విజయ్ దేవరకొండకి అక్కడైనా కలిసొస్తుందా..?

టాలీవుడ్ లో అందం, నటన అనగానే గుర్తొచ్చే పేర్లలో విజయ్ దేవరకొండ ఒకటి. తన లుక్స్, యాటిట్యూడ్, వైవిధ్యమైన నటనతో తక్కువ టైంలోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు విజయ్. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ ని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ పేరు బాలీవుడ్ లో కూడా మార్మోగిపోయింది. అయితే ఈ మధ్య వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఈ హీరోకి నిరాశనే మిగిల్చాయి. దీంతో రూట్ మార్చిన విజయ్ పాన్ ఇండియా మూవీకి సిద్దమయ్యాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చార్మీ, పూరి, కరణ్‌ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్యా పాండే కథానాయిక.

తెలుగు హీరోలు బాలీవుడ్ లో నటించడం కొత్తేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాంచరణ్ డైరెక్ట్ హిందీ చిత్రాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అక్కడ ఆడియన్స్, నిర్మాతలను మెప్పించలేకపోయారు. ముఖ్యంగా అక్కడి భాష మనకు ప్రధాన సమస్య అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు టైం మారింది. మన సౌత్ సినిమాలకు నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. రానా దగ్గుబాటి, సుధీర్ బాబు వంటి నటులు అడపాదడపా బాలీవుడ్ లో మెప్పిస్తున్నారు. దీంతో మన దేవరకొండ కూడా బాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్నాడు. వాస్తవానికి డియర్ కామ్రేడ్ సినిమాతోనే విజయ్ అడుగుపెట్టాల్సి ఉంది. అయితే ఆ సినిమా రిజల్ట్ కొంత అడ్డుపడింది. మంచి నటన, ఫ్యాషన్ సెన్స్, మాటకారితనం ఉన్న విజయ్ దేవరకొండ హిందీ జనాలని ఆకట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక హీరో ను స్టైలిష్ గా చూపించడంలో పూరి ఎప్పుడు ముందుంటాడు. ఇప్పటికే హిందీలో సినిమా తీసిన అనుభవం కూడా ఉంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫామ్ లోకి కూడా వచ్చాడు. ఈ సినిమాకి కరణ్ జోహార్ ప్లస్ కానున్నాడు. సినిమా ప్రచారానికి ఆయన టెక్నిక్స్ ప్లస్ అవుతాయి. ఎలా చూసినా విజయ్ బాలీవుడ్ అరంగేట్రం సజావుగానే సాగుతోంది. ఇక బాలీవుడ్ ఫ్యాన్స్ రౌడీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.