అజీర్తితో ఇబ్బంది పడుతున్నారా?

అజీర్తి సమస్యతో ఇబ్బందిపడేవారు.. ఆహారం తినాలని ఉన్నా కానీ.. ఎక్కడ అరగదేమో అని భయపడిపోతుంటారు. వారి భయానికి తగ్గట్టుగా ఏది తిన్నా సరే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, మరికొన్నింటిని డైట్లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి అజీర్తితో ఇబ్బంది పడేవారు తినాల్సిన, తినకూడని ఆహార పదార్థాలేంటో తెలుసుకుందామా..

తినాల్సిన ఆహారం

పెరుగు

పెరుగు మంచి ప్రోబయాటిక్. ఇది జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి అయ్యేలా చేస్తుంది. అందుకే వైద్యులు సైతం జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారికి పెరుగు తినమని చెబుతారు. రోజూ కప్పు పెరుగు చొప్పున తింటూ ఉంటే.. రెండు మూడు వారాలు గడిచేసరికి మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఓట్స్

ఓట్స్ లో పీచు పదార్థం, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఓట్ మీల్ కూడా ప్రోబయటిక్ లా పనిచేస్తుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. అలాగే దీనిలో ఉన్న పీచు పదార్థం ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. పనిలో పనిగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

ఆపిల్

ఆపిల్లో పీచు పదార్థంతో పాటు పెక్టిన్ కూడా ఉంటుంది. పీచు పదార్థం ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. పెక్టిన్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను వృద్ధి చెందేలా చేస్తుంది. పేగుల్లోని ఇన్ఫెక్షన్లు, మంట వంటి సమస్యలను తగ్గిస్తుంది. డయేరియా, మలబద్ధకం సమస్యలతో ఇబ్బందిపడేవారు ఆపిల్ తింటే ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

అవిశె గింజలు

అవిశె గింజల్లో సైతం పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఈ గింజలను మనం తిన్నప్పుడు అది జిగురు పదార్థంగా మారి పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.

బొప్పాయి

బొప్పాయలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డైజెస్టివ్ ఎంజైమ్. ముఖ్యంగా ప్రొటీన్లను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అజీర్తితో పాటు కడుపుబ్బరం కూడా బొప్పాయి తగ్గిస్తుంది.

తినకూడని ఆహారం

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులు డయేరియా, పొట్ట పట్టినట్టుగా అనిపించడం, ఎసిడిటీ లాంటి సమస్యలకు కారణమవుతాయి. పాలు, పాల పదార్థాలు తిన్నప్పుడు ఇలాంటి సమస్య మీకు ఎదురైతే.. పాలల్లో ఉన్న చక్కెరలను జీర్ణం చేసే ఎంజైమ్ మీ శరీరంలో లేనట్టే. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

ఫ్రైడ్ ఫుడ్

ఫ్రైడ్ ఫుడ్ లో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. పైగా ఫ్రైడ్ ఫుడ్ అంతా వివిధ రకాల సాస్ లు, బటర్ లాంటి రకరకాల పదార్థాలతో నింపేస్తారు. ఇవి కొందరిలో డయేరియా వచ్చేలా చేస్తే.. మరికొందరిలో మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ఫ్రైడ్ ఫుడ్ కి బదులుగా.. రోస్ట్ లేదా బేక్ చేసిన ఆహారం తినొచ్చు. అలాగే బటర్, క్రీమ్ లాంటివి కాకుండా.. వెజిటబుల్ సాస్ ఉపయోగించవచ్చు.

ఆర్టిఫిషియల్ స్వీటనర్

ఇటీవలి కాలంలో నేచురల్ షుగర్ కి బదులుగా కృత్రిమ చక్కెరల వాడకం పెరిగింది. ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో వీటిని ఉపయోగిస్తున్నారు. కానీ వీటి వాడకం ఎక్కువ అవడం వల్ల అది అజీర్తికి దారి తీస్తోంది. రోజుకి 50 గ్రాముల కంటే ఎక్కువ ఆర్టిపిషియల్ స్వీటనర్ ఉపయోగించే వారిలో జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి.

వీటితో పాటు కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, క్యాబేజీ, బ్రొకోలీ, ఫ్యాట్ ఫుడ్స్ మొదలైనవాటిని అజీర్తితో ఇబ్బంది పడేవారు తినడం వల్ల అవి సరిగ్గా జీర్ణం కావు. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.