విడాకులకు మగాడి సంపాదనే ప్రధాన కారణమా?

పెళ్లి విషయంలో మన భారతీయులు కొన్ని విషయాల్లో చాలా పట్టింపులు ఉంటాయి. అందులో మొదటిది కులం. రెండోది ఆర్థిక స్థోమత. ఆర్థికంగా స్థిరపడిన వారికి కోడలిగా తమ కూతురిని పంపడానికే ప్రాధాన్యమిస్తారు. ఆస్తిపాస్తులు లేకపోతే.. వరుడి సంపాదన ఈ విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. మీరెప్పుడైనా పేపర్లలో వచ్చే పెళ్లి యాడ్స్ చూశారా? ‘మంచి కుటుంబానికి చెందిన లక్ష రూపాయల జీతం కలిగిన బీటెక్ గ్రాడ్యుయేట్ కి అందమైన వధువు కావలెను’ అని ప్రకటనలు ఇస్తూ ఉంటారు. పెద్దలు కుదిర్చిన వివాహం మాత్రమే కాదు.. ప్రేమ వివాహంలోనూ.. ఆర్థికపరమైన విషయాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆర్థికంగా స్థిరపడినవారికి మాత్రమే తమ కూతురుని ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తారు తల్లిదండ్రులు. దాన్ని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే.. స్థిరపడిన కుటుంబంలోకి వెళితే తమ కూతురు సుఖపడుతుందని వారి ఆలోచన. అందుకే ఎవరినైనా ప్రేమించినప్పుడు ఏ ఉద్యోగం చేస్తాడు? ఎంత సంపాదిస్తాడు? అని గుచ్చి గుచ్చి అడుగుతుంటారు. పెళ్లి విషయంలోనే కాదు.. విడాకుల విషయంలోనూ ఆర్థికపరమైన విషయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయట. ముఖ్యంగా పురుషుడి సంపాదన కారణంగానే విడాకులు ఎక్కువ మంది తీసుకుంటున్నారట. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కారణాలు తరచి చూద్దాం.

తన కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుండటం

ఈ మధ్య కాలంలో మహిళలు కూడా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండగలుగుతున్నారు. మంచి ఉద్యోగం చేస్తూ అధిక మొత్తంలో జీతం తీసుకుంటున్నారు. తన కంటే తన భార్య సంపాదన అధికంగా ఉన్నప్పుడు అది మగవాడి ఇగోని కాస్త దెబ్బ తీస్తుందంట. ఆ ఇగో కారణంగా చిన్న చిన్న మనస్పర్థలు మొదలవుతున్నాయి. అవే చిలికి చిలికి గాలివానలా తయారయ్యి విడాకులకు దారి తీస్తున్నాయి. అయితే ఇది అందరిలోనూ కాదు. తన కంటే తన భార్య ఎక్కువ సంపాదిస్తుంటే.. ఆ విషయాన్ని ఆనందంగా చెప్పుకునే భర్తలు కూడా ఉన్నారు.

బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం

ఆదాయం తక్కువగా ఉంటే.. దానికి తగ్గట్టే అవసరాలను సైతం తగ్గించుకుని ఉన్నంతలో సౌకర్యంగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా.. భార్యాబిడ్డల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. తన అవసరాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ ఉంటే.. మాత్రం ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగదని చెబుతున్నారు. ఒకవేళ కొనసాగినా భార్యాభర్తల మధ్య అనుబంధం మాత్రం అంతంతమాత్రమంగానే ఉంటుందట.

పెళ్లిలోనే కాదు ప్రేమలోనూ ఉద్యోగం కీలకమే..

ఉద్యోగం లేనివారితో పోలిస్తే.. ఉద్యోగం ఉన్నవారు.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని అబ్బాయిలు ప్రేమ, డేటింగ్ విషయంలో ధైర్యంగా ముందడుగు వేయగలుగుతున్నారు. అమ్మాయిలు సైతం జీవితంలో స్థిరపడిన అబ్బాయిలతో కలసి జీవితం పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.

అలాగని ఆర్థికపరమైన అంశాలే.. విడాకులకు కారణమవుతున్నాయనుకుంటే పొరపాటే. అక్రమ సంబంధాలు, గృహహింస, మద్యపానం అలవాటు, వరకట్న వేధింపులు తదితరమైన కారణాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.