కండోమ్స్ లో ఎన్ని రకాలున్నాయో మీకు తెలుసా?

ఈ మధ్య కాలంలో.. కండోమ్స్ వినియోగం పెరిగింది. లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భధారణ జరగకుండా ఉండటానికే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి నూటికి నూరు శాతం ఫలితాన్నివ్వలేకపోవచ్చు. కానీ వీటిని ఉపయోగించడం సులువు. పైగా తక్కువ ధరలోనే దొరుకుతాయి. చాలా మందికి వీటి విషయంలో ఎన్నో సందేహాలుంటాయి. అందులోనూ ఈ మధ్యే వాటిని ఉపయోగించడం మొదలు పెట్టినవారికి కండోమ్స్ విషయంలో అనుమానాలు చాలానే ఉంటాయి? అసలు వాటిని ఎలా ఉపయోగించాలి? పొరపాటున కండోమ్ చిరిగిపోతే ఏం జరుగుతుంది? దాన్ని ఉపయోగించడం వల్ల సెక్స్ లైఫ్ ఏమైనా ఎఫెక్టవుతుందా? లాంటి లెక్కలేనన్ని ప్రశ్నలు వారి మెదళ్లను తొలిచేస్తుంటాయి. ఇక్కడ అలాంటి సందేహాలను తీర్చడంతో పాటు.. వాటి గురించి పూర్తి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం.

కండోమ్స్ ఎందుకు ఉపయోగించాలి?

సెక్స్ లో పాల్గొనేటప్పుడు కండోమ్ ఉపయోగించడం వల్ల అది రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎస్టీడీ(సెక్సువల్ ట్రాన్స్మిషన్ డీసీజెస్) లుె మీకు సోకకుండా కాపాడుతుంది. ఎస్టీడీస్ అంటే హెచ్ ఐవీ, గనేరియా, క్లామీడియా లాంటివన్నమాట. వీటితో పాటు ఇన్షెక్షన్లు కూడా ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉంటాయి. అలాగే అవాంఛిత గర్భం(అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ) రాకుండా ఉంటుంది. కండోమ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. లాటెక్స్ వల్ల మీకు ఎలర్జీలు లాంటివి ఏదైనా వస్తాయనిపిస్తే.. నాన్ లాటెక్స్ కండోమ్స్ ఉపయోగించవచ్చు.

కండోమ్స్ లో ఎన్ని రకాలున్నాయి?

టెక్స్చర్డ్ కండోమ్స్: వీటిలో రెండు రకాలుంటాయి. డాటెడ్, రిబ్డ్ కండోమ్స్. వీటివల్ల సెక్స్ లో పాల్గొనే భాగస్వాములిద్దరికీ ఆ సౌఖ్యం బాగా కలుగుతుంది.

ఎక్స్ ట్రా థిన్ కండోమ్స్: కండోమ్ చాలా మందంగా ఉందని అనుకునేవారికి ఈ తరహా కండోమ్స్ మంచి ఛాయిస్. అయితే ఇవి మరీ పలచగా ఉండటం వల్ల కలయిక సమయంలో అవి చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎక్స్ ట్రా సేఫ్ కండోమ్స్ : ప్రెగ్నెన్సీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని భావించేవారు ఈ ఎక్స్ ట్రా సేఫ్ కండోమ్స్ ఉపయోగించవచ్చు. ఇవి కాస్త మందంగా ఉండటం వల్ల ఇవి చిరగడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి అవాంఛిత గర్భం, ఎస్టీడీలు రాకుండా ఉంటాయి.

లాటెక్స్ ఫ్రీ కండోమ్: సాధారణంగా కండోమ్స్ అంటే లాటెక్స్ తోనే తయారు చేస్తారు. అయితే దాని వల్ల కొందరిలో అలర్జీలు వస్తాయి. అలాంటి వారు లాటెక్స్ ఫ్రీ కండోమ్స్ ఉపయోగించడం మంచిది.

ఫెర్మార్మెన్స్ ఎన్ హాన్సింగ్ కండోమ్స్: కాస్త ఎక్కువ సమయం సెక్స్ లో పాల్గొనాలనే ఆలోచనలు ఉన్నవారికి, కలయికను ఎంజాయ్ చేయాలనుకున్నవారికి ఈ తరహా కండోమ్స్ సరైన ఎంపిక.

ఫ్లేవర్డ్ కండోమ్స్: కండోమ్స్ లో స్ట్రాబెర్రీ, చాక్లెట్ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ కండోమ్ ఎంచుకొని వాడుకోవచ్చు.

ఫీమేల్ కండోమ్స్: చాలామందికి ఫీమేల్ కండోమ్స్ ఉన్నాయనే విషయం కూడా తెలియదు. మహిళల కోసం తయారు చేసిన ఈ కండోమ్స్ మొదట ఉపయోగించడం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ఆ తర్వాత వాటిని ఎలా వాడాలో అర్థమవుతుంది.

స్పెర్మిసైడల్ కండోమ్స్: అవాంఛిత గర్భం రాకుండా కండోమ్ ఆపుతుంది. కానీ పొరపాటున అది చిరిగిపోతే..? గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి భయం లేకుండా సెక్స్ ని ఆస్వాదించాలంటే.. స్పెర్మిసైడల్ కండోమ్ ఉపయోగించడం మంచిది. ఇది డబుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. పొరపాటున ఈ కండోమ్ చిరిగిపోయినా.. వీర్యకణాలను చంపేస్తుంది. కాబట్టి స్పెర్మ్ గర్భాశయంలోకి చేరినా.. గర్భం రాదు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.