జాను సినిమా రివ్యూ

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష కలిసి చేసిన మ్యాజిక్ 96. ఇది అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాను బాగా ఆదరించారు. ఇప్పుడు అదే సినిమాను ‘జాను’ గా తెలుగులో రీమేక్ చేశారు. ఆ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత, శర్వానంద్ నాయికానాయకులుగా నటించారు. మరి ఈ జంట 96 మ్యాజిక్ ను రిపీట్ చేసిందా? ప్రేక్షకులను మెప్పించగలిగిందా? చూద్దాం.

కథేంటంటే..

రామచంద్ర (శర్వానంద్) ఓ సక్సెస్ఫుల్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్. అయినా జీవితంలో ఇంకేదో వెలితి కనిపిస్తూ ఉంటుంది. తాను ప్రేమించిన జానకీ దేవి(సమంత) తన జీవితంలో లేకపోవడమే దానికి కారణం. ఓసారి టూర్లో భాగంగా విశాఖపట్నానికి వెళతాడు. అక్కడ తాను చదువుకున్న స్కూల్ కి వెళతాడు. అక్కడ తన పాత రోజులు, పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అప్పుడే స్నేహితులతో కలసి రీయూనియన్ ఏర్పాటు చేస్తాడు. అక్కడకి జాను కూడా వస్తుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత జాను, రామ చంద్ర మళ్లీ ఒకరినొకరు చూసుకుంటారు. అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు? రీయూనియన్ తర్వాత ఇద్దరూ కలిశారా? ఆ తర్వాత వారిద్దరి జీవితం ఎలా కొనసాగింది? ఇదే సినిమా అసలు కథ.

విశ్లేషణ

96 సినిమాకు దర్వకత్వం వహించిన ప్రేమ్ కుమారే ఇక్కడ జానుని తెరకెక్కించాడు. కాబట్టి మాతృకలో ఉన్న ఫీల్ ను ఇక్కడ కూడా తీసుకు రావడంలో సక్సెస్ అయ్యాడు. తమిళ సినిమాలో విజయ్, త్రిష కలిసి చేసిన మ్యాజిక్ ను ఇక్కడ మళ్లీ తీసుకురాగలడా? అనే సందేహం జాను సినిమా చూడక ముందు ఉంది. కానీ సినిమా చూశాక జాను సినిమా దర్శకత్వ బాధ్యతలను ప్రేమ్ కుమార్ కు అప్పగించి దిల్ రాజు మంచి పని చేశాడనిపించక మానదు.

ఈ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. పదో తరగతిలో ప్రేమ, ఆ తర్వాత విడిపోవడం.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత కలవడం.. ఓ రాత్రంతా ఇద్దరూ కలసి గడపడం.. గతాన్ని నెమరువేసుకోవడం.. చూడటానికి ఏముందిలే అన్నట్టు ఉంటుంది. కానీ అందులోనే ఓ మ్యాజిక్ ఉంటుంది. వాస్తవానికి ఇదేమీ కొత్త కథ కాదు. నూటికి తొంభై శాతం మంది కథ. అందుకే ఇది ఎక్కువ మంది గుండె లోతుల్లోకి వెళుతుంది. కొన్ని సీన్లలో మనకు తెలియకుండానే మనకు కన్నీరు వస్తుంది. ముఖ్యంగా జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమలో పడినవారు.. ప్రేమించిన వ్యక్తికి దూరమైన వాళ్లు తెర మీద ఉన్న రామచంద్ర, జాను పాత్రల్లో తమను తాము చూసుకుంటారు.

మంచి ఫీల్ గుడ్ సినిమా అయినప్పటికీ.. ఇందులోనూ కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా.. స్లో నెరేషన్ ప్రేక్షకుడిని చాలా ఇబ్బంది పెడుతుంది. స్కూల్ సన్నివేశాల్లోనూ దర్శకుడు కొంత పొరపాటు చేశాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. 20 ఏళ్ల క్రితం జరిగిన స్కూల్ అనుభవాలను ఆ కాలానికి తగ్గట్టుగా కాకుండా.. కాస్త ఆధునికంగా చూపించాడు. దీంతో కొంత స్పష్టత కరువై లాజిక్ మిస్సయినట్లుగా కనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..?

సినిమా సినిమాకు నటుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటూ వెళుతున్నాడు శర్వానంద్. నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వా నటనకు పేరు పెట్టడానికి ఏమీ ఉండదు. ఈ సినిమాలోనూ అంతే. మొదటి నుంచి చివరి వరకు ముఖంలో కాస్త బాధ, కాస్త అమాయకత్వం కలిసిన ఎక్స్ ప్రెషన్ చాలా బాగా క్యారీ చేయగలిగాడు. రామచంద్ర పాత్ర శర్వానంద్ కెరీర్లో ఓ కలికితురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక సమంత విషయానికి వస్తే.. శర్వానంద్ కు ఏ మాత్రం తీసిపోకుండా నటించింది. చెప్పాలంటే.. తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చింది. తెలుగులో సమంత కంటే ఈ పాత్రకు మరో ఛాయిస్ లేదన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి ఎమోషన్ ను అద్భుతంగా పలికించింది.

రామచంద్ర, జాను పాత్రల ముందు మిగిలిన పాత్రలేమీ మనకు కనిపించవు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, వర్ష బొల్లమ్మ, శరణ్య ఎవరి పాత్రలకు తగ్గట్టుగా వారు నటించి మెప్పించారు.

సాంకేతికపరమైన అంశాలు

ఒక సినిమా ఫీల్ గుడ్ సినిమా అనిపించాలంటే.. అందులో ఎమోషన్స్ తో పాటు.. వాటిని ఎలివేట్ చేసే సంగీతం కూడా ముఖ్యం. లేదంటే.. సినిమా మొత్తం చప్పున నీరుకారిపోతుంది. కానీ జాను సినిమా మ్యాజిక్ క్రియేట్ చేయగలిగిందంటే.. దానికి గోవింద్ వసంత్ మ్యూజిక్ కారణం. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతా మనసుకి హత్తుకునేలా ఉంటుంది. ఈ మ్యూజిక్ కొన్నిచోట్ల మనసులోని జ్ఞాపకాలను తట్టి లేపితే.. మరికొన్ని చోట్ల బాధతో మనసుని బరువెక్కేలా చేస్తుంది. మహేంద్రన్ కెమెరా పనితనం కూడా బాగుంది. తక్కువ లొకేషన్లలోనే సినిమా తీసినా.. ఆ ఫీలింగ్ రాకుండా మాయ చేశారు. దిల్ రాజు నిర్మాణ విలువల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా అంతా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఇక దర్శకుడు ప్రేమ్ కుమార్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఓ అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని అందరికీ కనెక్టయ్యేలా తీర్చిదిద్దాడు. ఒక్క స్లో నెరేషన్ మినహా.. ఈ సినిమాకు పేరు పెట్టడానికి ఏమీ లేదు.

రేటింగ్: 3/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.