బిచ్చంగా వచ్చిన పది రూపాయలను సూపర్ స్టార్ ఏం చేశారు..?

సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ.. యువకుడిలా మారిపోతున్నారు. మరింత ఉత్సాహంతో నటిస్తున్నారు. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు.. అభిమానులు వెర్రెత్తిపోతారు. షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లు సైతం రజనీకాంత్ కి అభిమానులుగా ఉన్నారు. అలాంటి సూపర్ స్టార్ బయట చాలా సాధారణమైన దుస్తుల్లో ఉంటారు. అసలు కొన్నిసార్లు ఆ వస్త్రధారణలో గుర్తుపట్టడం కూడా కష్టమే. ఇలాంటి ఓ సందర్భంలోనే ఓ మహిళ ఆయన్ను చూసి బిచ్చగాడనుకుని పొరబడి 10 రూపాయలు బిచ్చం వేసింది. ఈ విషయం అందరికీ తెలుసు కానీ.. ఆ పది రూపాయలను సూపర్ స్టార్ ఏం చేశారో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్నే మనం తెలుసుకుందాం. ఈ విషయాన్ని రజనీ తన ఆత్మకథ ‘ది నేమ్ ఈజ్ రజనీకాంత్’లో చెప్పారు. చాలా పాత విషయమే అయినా.. నిత్యనూతనంగా ఉంటుందీ విషయం.

శివాజీ సినిమా విడుదలైన తర్వాత ఓ సారి రజనీకాంత్ సామాన్యమైన దుస్తుల్లో ఓ గుడికి వెళ్లారు. ఆ గుడిలో ఓ స్థంభానికి చేరబడి కూర్చున్నారట. అతన్ని చూసి బిచ్చగాడనుకుని ఓ నలభై ఏళ్లున్న మహిళ 10 రూపాయలు బిచ్చం వేసింది. రజనీకాంత్ వద్దన్నా వినకుండా వారిస్తూ ఆయన చేతిలో ఆ డబ్బులు పెట్టిందట. గుడి నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు రజనీ కాంత్ కారు ఎక్కడం గమనించిన ఆమె.. పరిగెత్తుకుంటూ వచ్చి క్షమాపణ అడిగి.. పది రూపాయలను తిరిగి ఇచ్చేయమని కోరిందట. కానీ దానికి రజనీ నిరాకరించి.. ఇలాంటి సందర్భాలు దేవుడి ముందు మనమంతా బిచ్చగాళ్లమనే విషయాన్ని అందరికీ గుర్తు చేస్తాయని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారట.

మరి ఆ పది రూపాయలను రజనీ కాంత్ ఏం చేశారు? ఆ పది రూపాలయకు మరో పది లక్షల రూపాయలను కలిపి అనాథ శరణాలయానికి దానం చేశారట. అందుకే కదా.. రజనీని నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ అని అనేది.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.