ఈ సినిమాలు చూసి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోండి

సెక్స్, రొమాన్స్ ఇవి రెండూ జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఇవి లేకపోతే జీవితం చప్పగా సాగిపోతుంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్లో ఉన్నాం. అంటే ఎక్కువ సమయం భాగస్వామితో గడిపే అవకాశం ఉంటోంది. దానికి తగ్గట్టుగానే ఇటీవలి కాలంలో కండోమ్ లు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండే చేసే పిల్స్ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఎలాగూ భాగస్వామితో రొమాంటిక్ గా సమయం గడుపుతున్నారు కాబట్టి.. తనతో కలసి కొన్ని సెక్స్ కి సంబంధించిన సినిమాలు చూస్తూ మీ మూడ్ కి మరింత స్పైస్ ను జోడించండి.

లై విత్ మి

లైలా, డేవిడ్ ఇద్దరూ ఓ నైట్ క్లబ్ లో కలుసుకుంటారు. ఇద్దరికీ అంతకు ముందు పరిచయం లేదు. అయినా.. ఇద్దరూ కలయికలో పాల్గొంటారు. ఆ తర్వాత డేవిడ్ గారు తన గర్ల్ ఫ్రెండ్ ని, లైలా గారేమో బాయ్ ఫ్రెండ్ ని వదిలేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి హాయిగా సమయం గడిపేస్తుంటారు. కానీ ఉన్నట్టుండి లైలాకి డేవిడ్ తో రిలేషన్సిప్ కొంచెం ఇబ్బందిగా అనిపించడం మొదలవుతుంది. నెమ్మదిగా తనో ట్రాప్ లో ఇరుక్కున్నట్టు ఫీలవుతుంది. లైలాకి ఎందుకలా అనిపించింది? అనుమానం కలిగేలా డేవిడ్ ఏం చేశాడు? తెలుసుకోవాలంటే లై విత్ మి సినిమా చూడాల్సిందే.

కిల్లింగ్ మి సాఫ్ట్లీ

అన్ని విధాలా జీవితంలో మంచి స్థితిలో ఉన్నఓ అమ్మాయి వైల్డ్ సెక్స్ కోసం తనకున్న లగ్జరీలన్నింటినీ కాదనుకుంటుంది. ఒకరోజు అపరిచిత వ్యక్తితో జరిపిన సంభోగం తన ఆస్తిపాస్తులను, తన కుటుంబాన్ని, చివరికి బాయ్ ఫ్రెండ్ ని కూడా కాదనుకునేలా చేస్తుంది. అంతలా ఆమెను అన్నీ వదులుకునేలా అంత గొప్పగా ఆ అపరిచిత వ్యక్తి ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో కథానాయికగా హీథర్ గ్రాహం నటించింది.

టై మి అప్! టై మి డౌన్!

తన మాజీ ప్రియురాలితో కలసి తన జీవితాన్ని కొనసాగించేందుకు కథానాయకుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే.. ఆ అమ్మాయి ఇతగాడిని గుర్తు పట్టలేదు. దీంతో ఆమెను తిరిగి ఆకట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆ అమ్మాయి కాళ్లు చేతులు కట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయి టై మి అప్! టై మి డౌన్! అని ఎందుకు అంది. తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

క్రూయల్ ఇంటెన్షన్స్

హైస్కూల్లో చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు, ఓ అబ్బాయి మధ్య సాగే కథ ఇది. పగ, ప్రతీకారం, బ్లాక్ మెయిల్, బెట్, సెక్స్ చుట్టూ తిరిగే కథ ఇది. 1999లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

సెక్రటరీ

అసలే కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడే అమ్మాయికి ఆఫీసులో బాస్ కూడా ఓ సమస్యగా మారితే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే నెమ్మదిగా తన బాస్ తో ఆమెకు రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అది కాస్తా బీడీఎస్ఎమ్ రిలేషన్ గా రూపాంతరం చెందుతుంది. అసలు దానివల్ల ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు బాస్ తో సెక్సువల్ రిలేషన్ పెట్టుకోవడానికి కారణమేంటి? తెలుసుకోవాలంటే సెక్రటరీ సినిమా చూడాల్సిందే.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.