ఈ సమస్యలున్నాయా? అయితే సెక్స్ థెరపిస్ట్ ను సంప్రదించాల్సిందే..

లైంగిక పరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రతి ఒక్కరికీ మొదట వచ్చే ఆలోచన.. ఇలా నాకు మాత్రమే అవుతుందేమో అని. కాకపోతే.. అది నిజం కాదు. సెక్స్ విషయంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. శృంగారం మనకు ఆనందాన్నిచ్చేదే. కానీ కొన్ని సార్లు అదే ఇబ్బందులను కలిగిస్తుంది. శారీరకంగా, మానసికంగా కూడా. వాటి కారణంగా.. సెక్స్ అంటేనే భయపడిపోతుంటారు. శృంగారంలో పాల్గొనడం కాదు. అసలు దాని గురించి భాగస్వామితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితి మీక్కూడా ఎదురైతే.. మీరు చేయాల్సిన పని మొదటి పని సెక్స్ థెరపిస్ట్ ను సంప్రదించి కౌన్సెలింగ్, చికిత్స తీసుకోవడం. అయితే ఎలాంటి సందర్భాల్లో నిపుణులను సంప్రదించాల్సి వస్తుంది. తెలుసుకుందాం.

ఉన్నట్టుండి సెక్స్ పై ఆసక్తి కోల్పోవడం

కొన్నిసార్లు మూడ్ సరిగ్గా లేకపోవడం, మరికొన్ని సార్లు సెక్స్ లో పాల్గొనాలనే ఆసక్తి లేకపోవడం వల్ల శృంగారానికి దూరంగా ఉంటారు. అయితే ఇలా జరగడానికి ఇదే కారణమై ఉండొచ్చని చెప్పలేం. కాబట్టి భాగస్వామి పట్ల మీకు ఎందుకు నిరాసక్తత పెరిగిందో కచ్చితమైన కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మీరు సొంతంగా కారణాన్ని అన్వేషించడం మాని వీలైనంత తొందరగా సెక్స్ థెరపిస్ట్ ను సంప్రదించడం మంచిది. వారు మీ నిరాసక్తతకు కారణాన్నితెలుసుకోవడంతో పాటు మీకు అవసరమైన కౌన్సెలింగ్ కూడా చేస్తారు. దీంతో సమస్య నుంచి తొందరగా బయటకు రావచ్చు.

ఆ సమయంలో నొప్పి లేదా అసౌకర్యం

సెక్స్ లో పాల్గొన్నప్పుడు కొన్నిసార్లు నొప్పిగా లేదా అసౌకర్యంగా అనిపిస్తుంటే.. మీరు సంబంధిత నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అయితే ఆ సమయంలో శారీరకంగా అసౌకర్యంగా లేకపోయినా నొప్పి ఉంటే.. దానికి యూరిన్ ఇన్ఫెక్షన్ లేదా మరేదైనా కారణం ఉండి ఉండొచ్చు. కాబట్టి వీలైనంత తొందరగా సెక్స్ థెరపిస్ట్ ను సంప్రదించి దానికి అవసరమైన చికిత్సను తీసుకోవడం మంచిది. అప్పుడే సమస్య నుంచి త్వరగా బయటపడగలం.

ఆర్గాజమ్ కలగకపోవడం

ఎన్ని రకాల ట్రిక్స్, టిప్స్ ప్రయత్నించినా కొందరు ఆర్గాజమ్ చేరుకోలేరు. ఇలాంటి పరిస్థితి ఉన్నట్టుండి మీకు ఎదురైతే.. మీకు, మీ భాగస్వామికి మధ్య ఉన్న కెమిస్ట్రీలో ఏదో మార్పు వచ్చినట్టే. కాబట్టి కౌన్సెలింగ్ అవసరం రావచ్చు. అలాగే ఆరంభం నుంచి మీకు ఆర్గాజమ్ అనుభవమవకపోయినా ఏదో సమస్య ఉన్నట్టే లెక్క. దీనికి కూడా సెక్స్ థెరపిస్ట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

ఎక్కువగా మాస్టర్బేట్ చేసుకోవడం

మిమ్మల్ని మీరు తృప్తి పరచుకోవడానికి హస్త ప్రయోగం బాగానే ఉంటుంది. పైగా సెక్స్ విషయంలో మీ శరీర అవసరాలు కూడా మీకు తెలుస్తాయి. కానీ ఉన్నట్టుండి మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకుంటే మాత్రం ఏదో సమస్య ఉన్నట్టే లెక్క. పైగా అది మీ లైంగిక జీవితంలో భాగస్వామి అవసరాన్ని పక్కన పెట్టేసేలా చేయచ్చు. ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని పూర్తిగా బయటకు తీసుకురాగలిగేది సెక్స్ థెరపిస్టే కాబట్టి.. వారిని సంప్రదించి పరిష్కారం పొందడం మంచిది.

సెక్స్ గురించే రోజంతా ఆలోచించడం

గత కొన్ని రోజులుగా మీ ప్రతి ఆలోచన సెక్స్ చుట్టూనే తిరుగుతుందా? ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేకపోతున్నారా? మీ భాగస్వామితో సెక్స్ లో పాల్గొనాలనే ఆలోచన మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వడం లేదా? సాధారణంగా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే.. సెక్స్ ఎడిక్షన్ తో ఇబ్బంది పడుతున్నారని అర్థం. కాబట్టి వీలైనంత త్వరగా సెక్స్ థెరపిస్ట్ ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడతారు. లైంగిక జీవితం సైతం ఆరోగ్యంగా మారుతుంది.

మీ కోరికలు, భాగస్వామి కోరికలు వేర్వేరుగా ఉండటం

సెక్స్ విషయంలో భాగస్వాములిద్దరి కోరికలు, అంచనాలు, ఫాంటసీలు పొంతన లేకుండా ఉంటే.. శృంగారాన్ని ఆస్వాదించలేకపోవచ్చు. అదెలాగంటే.. మీకు ఓరల్ సెక్స్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు. మీ భాగస్వామికి అదంటే బాగా ఇష్టమై ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరినొకరు సంత్రుప్తి పరుచుకోవడం దాదాపుగా అసాధ్యమే అవుతుంది. మీ ఇద్దరినీ ఒక కామన్ గ్రౌండ్ కి తీసుకొచ్చి ఒకరినొకరు సాటిస్ఫై చేసుకోగలిగేలా కౌన్సెలింగ్ సెక్స్ థెరపిస్ట్ మాత్రమే ఇవ్వగలుగుతారు.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.