వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ

విజయ్ దేవరకొండ.. తన నటన, యాటిట్యూడ్ తో చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. విజయ్ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీనికి విజయ్ దేవరకొండ ఎంచుకునే కథలే దానికి కారణం. తాజాగా ప్రేమికుల దినోత్సవం నాడు వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ.. థియేటర్లలోకి వచ్చాడు. పైగా ఈ సినిమాలో శీనయ్య, గౌతమ్ అనే రెండు క్యారెక్టర్లతో నలుగురు హీరోయిన్లతో కలసి మరీ వచ్చాడు. చూద్దాం ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉన్నాడో..!!?

కథేంటంటే..?

గౌతమ్(విజయ్ దేవరకొండ) రైటర్ అవ్వాలనుకుంటాడు. కానీ పైసా సంపాదన లేకపోవడంతో.. తన అవసరాల కోసం తన గర్ల్ ఫ్రెండ్ యామిని(రాశిఖన్నా)పై ఆధారపడతాడు. యామిని దాన్ని కష్టం అనుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ ని రైటర్ గా మార్చడం కోసం శతవిధాలా సపోర్ట్ చేస్తుంటుంది. పైగా ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు. కానీ ఏడాదిన్నర గడిచిన తర్వాత అతన్ని భరించలేక వదిలి వెళ్లిపోతుంది. ఆ బాధలో పుస్తకం రాయడం మొదలుపెడతాడు గౌతమ్. ఆ పుస్తకమే వరల్డ్ ఫేమస్ లవర్. మరైతే.. శీనయ్య, సువర్ణ ఎవరు? శీనయ్యకు స్మితకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇజాకి గౌతమ్ కి ఉన్న రిలేషన్ ఏంటి? తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమా కాస్త ఢిఫరెంట్ గా తెరకెక్కింది. సినిమా ఆరంభంలోనే గౌతమ్, యామిని క్యారెక్టర్లు చెప్పే డైలాగులతో ప్రేక్షకుల మతి పోతుంది. ఎఫ్ వర్డ్స్, సెక్స్ , కాంట్రాసెప్టివ్ పిల్స్ గురించి చెప్పే డైలాగులు కొంచెం ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. గౌతమ్, యామినీ కథను చెప్పిన తర్వాత కథ శీనయ్య, సువర్ణ(ఐశ్వర్యా రాజేశ్) దగ్గరకు వెళుతుంది. వాస్తవానికి ఇది గౌతమ్ రాసే పుస్తకంలోని కథ. గౌతమ్ రాసిన వరల్డ్ ఫేమస్ లవర్ పుస్తకం చదివి ఎమోషనల్ అయిపోయిన తండ్రి దాన్ని తన సొంత డబ్బులతో పబ్లిష్ చేస్తాడు. క్లైమాక్సే లేని ఆ పుస్తకం మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఆ కథకు ముగింపు ఏంటని ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. కానీ అంత కనెక్టయిపోయేంత గొప్పతనం ఏదీ అందులో మనకు కనిపించదు. ఎందుకంటే.. ఆ కథనే మనమూ తెరపై చూస్తూ ఉంటాం కాబట్టి.

అలాగని ఈ సినిమాలో గుర్తుంచుకోదగిన సన్నివేశాలు ఏమీ లేవని కాదు. ఇల్లందు బొగ్గు గని బ్యాక్ డ్రాప్ లో సాగే శీనయ్య, సువర్ణ కథ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. వాస్తవానికి సిినిమా మొత్తానికి శీనయ్య, సువర్ణ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పుకోవాలి. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ అందరికీ నచ్చుతాయి. సువర్ణగా ఐశ్వర్యా రాజేశ్ అందరినీ కట్టి పడేస్తుంది. వీరిద్దరి దగ్గరనుంచి కథ ప్యారిస్ కి వెళుతుంది. అక్కడి వరకు కథ బాగానే ఉంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత సినిమా మొత్తం గజిబిజిగా మారిపోతుంది. ఈ కథ నుంచి ఆ కథకు.. ఆ కథ నుంచి మరో కథకు మారుతూ వస్తుంది. దీంతో తెరపై ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి సరిగా అర్థం కాకపోవచ్చు. ముఖ్యంగా ప్రధాన పాత్రలైన గౌతమ్, యామిని మధ్య ఒక ఎమోషన్ క్రియేట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి, తండ్రి నుంచి అంత సపోర్ట్ ఉన్నా.. గౌతమ్ ఎందుకు బాధపడతాడో, ఎందుకు మారిపోతాడో మనకు అర్థమే కాదు. దీంతో కథ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. అసలు కథే సైడ్ ట్రాక్ పట్టేయడంతో సినిమా బుర్రలోకి ఎక్కడు. అసలు కథ కంటే కొసరు కథ అయిన శీనయ్య, సువర్ణ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ ఎపిసోడ్ నే మొత్తం సినిమాగా మలిచి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

విజయ్ దేవరకొండ నటన గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలో అతడు నాలుగు పాత్రలతో నాలుగు రకాలుగా కనిపిస్తాడు. ముఖ్యంగా శీనయ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. చాలా కొత్తగా కనిపించాడు. మిగిలిన పాత్రల్లోనూ బాగానే నటించాడు. కానీ శీనయ్య పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. గౌతమ్ పాత్ర కాస్త అర్జున్ రెడ్డికి దగ్గరగా అనిపిస్తుంది. విజయ్ తర్వాత చెప్పుకోవాల్సింది ఐశ్వర్యా రాజేశ్ గురించి. తెరపై తక్కువ సమయమే కనిపించినా.. తన నటనతో అందరినీ మెప్పించింది. రాశిఖన్నా పాత్ర పరిధి ఎక్కువగా ఏమీ లేకపోయినా.. తను కూడా బాగానే చేసింది. కేథరీన్, ఇజాబెల్లా కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతికపరమైన అంశాలు

ప్రేమకథ అంటే.. దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఉండాలి. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ లో మనసుకి హత్తుకునే ఒక్క పాట కూడా లేదు. ఇది సినిమాకు చాలా మైనస్ పాయింట్. సాధారణంగా ప్రేమకథలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చే గోపీసుందర్ ఈ సినిమాకు మంచి సంగీతం ఇవ్వలేకపోయాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చెప్పుకోదగినంత గొప్పగా ఏమీ లేదు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ కి తగ్గట్టుగా విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు క్రాంతి మాధవ్ ఇల్లెందు ఎపిసోడ్ మినహా మిగిలిన సన్నివేశాలను అంత ప్రభావితంగా చూపించలేకపోయాడు. కథ, కథనంలో నిలకడలేనితనం వల్ల క్లాసిక్ గా నిలవాల్సిన సినిమా.. ఉస్సూరుమనిపించింది.

రేటింగ్: 2.5/5

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.