ఎవర్ గ్రీన్ ఫుడ్ కాంబినేషన్స్.. తింటే వదలరు తెలుసా?

ఎవరు ఎంత కష్టపడినా.. ఎన్ని కోట్లు సంపాదించినా.. అది తినే గుప్పెడు మెతుకుల కోసమే. అందుకే ఆహారం విషయం వచ్చేసరికి ఎక్కడా రాజీ పడరు. అసలు కొన్ని రకాల ఫుడ్స్ కోసం ఎక్కడికైనా, ఎంత ఖర్చు పెట్టైనా సరే వెళ్లి మరీ తిని వస్తుంటారు. బయటి ఆహారం సంగతి పక్కన పెడితే.. ఇంట్లో మనం రెగ్యులర్ గా తినే ఆహారంలో కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ మాత్రం అద్భుతమనిపిస్తాయి. రోజూ అదొక్కటి ఉంటే సరిపోతుందనిపించేంత రుచిగా ఉంటాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం.

ముద్దపప్పు – ఆవకాయ

వేడి వేడి అన్నంలో కాస్త ముద్దపప్పు, కొంచెం ఆవకాయ పచ్చడి కలిపి.. మరి కాస్త నెయ్యి తగిలించి తింటే ఉంటుందీ… అబ్బబ్బ నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది. వెజిటేరియన్ అయినా.. నాన్ వెజెటేరియన్ అయినా సరే.. ఈ కాంబినేషన్ ఇష్టపడని తెలుగోడు ఒక్కరు కూడా ఉండరు.

పెసరట్టు – ఉప్మా

తమిళనాడోళ్లకి ఇడ్లీ సాంబార్ ఎలాగో.. మన తెలుగోళ్లకి పెసరట్టు ఉప్మా అలాగన్నమాట. ఈ పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఎవరు కనిపెట్టారో గానీ.. వాడికి దండేసి ఓ దణ్ణమెట్టొచ్చు. ఎప్పుడైనా హోటల్ కి టిఫిన్ చేయడానికి వెళితే.. చాలామంది పెసరట్టు ఉప్మా ఆర్డరివ్వడానికే చూస్తారంటే.. దీని టేస్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

గులాబ్ జామ్ – ఐస్ క్రీం

గులాబ్ జామ్ మన తెలుగు వంటకం కాకపోయినా.. ఈ మధ్య తెలుగువాళ్లంతా తెగ ఆరగిస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల భోజనాల్లో ఓ కప్పులో గులాబ్ జామ్ మరో కప్పులో ఐస్ క్రీం ఇచ్చేస్తున్నారు. ఆ రెండింటినీ విడివిడిగా తినడం కంటే.. కలిపి తింటేనే ఉంటుంది అసలు మజా. ఎప్పుడూ ఈ కాంబినేషన్ ప్రయత్నించలేదా? ఓ సారి ట్రై చేయండి.

రాగి సంకటి – నాటుకోడి పులుసు

ఇది పక్కా రాయలసీమ వంటకం. ఇది కూడా అద్భుత: అనిపించేలా ఉంటుంది. రాయలసీమ ప్రజల ఫేవరెట్ డిష్ ఇది. ఇది బయట దొరకడం కాస్త అరుదే. రాయలసీమకు చెందిన వాళ్ల హోటళ్లలో ఈ కాంబినేషన్ దొరకుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మళ్లీ మళ్లీ దానికోసం వెళ్లకపోతే అప్పుడు అడగండి.

గోంగూర – వేట మాంసం

మటన్ కి మసాలాలు దట్టించి, గోంగూర కలిపి వండితే వచ్చే టేస్ట్ కి మరో టేస్ట్ సాటి రాదు. మసాలా ఘాటు, గోంగూర పులుపుతో కాస్త ప్రత్యేకమైన రుచి ఈ కూర సొంతం. వేడి వేడి అన్నంలో గోంగూర మటన్ కూర కలుపుకుని తింటే.. ఈ జన్మకిది చాలు అన్న ఫీలింగ్ వస్తుందంటే నమ్మండి.

పనసపొట్టు – జీడిపప్పు

గోదావరి జిల్లాల వాసులకు సుపరిచితం ఈ కూర. పనసకాయ పిందెలు, జీడిపప్పు కలిపి వండుతారు. ఈ కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే. సాధారణంగా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు ఏర్పాటు చేసే భోజనాల్లో దీన్ని ప్రత్యేకంగా తయారు చేసి మరీ వడ్డిస్తారు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.