గర్భం దాల్చిన వారిలో తలనొప్పి..? కారణాలు, నివారణా మార్గాలు

గర్భం దాల్చిన సమయంలో మహిళ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి కారణం ఆ సమయంలో ఆమె శరీరంలో వచ్చే మార్పులు, హార్మోన్ల విడుదలలో వచ్చే తేడాలే. గర్భం దాల్చిన తొమ్మిది నెలల కాలంలో నడుము నొప్పి, కాళ్లు లాగడం, లాంటి సాధారణ సమస్యలు కనిపిస్తాయి. కానీ కొంతమందిలో మాత్రం.. మైగ్రెయిన్(పార్శ్వపు నొప్పి) లాంటి తీవ్రమైన సమస్యలు ఎదురుకావచ్చు. తీవ్రంగా వచ్చే ఆ నొప్పిని భరించడం చాలా కష్టం. కొంతమందిలో ఈ సమస్య కొంత సమయం తర్వాత తగ్గిపోతుంది.. మరి కొందరికి మాత్రం సమస్య రోజురోజుకీ తీవ్రమైపోతుంది. అసలు ఈ మైగ్రెయిన్ రావడానికి కారణం ఏంటో తెలుసుకుంటే మైగ్రెయిన్ రాకుండా చూసుకోవచ్చు.

మైగ్రెయిన్ రావడానికి కారణాలు

పార్శ్వపు నొప్పి రావడానికి ఒక్కొక్కరిలోనూ ఒక్కో కారణం ఉంటుంది. కాబట్టి ఆ సమస్య దేనివల్ల వస్తుందో గుర్తిస్తే.. దాన్నుంచి ఉపశమనం పొందడానికి మార్గం తెలుసుకోవచ్చు.

బీపీ పెరగడం

గర్భిణిల్లో మైగ్రెయిన్ సమస్య రావడానికి ముఖ్యమైన కారణం బీపీ పెరిగిపోవడం. బీపీ అకస్మాత్తుగా పెరిగిపోవడం వల్ల మెదడుకి రక్త సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల తలనొప్పి చాలా ఎక్కువగా వస్తుంది. బీపీ పెరగడం, తలనొప్పి రావడం గర్భిణిల్లో గుర్రపువాతానికి(ప్రీఎక్లాంప్సియా) దారి తీయవచ్చు. కాబట్టి బీపీ పెరిగితే.. వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

కండరాల వ్యాకోచం

కండరాల వ్యాకోచం గర్భిణిల్లో సాధారణంగా కనిపించేదే. ముఖ్యంగా గర్భంలో ఎదుగుతున్న బిడ్డకు అనుగుణంగా పొట్ట కండరాలు వ్యాకోచిస్తాయి. దీని కారణంగా కండరాలపై ఒత్తిడి పెరిగి మైగ్రెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది.

హార్మోన్ల అసమతౌల్యత

మన శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ మైగ్రెయిన్ రావడానికి కారణమవుతుంది. అందుకే గర్భం దాల్చిన మహిళల్లో తరచూ మైగ్రెయిన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. సెరొటోనిన్ అనే మరో హార్మోన్ స్థాయిలో హెచ్చుతగ్గులున్నప్పుడు సైతం గర్భిణిల్లో మైగ్రెయిన్ రావడానికి అవకాశాలున్నాయి.

ఇతర కారణాలు

వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, కాఫీ ఎక్కువ తాగడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి పడకపోవడం, చలి వాతావరణం, కాలుష్యం ఇవన్నీ గర్భిణుల్లో మైగ్రెయిన్ రావడానికి కారణమవుతాయి.

గర్భిణిల్లో పార్శ్వపు నొప్పి రావడానికి ఒక్కొక్కరిలో ఒక్కో కారణం ఉంటుంది. కాబట్టి ఈ కారణం వల్ల తలనొప్పి వచ్చిందని అంచనా వేయడం కాస్త కష్టమైన పనే. కాబట్టి మైగ్రెయిన్ సమస్య ఆరంభమైనప్పుడే వైద్యులను సంప్రదించడం మంచిది. వారు సమస్య కారణాన్ని గుర్తించి తగిన చికిత్స చేస్తారు. వైద్యులు సూచించిన చికిత్సతో పాటు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మైగ్రెయిన్ నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

గర్భిణుల్లో మైగ్రెయిన్ తగ్గించే చిట్కాలు

గర్భం దాల్చిన వారికి ఎదురయ్యే మైగ్రెయిన్ ను కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. కాబట్టి మైగ్రెయిన్ తగ్గడానికి వైద్యులు సూచించిన మందులు వాడుతూనే ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.

తడి టవల్

ఒత్తిడి గురైన నరాలను రిలాక్సయ్యేలా చేయడం ద్వారా పార్శ్వపు నొప్పి నుంచి ఉపమనం పొందవచ్చు. దీనికోసం చల్లటి నీటిలో టవల్ ముచుంచి దాన్ని తలపై పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల తలనోప్పి నుంచి ఉపశమనం లబిస్తుంది. చల్లటి నీటికి బదులుగా వేడి నీటిో ముంచిన టవల్ సైత నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వాడవచ్చు.

వ్యాయామం

ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది నేచురల్ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. కాబట్టి మైగ్రెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే.. గర్భిణులు ఎక్సర్సైజుల విషయంలో వైద్యుల సలహా ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.

నిద్ర

మైగ్రెయిన్ తరహా తలనొప్పులు తగ్గడానికి నిద్ర ఓ మంచి మార్గం. తగినంత సమయం నిద్రపోవడం ద్వారా పార్శ్వపు నొప్పి రావడానికి కారణమైన ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. నొప్పి ఎక్కువగా ఉండి నిద్ర పట్టకపోతే.. కాసేపు ధ్యానం చేయండి. చక్కగా నిద్ర పడుతుంది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.