‘ సరిలేరు నీకెవ్వరు ’ మూవీ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి పక్కా మాస్ చిత్రం వచ్చి చాలా ఏళ్లే అవుతోంది. ఈ మధ్య కాలంలో సందేశాత్మక చిత్రాలు తీస్తూ ఆకట్టుకున్నాడు. కానీ పక్కా మాస్ హీరోగా చూడాలనే అభిమానుల కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు వారి కోరికను తీరుస్తూ చేసిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. సుదీర్ఘకాలం గ్యాప్ తర్వాత విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా చేరుకుందా..? మహేష్ ను మాస్ హీరోగా చూడాలనుకుంటున్నఅభిమానుల కోరిక ఈ సినిమాతో నెరవేరిందా?

కథేంటంటే..

అజయ్ కృష్ణ (మహేష్ బాబు) ధైర్య సాహసాలు కలిగిన ఆర్మీ మేజర్. నా అన్నవారు లేని అనాథ. దేశమే నా కుటుంబమని భావిస్తుంటాడు. ఉగ్రవాదులపై జరిపిన ఓ ఆపరేషన్లో అతనికి ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో కర్నూలుకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ప్రొఫెసర్ భారతి(విజయశాంతి), ఆమె కుటుంబానికి మంత్రి నాగేంద్ర (ప్రకాష్ రాజ్) వల్ల ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది. ఈ పరిస్థితుల్లో భారతికి అండగా నిలుస్తాడు అజయ్. అసలు అజయ్ కర్నూలు ఎందుకు వెళ్లాడు? అక్కడ భారతికి, నాగేంద్రకు మధ్య ఉన్న గొడవేంటి? భారతికి, అజయ్ కు ఉన్న సంబంధం ఏంటి? నాగేంద్ర నుంచి భారతిని అజయ్ ఎలా రక్షించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. థియేటర్లో సినిమాను చూడాల్సిందే.

Advertisements

సినిమా ఎలా ఉందంటే..

కమర్షియల్ కథలకు మసాలా అద్ది.. అటూ ఇటూ మార్చి మార్చి వండి వారుస్తూ హిట్లు కొట్టేస్తుంటారు కొందరు దర్శకులు. చూస్తున్నంత సేపు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ తరహా సినిమాల్లో కథ ఉన్నా లేకపోయినా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు మాత్రం గట్టిగానే రాబడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఫార్ములాతోనే.. సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయినా సినిమా అంతా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఓ పక్క రొటీన్ కథ అనిపిస్తూనే.. మరో పక్క ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలానే ఉంటుంది. మహేష్ ని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో.. అలా చూపిస్తూ.. పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిచండలో సక్సెసయ్యాడు అనిల్ రావిపూడి.
ఆరంభంలోనే సరిలేరు నీకెవ్వరు పక్కా కమర్షియల్ సినిమా అని అర్థమైపోతుంది. ఆర్మీ క్యాంప్ లో తమన్నాతో స్టెప్పులేస్తూ పార్టీ చేసుకోవడం చాలామందికి రుచించకపోవచ్చు. ఆర్మీ మేజర్ గా మహేష్ చాలా తక్కువ సమయమే కనిపిస్తాడు మహేష్. కానీ రెస్క్యూ ఆపరేషన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సైన్యం నుంచి బయటకు రావడానికి కూడా ఓ మొక్కుబడి కారణాన్ని చూపిస్తారు. చిత్ర యూనిట్ అంతా చెప్పినంత స్థాయిలో ట్రైన్ ఎపిసోడ్ నవ్వులు పంచలేకపోయింది. ట్రైన్లో హీరోయిన్, ఆమె కుటుంబసభ్యులు చేసే అతి ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష పెడుతుంది. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర వచ్చే సన్నివేశాలు అభిమానులకు కనువిందు చేస్తాయి. మహేష్ ఎనర్జీ, డైలాగులు ఉర్రూతలూగిస్తాయి. ఇలా ఫస్టాఫ్ అంతా దద్దరిల్లిపోతుంది. ఫస్టాఫ్ అంతా ఉత్సాహంగా సాగిన సినిమా సెకండాఫ్ వచ్చేసరికి తుస్సుమనిపోతుంది. విలన్ పాత్ర మరీ బలహీనంగా ఉంటుంది. అసలు విలన్ నుంచి హీరోకి అసలు ఎదురయ్యే సవాళ్లేమీ ఉండవు. దీంతో సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ మిస్సవుతుంది. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీ ఇస్తుందంటే.. చాలా పవర్ఫుల్ పాత్ర చేస్తుందని ఎదురు చూశారు ప్రేక్షకులంతా. కానీ భారతి పాత్ర ప్రేక్షకుడు ఊహించిన స్థాయిలో లేదు. ద్వితీయార్థంలో విజయశాంతి-మహేశ్ కాంబినేషన్ సీన్లు సినిమాను కాస్త ముందుకు నడిపిస్తాయి. ఇవి లేకపోతే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తేలిపోయి ఉండేదే. క్లైమాక్స్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ద్వితీయార్థం అంతా సాగతీతగా ఉన్నప్పటికీ.. మహేష్ అభిమానులు.. మాస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశాలు ‘సరిలేరు నీకెవ్వరు’లో ఉన్నాయి.

