శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేయాలి?

శివుడు లయకారుడు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు.

శివుడు లింగరూపుడు.. తాను విశ్వంలో అణువణువునా ఐక్యమై.. విశ్వాన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు.

శివుడు భక్త సులభుడు.. తలచినంతనే పొంగిపోయి వరాలు కురిపిస్తాడు.

ఆ పరమశివుని అనుగ్రహం కోసం మహాశివరాత్రి నాడు భక్తులు జాగరణ చేస్తారు. ఈ జాగరణనే కొన్ని ప్రాంతాల్లో జాగారం అని కూడా పిలుస్తారు. అసలు శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేయాలి? చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితం లభిస్తుంది?

సాధారణంగా ప్రతి నెలా కృష్ణ పక్షం బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి జరుపుకుంటారు. కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు లింగోద్భవం జరుగుతుంది. అందుకే ఈ శివరాత్రిని మహా శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు.

శివరాత్రి నాడు ఉదయమే నిద్ర లేచి స్నానాదులు ముగించుకుని శివదర్శనం చేసుకుంటారు. అంతేకాదు.. ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. మళ్లీ సాయంత్రం శివార్చన జరిపి ఆ రాత్రంతా జాగరణ చేస్తారు. 

జాగు అంటే నాలుగు గంటలు. సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు నాలుగు జాగులు. జాగుకోసారి అంటే ప్రతి నాలుగు గంటలకోసారి శివలింగార్చన చేయడం మిగిలిన సమయాన్ని శివనామస్మరణతో గడపడాన్నేజాగరణ అంటారు.

శివరాత్రి రోజు జాగారం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మిక. అందుకే ఉదయం నుంచి ఉపవాసం ఉండి.. సాయంత్రం అయ్యాక శివనామస్మరణలో కాలం గడుపుతారు. మరుసటి రోజు శుచిగా స్నానం చేసి శివుడికి నైవేద్యం పెట్టడంతో జాగరణ పూర్తవుతుంది.

ఈ జాగరణ సమయంలో మనసంతా శివుడిపై లగ్నం చేసి భక్తిప్రపత్తులతో పంచాక్షరీ మంత్రం జపించాల్సి ఉంటుంది. అలాగే శివలింగానికి జరిపే అభిషేకాలను, పూజలను తిలకించాలి. అంతేకాని.. ఇతర వినోద కార్యక్రమాలు చూస్తూ గడపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.