అతనికి మీ మీద మోజు తగ్గిందా? కారణం ఇదేనేమో..

ఇద్దరి మధ్య అనుబంధం మొదలైనప్పుడు.. అన్నీ బాగానే ఉంటాయి. సరదాగా సమయం గడపడం, బయటకు వెళ్లి ఎంజాయ్ చేయడం, కబుర్లతో కాలక్షేపం చేయడం, ఒకరి కోసం మరొకరు తపించిపోవడం.. జీవితమంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంటారు. కానీ ఉన్నట్టుండి అతనిలో ఏదో మార్పు. మీతో గడిపే సమయాన్ని తగ్గించేస్తుంటాడు. మీరే చొరవ తీసుకున్నా పెద్దగా పట్టించుకోడు. అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక తల్లడిల్లిపోతుంటారు. అసలు అబ్బాయిలకు ఉన్నట్టుండి తనతో రిలేషన్లో ఉన్న అమ్మాయికి ఎందుకు దూరంగా ఉండటం మొదలుపెడతారు? దానికీ కొన్ని కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆలోచనలు వేరుగా ఉండటం

ఒక వ్యక్తిని మనం మొదటిసారి చూసినప్పుడు వారి గురించి మనకు తెలిసేది చాలా కొంచెమే. మొదటి పరిచయంలోనే వారి వ్యక్తిత్వం నచ్చినట్టు మనకి అనిపించవచ్చు. కానీ కొంత కాలం కలిసి గడిపిన తర్వాత ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్థమవుతుంది. ఒకరి గురించి మరొకరు తెలుసుకోకుండా రిలేషన్షిప్ మొదలుపెట్టినప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా ఇద్దరి లక్ష్యాలు, అలవాట్లు వేరయినప్పుడు అబ్బాయికి అమ్మాయిపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది.

పనులతో బిజీబిజీ

ఈ మధ్య కాలంలో యువతరం అంతా చాలా బిజీబిజీగా గడుపుతోంది. క్షణం కూడా తీరిక లేనంతగా గడుపుతున్నారు. రోజులో ఎక్కువ భాగం విధి నిర్వహణలోనే గడిపేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు. పని ఒత్తిడి కూడా మీకు దూరంగా ఉండే పరిస్థితి తీసుకురావచ్చు. పైగా అతనికి ముఖ్యమైన పనుుల కూడా ఉండి ఉండొచ్చు.

రిలేషన్షిప్ సీరియస్ గా తీసుకోకపోవడం

రిలేషన్షిప్ విషయంలో అమ్మాయిలు కాస్త సీరియస్ గానే ఉంటారు. ఇలాంటివారు ఈ విషయాన్ని లైట్ తీసుకునే అబ్బాయి ప్రేమలో పడితే..కొంత కాలం తర్వాత బాధపడక తప్పని పరిస్థితి ఎదురుకావచ్చు. ఎందుకంటే వీరికి కమిట్మెంట్ తక్కువ. ఇలాంటి వారితో పొరపాటున ప్రేమలో పడితే.. ఆ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుని అనుబంధానికి విలువనిచ్చేవారితో జీవితం కొనసాగించడం మేలు.

మరొకరితో పరిచయం ఏర్పడటం

వేరొక అమ్మాయి పరిచయం అవ్వడం, ఆమె నచ్చడం వల్ల మీకు దూరమైతే.. ఆ పరిస్థితి చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం రెండు విషయాలను గమనించాలి. మొదటిది.. అతనితో మీరు ఎంత క్లోజ్ గా మెలుగుతున్నా.. అతన్ని మనసుని టచ్ చేసేంతగా మీ మార్క్ చూపించలేకపోవడం. రెండోది.. అతడు మిమ్మల్ని మంచి స్నేహితుడిగా మాత్రమే చూడటం. దీనివల్ల అతడి మనసుకి నచ్చిన అమ్మాయి కనిపించగానే.. మీకు కొంచెం దూరంగా జరగొచ్చు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.