Advertisements

నటీనటులు

అజయ్ పాత్రలో మహేష్ అభిమానులకు మాత్రమే కాదు.. మిగతా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతాడు. చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. ఈ సినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ థియేటర్లో ఈలలు వేసేలా చేస్తుంది. ‘మైండ్ బ్లాంక్’ పాటలో మహేష్ స్టెప్పులు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి. మహేష్ ఇంత బాగా డ్యాన్స్ చేస్తాడా అని ఆశ్చర్యపోవడం గ్యారెంటీ. ఫైట్లు కూడా చాలా బాగా చేశాడు. హీరోయిన్ రష్మిక మందన్నా పాత్ర చాలా సిల్లీగా అనిపిస్తుంది. మహేష్ అందం పక్కన రష్మిక తేలిపోయింది. విజయశాంతి రేంజ్ కి తగ్గ పాత్ర దొరకలేదు కానీ.. ఆమె నటనకు సాటి లేదనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్మీ గొప్పదనాన్ని చెప్పే సన్నివేశంలో ఆమె ఆకట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్, రమేష్, రాజేంద్ర ప్రసాద్, సత్యదేవ్, మురళీ శర్మ వీళ్లంతా గొప్ప నటులు. కానీ వారికి తగ్గ పాత్రలు ఈ సినిమాలో దొరకలేదు. జయప్రకాష్ రెడ్డి.. అజయ్.. సంగీత పర్వాలేదు. వారికి ఈ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు.

సాంకేతికవర్గం

దేవిశ్రీ ప్రసాద్ పాటలు జనాన్ని అంతగా ఆకట్టుకోలేదు. కానీ తెరపై బాగానే కనిపిస్తాయి. ‘సరిలేరు నీకెవ్వరు..’ అంటూ సాగే పాట ప్రేక్షకుడి మనసును టచ్ చేస్తుంది. ఈ సినిమాలో బెస్ట్ సాంగ్ ఇదే. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగా లేదు. జస్ట్ ఓకే అనిపించేలా మాత్రమే ఉంది. రత్నవేలు ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెరపై సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకుడిగా తన ప్రత్యేకతను ఏమీ చాటుకోలేదు కానీ.. అభిమానులకు నచ్చేలా మహేష్ ను చూపించాడు. ప్రథమార్థం ఓకే అనిపించినా.. ద్వితీయార్ధంలో మాత్రం బాగా తడబడ్డాడు. మహేష్ తన చరిష్మా, నటనతో సినిమాను నిలబెట్టాడు కానీ.. లేకుంటే ‘సరిలేరు నీకెవ్వరు’ తేలిపోయేదే.

రేటింగ్-2.75/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.