ఎండలు ముదురుతున్నాయిగా.. సన్ స్క్రీన్ వాడుతున్నారా?

ఇంకా జనవరి కూడా పూర్తవలేదు.. అప్పుడే భానుడు మెల్లగా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. ఆయన బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిందే. అప్పుడే కదా యూవీ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది. మరి ఎలాంటి సన్ స్క్రీన్ వాడితే మీ చర్మం అందంగా, కాంతివంతంగా ఉంటుంది? అసలు దాన్నెందుకు వాడాలి? సన్ స్క్రీన్ వాడటం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా? ఈ విషయాలన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సన్ స్క్రీన్ రాయడం వల్ల ఉపయోగమేంటి?

  1. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కాబట్టి యంగ్ గా కనిపిస్తారు.
  2. వేసవిలో అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య ట్యానింగ్. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మంపై ట్యాన్ ఏర్పడదు.
  3. సన్ స్క్రీన్ లోషన్లో కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి చర్మానికి అవసరమైన ముఖ్యమైన పదార్థాలుంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి.
  4. సన్ స్క్రీన్ లోషన్ యూవీ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చూస్తుంది. కాబట్టి చర్మ కాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

సన్ స్క్రీన్ లోషన్ ఎలా రాసుకోవాలి?

ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కనీసం అరగంట ముందు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాయాలి. ముఖ్యంగా ఎండ ప్రభావానికి గురయ్యే భాగాలైన ముఖం, మెడ చేతులకు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ముఖమంతా చిన్న చిన్న చుక్కలుగా పెట్టుకొని ఆ తర్వాత సమానంగా పరుచుకొనేలా రాసుకోవాలి. మీది పొడిచర్మం అయితే సన్ స్క్రీన్ లోషన్ రాసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. బయటకు వెళ్లినప్పుడు చెమట ఎక్కువ పట్టినా లేదా స్విమ్మింగ్ చేసినా రెండు గంటలకోసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది.

సన్ స్క్రీన్ ఎలా ఎంచుకోవాలి?

సన్ స్క్రీన్ ఎంచుకొనేటప్పుడు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఆరుబయట గడిపే సమయం, చర్మతత్వం, వయసు, లైఫ్ స్టైల్ ఆధారంగా సన్ స్క్రీన్ లోషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎస్పీఎఫ్ విలువ 30 కంటే ఎక్కువ ఉన్న లోషన్ ఎంచుకోవడం మంచిది. ఈ విషయంలో మీకు స్పష్టత రానట్లైతే స్కిన్ స్పెషలిస్ట్ ను సంప్రదించండి వారు మీకు నప్పే దాన్ని సూచిస్తారు.

సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:

సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం వల్ల చర్మానికి ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడానికీ అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా తెలుసుకుంటే.. ముందుగానే జాగ్రత్తపడొచ్చు.

1. సన్ స్క్రీన్ లోషన్ తయారీలో ఉపయోగించే కొన్ని రకాల రసాయనాల కారణంగా స్కిన్ అలర్జీలు రావచ్చు. ముఖ్యంగా దీనిలో ఉన్న బెంజోఫినోన్స్ అనే రసాయనం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ అధికంగా విడుదలవుతుంది. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

2. మొటిమల సమస్య ఉన్నవారు సన్ స్క్రీన్ వాడితే మొటిమలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

3. సన్ స్క్రీన్ లోషన్ తయారీలో ఆక్సీబెంజోన్ ఉపయోగిస్తారు. ఇది సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చూస్తుంది. అయితే దీని వల్ల చర్మకణాలు పాడవుతాయి.

సన్ స్క్రీన్ రాసుకొన్నప్పుడు మీ చర్మంపై ఎర్రటి పొక్కులు రావడం లేదా చర్మం పింక్ రంగులోకి మారిపోవడం గమనిస్తే వెంటనే శుభ్రం చేసుకోవాలి. చర్మంపై మరీ ఎక్కువ ర్యాషెస్ వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. అలాగే వారి సూచనల మేరకే సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం మంచిది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.