ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ

తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలమే అయినప్పటికీ సక్సెస్ సాధించి హీరోగా నిలదొక్కుకోవడంలో కాస్త వెనకబడ్డాడు నందమూరి కళ్యాణ్ రామ్. అయితే గత ఏడాది విడుదలైన ‘118’ సినిమాతో సక్సెస్ సాధించి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. సతీశ్ వేగేశ్న దర్వకత్వం వహించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి సంక్రాంతి బరిలో పెద్ద చిత్రాలను ఈ సినిమా ఢీ కొట్టి నిలిచిందా? టైటిల్లో ఉన్న మంచితనం సినిమాలో కనిపించిందా? చూద్దాం.

కథ విషయానికి వస్తే..

బాలు(నందమూరి కళ్యాణ్ రామ్).. చాలా మంచివాడు. చిన్నప్పటి నుంచి అనాథలా, నా అనేవాళ్లు లేకుండా పెరిగాడు. అందుకేనేమో.. తనలాంటి అనాథలకు అండగా నిలబడుతూ ఉంటాడు. అందరికీ సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ‘ఆల్ ఈజ్ వెల్’ అనే ఓ కంపెనీని ప్రారంభిస్తాడు. ఈ సంస్థ ద్వారా జనానికి కావాల్సిన ఎమోషన్లను సప్లై చేస్తూ ఉంటాడన్నమాట. అసలు ఎమోషన్లను సప్లై చేయడమేంటి? ఎమోషన్లతో కూడా వ్యాపారం చేయవచ్చా? ఈ వ్యాపారంలో బాలుకి ఎదురైన సవాళ్లేంటి? అనేదే మిగతా కథ.

సినిమా విశ్లేషణ

హీరో చాలా మంచివాడవడం వల్ల, అతనికి అనుబంధాల విలువ తెలియడం వల్ల ఎమోషన్లను సప్లై చేసే కంపెనీ మొదలుపెడతాడు. అసలు వేరే వాళ్లకి ఎమోషన్లు సప్లై చేస్తే.. వాటిలో నిజాయతీ ఉంటుందా? అది నిజమైన అనుబంధాన్ని మరిపిస్తుందా? ఉండదు కదా.. ఫేక్ గా ఉందే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎమోషన్లు కూడా అలాగే ఉన్నాయి. సాధారణంగా అమ్మానాన్నలు తమ పిల్లలు తమ దగ్గరకు వచ్చి కాసేపు గడిపితే బాగుండనుకుంటారు. కానీ ఏదో కంపెనీకి ఫోన్ చేసి మాతో సమయం గడపమని అడగరు కదా. ఓ గంటో రెండు గంటలో అద్దెకు తెచ్చుకున్న కొడుకుపై వారికి ప్రేమ కలుగుతుందా? వారు వచ్చి ఆప్యాయత నటిస్తే సంతోషంగా అనిపిస్తుందా? అదంతా కృత్రిమంగా అనిపిస్తుంది కదా. అందుకేనేమో ఈ సినిమా ఎక్కడా ప్రేక్షకుడి మనసుని టచ్ చేయదు. మనసు దాకా అక్కర్లేదు ఎక్కడా కనెక్టవదు.

మంచి పనులు చేయాలని సినిమాతో చెబితే మంచిదే. కానీ అది అంతర్లీనంగా ఉంటే బాగుంటుంది. కానీ దానికోసం హీరోకి అంతి మంచితనాన్ని అంటగట్టాల్సిన అవసరం లేదు. పోనీ కథలో సహజత్వం ఉండి వాస్తవానికి దగ్గరగా ఉంటే.. ప్రేక్షకులకు ఎంతో కొంత చేరువ అవుతుంది. కానీ ఆ కథ అసహజంగా ఉంటే.. ఇదేం సినిమారా బాబూ అనిపిస్తుంది. ఎంత మంచివాడవురా సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం సినిమానే చూస్తున్నామా? పొరపాటున థియేటర్లో సీరియల్ వేశారా? అనేంత సాగతీతగా సినిమా ఉంటుంది.

నటీనటులు

కళ్యాణ్ రామ్ తన కెరీర్లో ఇలాంటి పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. బాలుగా చాలా మంచి నటనే కనబరిచాడు. చిక్కంతా ఈ మంచివాడి పాత్రతో జనం ఏ రకంగానూ కనెక్ట్ కాలేకపోవడంతోనే వచ్చింది. మెహ్రీన్ పాత్ర చాలా బోర్ కొట్టిస్తుంది. అతి మంచివాడైన హీరో మీద అతి ప్రేమ చూపించే క్యారెక్టర్ ఆమెది. తనికెళ్ల భరణి, సుహాసిని, పవిత్రా లోకేష్, శరత్ బాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ కాస్త నవ్వులు పంచారు. ఈ సినిమాలో ఇది కాస్త ఉపశమనం.

సాంకేతిక వర్గం

సినిమాలో ఒకటీ అరా పాటలు మినహా మిగిలినవి అంత గొప్పగా ఏమీ లేవు. గోపీ సుందర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగానే నీరసంగా ఉంటుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. రాజ్ తోట కెమెరా పనితనం బాగుంది. సతీశ్ వేగేశ్న నుంచి శతమానంభవతి లాంటి ఓ మంచి కథను ఎక్స్పెక్ట్ చేస్తే ఓ అసహజమైన కథతో ప్రేక్షకులను ఉస్సూరుమనిపించాడు.

రేటింగ్: 2.5/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.