కరోనా వైరస్ ఫేస్ మాస్క్: ఎప్పుడు ఎలా ధరించాలి?

ప్రస్తుతం మనం లాక్ డౌన్లోనే ఉన్నప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనల్ని మనమే కాపాడుకోవాల్సిన ఆవశ్యకత పెరిగింది. కరోనాను ఎదుర్కోవాలంటే.. వ్యక్తిగత పరిశుభ్రతను మించిన మార్గం మరొకటి లేదు. అందులో భాగంగానే శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు, మాస్క్ ల వినియోగం పెరిగింది. మిగిలిన రెండింటి విషయంలో మనకు క్లారిటీ ఉంది కానీ.. మాస్క్ ల విషయంలో మాత్రం చాలా సందేహలున్నాయి అందరికీ. కరోనా వైరస్ మన దరికి చేరకుండా ఉండాలంటే.. ఎలాంటి మాస్క్ ఉపయోగించాలి? అసలు మాస్కుల్లో ఎన్ని రకాలున్నాయి? పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్లినప్పుడు ఎలాంటి మాస్క్ ఉపయోగిస్తే.. కరోనా మనకు అంటుకోకుండా ఉంటుంది. వాటిని ఎలా ఉపయోగించాలి? తెలుసుకుందాం.

మాస్కుల్లో రకాలు

సర్జికల్ ఫేస్ మాస్క్

ఇవి డిస్పోజబుల్ ఫేస్ మాస్క్ లన్నమాట. సాధారణంగా వీటిని సర్జరీలు చేసేటప్పుడు, చికిత్స అందించేటప్పుడు వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ధరిస్తుంటారు. ఈ మాస్కులు మన నోరు, ముక్కు నుంచి వైరస్, నీటి తుంపరలు, బయటకు రాకుండా ఆపుతుంది. ముఖ్యంగా మీకు దగ్గు, జలుబు, తుమ్ములు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు మీ నుంచి వైరస్ ఇతరులకు సోకుండా ఇది కాపాడుతుంది.

రెస్పిరేటరీ మాస్క్స్

వీటినే ఎన్95(N 95) మాస్కులని పిలుస్తారు. గాలిలో ఉండే క్రిములు మన శ్వాస వ్యవస్థలోకి చేరకుండా ఈ మాస్కులు అందుకుంటాయి. అసలు ఈ మాస్క్ కి ఎన్ 95 అని పేరెందుకు పెట్టారో తెలుసా? గాల్లో ఉన్న 95 % వరకు ధూళికణాలు, వైరస్ లు ఇతర హానికారకాలను ముక్కు, నోటిలోకి చేరకుండా కాపాడుతుంది. ఈ మాస్క్ కరోనా వైరస్ ను కూడా మన శ్వాస వ్యవస్థలోకి చేరకుండా సమర్థంగా అడ్డుకుంటుంది.

ఫేస్ మాస్క్ ఎలా ఉపయోగించాలి?

మాస్క్ పెట్టుకోవాలి కదా అని మీకు నచ్చినట్టుగా పెట్టుకుంటే దాని వల్ల ఉపయోగమేమీ ఉండదు. దానికి కూడా మనం ఓ పద్ధతి పాటించాల్సి ఉంటుంది.

మీరు సర్జికల్ మాస్క్ వేసుకోవాలనుకుంటే.. దానికున్న మడతలు కింది వైపుకి ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆ మాస్క్ ని ముక్కు, నోరు, గడ్డం పూర్తిగా కవరయ్యేలా చూసుకుని కాస్త బిగుతుగా కట్టుకోవాలి. లేదంటే.. మాస్క్ కి ముఖానికి మధ్య ఖాళీ ఏర్పడి వైరస్ మీ రెస్పిరేటరీ సిస్టమ్ లోకి ప్రవేశిస్తుంది.

  • అలాగే మాస్క్ ను ఒకసారి పెట్టుకున్నాక దాన్ని పదే పదే ముట్టుకోవద్దు.
  • ఒకసారి మాస్క్ పెట్టుకున్న తర్వాత దాన్ని కిందకి లాగి మెడలో వేలాడేసుకోవద్దు.
  • ప్రతి ఆరు గంటలకోసారి లేదా మాస్క్ తడిగా అయిందనిపించిన ప్రతిసారీ మాస్క్ మార్చుకోవాల్సి ఉంటుంది.
  • మాస్క్ తీసేసేటప్పుడు దాని వెలుపలి భాగాన్ని టచ్ చేయకూడదు. ఎందుకంటే.. హానికారకమైన బ్యాక్టీరియా, వైరస్ లున్నీ అన్నీ అక్కడే ఉంటాయి.
  • ఒకసారి ఉపయోగించిన మాస్క్ ను మూత ఉన్నడస్ట్ బిన్లో వేయాలి.
  • మాస్క్ తీసేసిన తర్వాత చేతులను సోప్ లేదా హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. లేదా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలి.

అసలు మాస్కులు ఎప్పుడు ధరించాలి?

డబ్ల్యూహెచ్వో చెప్పినదాని ప్రకారం ఈ కింది సందర్భాల్లో మాస్క్ ధరిస్తే సరిపోతుంది.

  • కరోనా పాజిటివ్ గా నిర్ధారించిన వ్యక్తి బాధ్యతలను మీరు చూస్తున్నప్పుడు
  • మీకు దగ్గు, జలుబు ఉన్నప్పుడు
  • డాక్టర్ ను కలవడానికి వెళుతున్నప్పుడు
  • శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.