోబో సినిమా తర్వాత రజనీకి మంచి హిట్ పడలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ అంచనాలన్నీ దర్బార్ సినిమాపైనే ఉన్నాయి. పైగా రజినీకాంత్, మురగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి దర్బార్ రజనీ ఫ్యాన్స్ ఆశలను నెరవేర్చిందా? హిట్ టాక్ అందుకుందా లేదా ముందు సినిమాల మాదిరిగానే ఫ్లాపయిందా? చూద్దాం.

కథేంటంటే…

ఆదిత్య అరుణాచలం(రజనీకాంత్).. సిన్సియర్ పోలీసాఫీసర్. డ్యూటీ చేసే విషయంలో న్యాయానికే తప్ప రూల్స్ కి రెగ్యులేషన్స్ కి పెద్దగా ప్రాధాన్యమివ్వని వ్యక్తి ఆదిత్య అరుణాచలం. విధినిర్వహణలో అతని ప్రవర్తన గురించి ప్రశ్నించిన మానవ హక్కుల కమిషన్ సభ్యులనే తన ప్రవర్తనతో బెదరగొట్టేస్తాడు. ఇలాంటి వ్యక్తిని ముంబయికి డిప్యుటేషన్ పై పంపిస్తారు. అక్కడ డ్రగ్స్ మాఫియాను అంతమొందించే ప్రయత్నం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ మాపియా లీడరైన అజయ్ మల్హోత్రా(ప్రతీక్ బబ్బర్)కు చెక్ పెడతాడు అరుణాచలం. ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. అరుణాచలంపై పగతో రగిలిపోతూ.. 27 ఏళ్ల తర్వాత ఇండియాకు వస్తాడు హరిచోప్రా(సునీల్ షెట్టి). వచ్చీ రాగానే అరుణాచలాన్ని, అతని కూతురు వల్లీని(నివేథా థామస్) టార్గెట్ చేస్తాడు. హరి చోప్రాకి అరుణాచలానికి ఉన్న పాత శత్రుత్వం ఏంటి? వీరిద్దరి మధ్య గొడవ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అనేది తెరపైనే చూడాలి.

విశ్లేషణ

రజినీ కాంత్ సినిమా అంటేనే సినిమా ప్రేక్షకులంతా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తారు. సూపర్ స్టార్ కి, ఏ ఆర్ మురగదాస్ లాంటి టాప్ డైరెక్టర్ తోడైతే.. ఓ సెన్సేషనల్ సినిమా వస్తుందని అంచనా వేసుకుంటారు. కానీ ఆ అంచనాలకు దూరంగా దర్బార్ సినిమా ఓ రొటీన్ కమర్షియల్ సినిమాగా మిగిలిపోయింది. ఓ సిన్సియర్ పోలీసాఫీసర్, అతనికో కూతురు, డ్రగ్స్ మాఫియా, కరుడు గట్టిన విలన్.. మధ్యలో ఓ ప్రేమ కథ. చాలా రొటీన్ కథే. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు మురగదాస్. కథ ఏమీ లేకున్నా రజనీ చరిష్మాతో సినిమాను ముందుకు నడిపించేశాడు. ఓపెనింగ్ సీన్ లోనే రజనీకాంత్ ను సిన్సియర్, రూత్లెస్ కాప్ లా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఆదిత్య అరుణాచలం, అతని కూతురు వల్లీ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాకు ఆయువుపట్టు లాంటిది. తండ్రీకూతుర్ల మధ్య ఉన్నఅనుబంధమే ఈ సినిమాను చివరి వరకు నడిపిస్తుంది. హీరో విలన్ మధ్య ఫైట్లు కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.

నయన తార, రజనీ మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా బాగానే ఉంటాయి. నయనతారను గ్లామర్ కి పరిమితం చేయకుండా.. కథలో కీలకమైన వ్యక్తిగా ఆమె పాత్రను డిజైన్ చేశాడు మురగదాస్. నయన్ తో కలిసి నటించే సన్నివేశాల్లో రజనీ కూడా చాలా యంగ్ గా, అందంగా కనిపిస్తాడు. బహుశా మేకప్ మహిమ అనుకుంటా. ఆ సీన్లు చూస్తున్నప్పుడు రజనీకి మేకప్ వేసిన వ్యక్తికి చప్పట్లు కొట్టకుండా ఉండలేం. కథలో ముఖ్యమైన విలన్ హరిచోప్రా (సునీల్ శెట్టి). జాలి లేని వ్యక్తిగా, పవర్ఫుల్ విలన్ గా ఈ క్యారెక్టర్ ను రూపొందించడంలో మురగదాస్ సక్సెస్ అయ్యాడు. కానీ తెరపై ఎక్కువ సమయం ఈ పాత్ర కనిపించదు. ఆ లోటు బాగా తెలుస్తుంది.

నటీనటులు

ఈ సినిమాలో ఎంతమంది నటీనటులున్నా ప్రధాన ఆకర్షణ మాత్రం సూపర్ స్టార్ రజనీకాంతే. పేట, కాలా సినిమాల్లో రజినీ లుక్ అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలో రజనీ తన స్టైల్, లుక్, ఎనర్జీతో అభిమానులను ఓ ఊపు ఊపేశాడు. డ్యాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకుంటాడు. ఆ సమయంలో రజనీ వయసు నిజంగా డెబ్భై ఏళ్లేనా అని అనుమానం వస్తుందంటే అతిశయోక్తి కాదేమో. తెరపై కొత్త రజనీకాంత్ ను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. రజనీ కాంత్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది నివేథా థామస్ గురించే. ఆమె నటన గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోనూ ఆదిత్య అరుణాచలం కూతురు వల్లీగా గొప్ప నటనను కనబరిచింది. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాల్లో సెంటిమెంట్ ను బాగా పండించింది. నయన తార కూడా కీలకమైన పాత్రలో మెప్పిస్తుంది. సునీల్ శెట్టి విలనిజం ఆకట్టుకుంటుంది. కానీ మరికొంత స్క్రీన్ ప్రజెన్స్ ఉంటే.. బాగుండేది.

సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి చెప్పుకోవాలి. అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సీన్లకు తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కానీ పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింద సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ గురించే. అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్ తో తెరపై మ్యాజిక్ క్రియేట్ చేశాడు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. తెరపై సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఈ విషయంలో లైకా సంస్థను మెచ్చుకోవాల్సిందే.

సాధారణంగా దర్శకుడు మురుగదాస్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని తన సినిమాలో చూపిస్తాడు. కానీ తన పంథాకు భిన్నంగా రొటీన్ కమర్షియల్ కథను ఈ సినిమాకు ఎంచుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. నాయకుడు, ప్రతినాయకుడి మధ్య సన్నివేశాలను, వారిద్దరి మధ్య పోరును డిఫరెంట్ గా తెరకెక్కించాడు. కానీ రజనీ రేంజ్ హిట్ అందించలేకపోయాడు.

రేటింగ్: 2.5/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.